S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వార్డులపై లొలి!్ల

శ్రీకాకుళం: శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల పునర్విభజనలో కొంతమంది ఐఎఎస్‌లు తప్పిదాలు చేశారన్న ఆరోపణలు విపక్షాలు చేస్తున్నాయి. జీవోఎంఎస్‌నెం570 ఎంఎ తేదీ 6.11.1996 ప్రకారం ఈ నెల 18వ తేదీన ఆర్‌సినెం.2330/2016తో ఫారం-1, రూల్-8 ప్రకారం 50 వార్డుల విభజనలో ఇక్కడ ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకుల కనుసన్నల్లో సర్దుబాట్లు చేశారన్న ఆరోపణలతో న్యాయస్థానంలో పిటిషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకరిద్దరు మాత్రమే ఇటువంటి పబ్లిక్ ఇంట్రస్టు లిటిగేషన్ పిటిషన్లు వేసేందుకు సాహసిస్తే అధికారపార్టీపై విపక్షపార్టీలు చేసే కుట్రపూరితమైన చర్యలుగా భావించవచ్చు. కానీ - వందలాది మంది నివాసితులు వార్డుల విభజన అశాస్ర్తియంగా నిర్వహించారంటూ న్యాయస్థానం ముందు పోరాటానికి సంసిద్ధమవుతున్నారు. సామాన్య ప్రజలకు వార్డుల విభజన, కార్పొరేషన్ ఎన్నికలు, అభ్యర్ధుల ఎంపిక అనే అంశాలతో సంబంధం లేదు. కాని - మురికివాడలను బలహీనపడిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు బలాన్ని చేకూర్చేవిధంగా ఓట్ల జాబితా మార్పిడి కోసం భౌగోళిక హద్దులు చేర్పులుమార్పులు చేయడం వల్ల దారిద్య్రరేఖకు దిగువన్ను వారంతా దిక్కులేకుండా, సర్కార్ పథకాలు అర్ధాంతరంగా నిలిచిపోతాయన్న భయం వారిని వాజ్యం వేసేలా అడుగులు వేయిస్తోంది. ముసాయిదాను రూపొందించడంలో అన్యాయం జరిగిందంటూ సాంకేతిక కారణంతో మురికివాడల నివాసితులైన పేదలంతా న్యాయస్థానం ముందు గళం వినిపించేందుకు రె‘్ఢ’ అవుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఆమె భర్త మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆలోచనలతో కార్పొరేషన్ అధికారులు కొద్దిరోజులుగా కసరత్తు చేసిన వార్డుల పునర్విభజనలో నగరంలోని జనాభాను 50 వార్డులతో భాగించాలి. వచ్చే జనాభాయే వార్డుల వారీగా సమాంతరంగా ఉండాలి. ఒకవేశ 5 - 10 శాతం తగ్గినా, పెరిగినా శాస్ర్తియంగా ఉండేదని, అనుకూలంగా గల వార్డుల్లో 3000 జనాభా, అనుకూలంగా లేని వార్డులకు 1500 జనాభా సర్దుబాటు చేయడంలో కన్పిస్తున్న సాంకేతికపరమైన లోపాలను ఎత్తిచూపుతూ పొత్తులు కలిగిన భారతీయ జనతాపార్టీతోపాటు, వామపక్షాలు, విపక్షమైన వైకాపా న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. ఇందుకుగాను ఆదివారం జిల్లా వైకాపా కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో నగరపార్టీ నేతలతో మేధోమథనం జరిగింది. అశాస్ర్తియమైన విధానాలను అధ్యయనం చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల నిర్వహించిన ‘వన్ టూ వన్’ శాసనసభ్యుల సమావేశం, గుంటూరులో కెఎల్ యూనివర్సిటీలో ఎమ్మెల్యేల శిక్షణా తరగతుల్లో ఎమ్మెల్యేల జాతకాలను సి.ఎం. సీల్డు కవరుల్లో ఎవరివివారికి అందజేసిన నేపథ్యంలో శ్రీకాకుళం నగరపాలకసంస్థ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు అధికార పార్టీకి వస్తాయన్న సర్వే సమాచారాన్ని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులకు అందించిన విషయం తెలిసిందే. ఆ సంకేతాన్ని బలంగా తీసుకుని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ తొలి మేయర్ కావాలన్న లక్ష్యంతో వార్డు పునర్విభజనపై తన తెలివితేటలన్నీ ప్రదర్శించారు. దీంతో ఐ.ఎ.ఎస్. అధికారులు వారిని సమర్థించేవిధంగా వార్డు పునర్విభజనకు అయ్యా..ఎస్! అన్నారంటూ విపక్షాలేకాకుండా, ప్రజలు సైతం విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యాయంస్థానం ముందు ప్రజావాజ్యం వినిపించేందుకు స్వచ్చందంగా ప్రజలతోపాటు, రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నట్టు తెలిసింది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో తీసుకున్న కేబినెట్ నిర్ణయాలు ఉన్నత న్యాయస్థానం తప్పుపట్టడం అధికారులు న్యాయస్థానం ముందు ముద్దాయిలుగా నిలబడవల్సిన వచ్చింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఐ.ఎ.ఎస్. అధికారుల అసోసియేషన్ ఏకతాటిపై నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి శ్రీకాకుళం నగరపాలకసంస్థ వార్డుల విభజన ప్రక్రియ అశాస్ర్తియంగా అధికారులు టిడీపీ ఎమ్మెల్యేకు రాజకీయ లబ్దిచేకూరేలా ముసాయిదా రూపొందించారన్న విమర్శలు వెల్లువత్తుతున్నాయి. ఇదే నిజమైతే - నాటి శ్రీలక్ష్మీ ఇతర ఐ.ఎ.ఎస్. అధికారులు పడిన పాట్లే ఇప్పుడు ఈ తంతులో భాగస్వామ్యులైన అధికారులకు తప్పేటట్టు లేదని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ఇటువంటి అశాస్ర్తియమైన తంతు కార్పొరేషన్ వార్డుల విభజనలో ఉందన్న విషయాన్ని జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలుసుకుని, దానిని చాలా రోజులుగా తన పెషీలో పెట్టుకుని కసరత్తు చేస్తున్నారు. ఇంతలోగా ముసాయిదా ఆయన ప్రమేయం లేకుండా వెలువడింది. దీంతో ప్రజావ్యతిరేక ముసాయిదాపై మంత్రి అచ్చెన్న వౌనమంత్రం పటిస్తున్నట్టు అధికారపార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే, ఈ విషయాన్ని సి.ఎం. దృష్టికి కూడా అచ్చెన్న ఆదివారం తెలియజేసినట్లు బోగట్టా. ముందస్తు ముసలంలో అచ్చెన్న తలదూర్చరంటూ ఆయన అనుచరులు సైతం సుస్పష్టం చేస్తున్నారు.

వ్యవసాయం నత్తనడక!
ఎచ్చెర్ల, నవంబర్ 20: ఉపాధి హామీ పనులు ప్రణాళికాబద్ధంగా సాగకపోవడంతో అనేక మంది గ్రామాలను విడిచి వలస జీవులుగా ఇతర ప్రాంతాలకు పరుగులు తీశారు. ఇందులో అత్యధికమంది వ్యవసాయ కూలీలే. వీరంతా భవన కార్మికులుగా, మట్టిపనివార్లగా విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, గుంటూరు తదితర ప్రాంతాలకు వలసబాటపట్టారు. స్పిన్నింగ్ మిల్లుల్లో కూలీలుగా పనిచేసేందుకు కూడా అనేక ప్రాంతాల నుండి బతుకుబండి సాగించేందుకు పరుగులు తీశారు. ప్రస్తుతం ఖరీఫ్‌లో సాగుచేసిన వరి పంటచేతికి అందడంతో ఎటువంటి విపత్తులకు నష్టపోకుండా రైతులు వడివడిగా వ్యవసాయ పనులు ముగించేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇంటిళ్ల్లపాదీ కోతలు, మోతల్లో బిజీగా ఉన్నప్పటికీ వ్యవసాయ కూలీల కొరత కారణంగా ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. సాధారణ రోజుల్లో రూ.100 మహిళలకు, పురుషులకు రూ.300 వ్యవసాయ పనులకు వెళితే చెల్లిస్తుంటారు. ఇప్పుడు రూ.160 మహిళలకు రూ.350 పురుషులకు చెల్లిస్తూ అల్పాహారం, టీ వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ఆటోఛార్జీలు కూడా చెల్లిస్తామని ఆఫర్ ఇస్తున్నా కూలీలు సరిపడే మంది రావడంలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్ని అనుకూలంగా ఉండటం పంటకూడా ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుందన్న నమ్మకంతో రైతులు ధీమాగా ఉన్నప్పటికీ కూలీలు లభించకపోవడంతో వారు కంటిమీద కునుకులేకుండా గడపాల్సి వస్తుంది.
కోత యంత్రాలు,నూర్పు యంత్రాలు అడపాదడపా వినియోగిస్తున్నా ఆశించిన రీతిలో పనులు ముందుకు సాగడంలేదని పెద్ద రైతులు సైతం వ్యాఖ్యానించడం గమనార్హం.

యువకుడి దారుణహత్య
రణస్థలం, నవంబర్ 20: మండలంలోని కొండములగాం గ్రామానికి చెందిన రేగాన రామకృష్ణ(22) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించిన జె ఆర్ పురం పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండములగాం గ్రామానికి చెందిన రేగాన రామకృష్ణ ఏడాది క్రితం మహిళతో వివాహేతర సంబంధం ఉండటం వలన ఆమె మరిదిని హత్య చేసిన సంఘటనలో నిందితుడు. ఆ తరువాత బెయిల్‌పై వచ్చి గ్రామంలోనే తిరుగుతున్నాడు. అయితే మహిళ హత్యను మనస్సులో ఉంచుకొని ఆమెకు సంబంధించిన రాంబాబు, సూర్యనారాయణ, రమణ, చంద్రారావు అనే నలుగురు వ్యక్తులు ఈనెల 9న రామకృష్ణను కొండములగాం సమీపంలో హత్య చేసి పైడిభీమవరం ఉన్న కండివలస గెడ్డలో పడేశారు. ఆ తరువాత గెడ్డలో గొయ్యి తీసి పాతిపెట్టారు. ఈనెల (మిగతా 2వ పేజీలో)

9నుండి రామకృష్ణ కనపడటం లేదని కుటుంబ సభ్యులు జె ఆర్ పురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పటినుండి విచారణ చేపట్టి అనుమానితులను ప్రశ్నించారు. ఈ మేరకు పోలీసు విచారణలో రామకృష్ణను హత్య చేసి పాతిపెట్టినట్లు అనుమానితులు పేర్కొనడంతో ఆదివారం పోలీసులు శవం పాతిపెట్టిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సంఘటనాస్థలాన్ని డిఎస్పీ భార్గవరావునాయుడు, సి ఐ రామకృష్ణ, ఎచ్చెర్ల ఎస్‌ఐ సందీప్‌కుమార్ తదితరులు ఉన్నారు.

రంగసాగరానికి మహర్దశ!

సారవకోట, నవంబర్ 20: ఒకప్పటి పర్లాకిమిడి మహారాజులు ఈ ప్రాంతంలో సాగునీటి అవసరాల కోసం నిర్మించిన ఏడుసాగరాలలో ప్రధానమైన రంగసాగరం చెరువు అతిత్వరలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మారనుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బొంతు ఎత్తిపోతల పథకానికి పెద్ద ఎత్తున రూ.187కోట్లు మంజూరు చేయడం ఈ ప్రాంత రైతాంగానికి మొదటినుండి కల్పతరువుగా రంగసాగరం చెరువు అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. మహేంద్రతనయనది వంశదార నదిలో కలిసే ప్రాంతం నుండి ఎత్తిపోతల ద్వారా తొలుత రంగసాగరం చెరువుకు నీటిని మళ్లించడం బొంతు ఎత్తిపోతల పథకంలో ప్రధానమైన ఘట్ట. నాటి మహారాజులు 625 ఎకరాల విస్తీర్ణంలో కురుడింగి రెవెన్యూ గ్రామపరిధిలో ఈచెరువును నిర్మించారు. ఆ తదుపరి ఇప్పటివరకు చెరువు గర్భంలో పడిక తీసిన దాఖలాలు కానరాలేదు. దీంతో చెరువులో నీటి నిల్వ సామర్థ్యం ఘననీయంగా తగ్గింది. ఈ చెరువుకు వంశదార నీటిని ఎత్తిపోతల ద్వారా మళ్లించాలని గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత రైతులు చేస్తున్న డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. రంగసాగరం చెరువులో అవసరమైన నీటిని నిల్వ చేసి ఆయకట్టు ప్రాంతంలో కూడా అవసరమైన మోటార్లు అమర్చి దాదాపు 12వేల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి రూపకల్పన చేసిన ప్రతిపాధనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. వంశదార నీటిని రంగసాగరంకు మళ్లించడం అసాధ్యమని గతంలో ఈనియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు ఖరాఖండిగా తేల్చి చెప్పి నాడు రైతులకు నిరాశ పరిచారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే బగ్గురమణమూర్తి ఈవిషయమై దృష్టిసారించి చివరకు విజయం సాధించారు. రంగసాగరం చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గామార్చడం వలన నిల్వ ఉన్న నీటిని శుద్ధి చేసి పలు గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు కూడా అందించగలమని ఏపిఎస్‌ఐ డి సి రాష్ట్ర ఉన్నతాధికారులు ఇటీవల ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ప్రకటించారు. కేవలం ఇప్పటివరకు తాగునీటి అవసరాలు మాత్రమే తీర్చిన రంగసాగరం చెరువు ఇకనుండి బహుళార్థప్రాజెక్టుగా మారడం విశేషం. ఎత్తిపోతల పథకంలో భాగంగా మండల శివారు గ్రామాలైన మాలువ నుండి రంగసాగరం చెరువు వరకు ఉన్న వ్యవసాయ భూములకు కూడా సాగునీరు అందించడానికి ఈ పథకంలో ప్రతిపాధనలు చేశారు. నిర్మాణం సకాలంలో జరిగితే రాబోవు ఖరీఫ్ నాటికి రంగసాగరం చెరువులో జలకలలు ఉట్టిపడగలవు. అయితే చెరువు గర్భం కొంతమేరకు ఆక్రమణలకు గురైంది. ఈ ఆక్రమణలు తొలగించి గర్భంలో పేరుకుపోయిన మట్టిని తొలగించి లోతు చేయాల్సిన అవసరం ఉంది.

ఉత్సాహంగా క్రాస్ కంట్రీ పోటీలు

బలగ, నవంబర్ 20: జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కొన్న చిన్నారావు మెమోరియల్ రాస్ట్రస్థాయి అథ్లెటిక్స్ క్రాస్‌కంట్రీ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. ఈ పోటీ ఎంపికలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఇక్కడి కోడిరామ్మూర్తి స్టేడియంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు పోటీలు ప్రారంభించగా జిల్లా నలుమూలల నుంచి అధికసంఖ్యలో లాంగ్న్ అథ్లెట్లు పాల్గొన్నారు. ఇందులో 16 ఏళ్ల బాలురు, బాలికలకు రెండు కిలోమీటర్ల రేస్, 19 ఏళ్ల బాలురకు ఆరు కిలోమీటర్లు, బాలికలకు నాలుగు కిలోమీటర్ల పరుగు, 20 ఏళ్లలోపు బాలురకు ఎనిమిది కిలోమీటర్లు, బాలికలకు ఆరు కిలోమీటర్ల రేస్, 20 ఏళ్లు పైబడిన బాలురకు 12 కిలోమీటర్లు, బాలికలకు ఎనిమిది కిలోమీటర్ల పరుగు పందేం నిర్వహించారు. వాతావరణం సరిగా క్రీడాకారులకు అనుకూలించడంతో మధ్యాహ్నాం సరికి పోటీ ఎంపికలను పూర్తి చేశారు. జిల్లా కేంద్రానికి చెందిన అథ్లెట్లు తమ సత్తాచాటేందుకు ముందుకు రావడం కనిపించింది. ఇందులో ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ మొదటి వారంలో ఇక్కడి కోడిరామ్మూర్తి స్టేడియంలో జరగనున్న రాష్టస్థ్రాయి పోటీలకు అర్హత సాధిస్తారన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు, కార్యదర్శి ఎన్.విజయకుమార్ పర్యవేక్షణలో ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం.సాంబమూర్తి, హరి, బి.వి.రమణ, సత్యన్నారాయణ, కె.మాధవరావు తదితరులు సహాకారాన్ని అందించి పోటీ ఎంపికలు విజయవంతంగా ముగించారు.

అస్తవ్యస్తంగా వార్డుల విభజన
* అభ్యంతరాలు తెలియజేయండి
* మాజీ మంత్రి ధర్మాన
శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 20: శ్రీకాకుళం నగరపాలక సంస్థలో ఉన్న 36 వార్డులను 50 వార్డులుగా విభజిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారని అయితే ఇది అస్తవ్యస్తంగా ఉందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైసిపి జిల్లా కార్యాలయంలో ఆదివారం సాయంత్రం నగర పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ వార్డుల విభజన అడ్డగోలుగా విడగొట్టారని తెలుగుదేశం పార్టీకు అనుకూలంగా ఉన్నవి ఒక్కచోటకు చేర్చుకున్నట్లు పేర్కొన్నారు. ప్రణాళిక లేకుండా విడగొట్టారని ఇది వంటింట్లో జరిగిన విభజనగా ఎద్దేవ చేశారు. నగరంలో ప్రతి వార్డు నుంచి అభ్యంతరాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వార్డుల్లో ఈ విషయాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఒక వార్డుకు 1500 జనాభా ఉంటే మరో వార్డుకు మూడు వేల జనాభా ఉందని, వార్డుల విభజనలో ఓటర్ల సమతుల్యత పాటించలేదని పేర్కొన్నారు. వారం రోజుల్లో అభ్యంతరాలు తయారు చేసి కమిషనర్‌కు నివేదించాలన్నారు. ఈ విషయాలు అన్నింటిపై సమావేశాలు నిర్వహించి పౌరుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్లు అంధవరపు వరాహ నరసింహం, ఎం.వి.పద్మావతి, ఎన్ని ధనుంజయరావు, కామేశ్వరి, సుగుణ, బుర్రా వెంకటరావు, శ్యామలరావు, కోణార్క్ శ్రీను, గుమ్మా నగేష్, మెండ స్వరూప్, మండవల్లిరవి, జెఎం శ్రీనివాస్, కోరాడ రమేష్ తదితరులు ఉన్నారు.
వివాహిత ఆత్మహత్య
సంతబొమ్మాళి, నవంబర్ 20: మండలంలో సుగ్గువానిపేట గ్రామానికి చెందిన వివాహిత ఎస్.సుజాత (19) ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు మేనమామ తిరుపతిరావు పోలీసులకు అందించిన ఫిర్యాదు మేరకు టెక్కలి సి ఐ భవానీప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.