S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

విజయనగరం (టౌన్), నవంబర్ 20: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ఎపిఎన్జీవో యూనియన్ చర్య లు తీసుకుంటుందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు అన్నారు. ఎపిఎన్జీవో జిల్లాశాఖ కౌన్సిల్ సమావేశాన్ని యూనియన్ కార్యాలయ ఆవరణలో ఆదివారం జిల్లా శాఖ అధ్యక్షుడు బిసిహెచ్ ప్రభూజీ అధ్యక్షతన జరిగింది. గత మూడేళ్లలో జిల్లాశాఖ నిర్వహించిన పోరాటాలను కార్యదర్శి ఆర్‌వి రమణమూర్తి కౌన్సిల్ సభ్యులకు నివేదించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న అశోక్‌బాబు మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మెరుగైన వేతనాలు అందజేయాలని ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని చెప్పారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఆ స్థాయిలో వేతనాల అమలుకు పట్టుబడతామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలన్న డిమాండ్‌లో భాగంగా వేతనాల పెంపుపై ప్రభుత్వంతో చర్చించి సాధించగలమన్న నమ్మకం వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలు చూపకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, కంట్రిబ్యూటరీ పింఛన్ విధానం రద్దు చేసే విషయమై ఇతర సంఘాలను కలుపుకొని పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం జాతీయ స్థాయి ఉద్యమం నిర్మించేందుకు యూనియన్ చొరవ తీసుకుంటుందన్నారు. సిపిఎస్ విధానం అమలుపై రాష్ట్రాలను ఐచ్చిక విధానం అందుబాటులో ఉన్న సిపిఎస్‌ను అమలు చేయడం వల్ల భరోసా ఉండదన్నారు. జాతీయ సమస్యగా దీని ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి రద్దుకోసం పోరాడతామన్నారు. వర్కింగ్ క్లాస్‌ను విడదీసే విధానంపై సమిష్టి పో రు అవసరమన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ వచ్చే నెలలో కాన్పూర్‌లో జరిగే సమావేశం లో జాతీయ స్థాయి సంఘాల ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. పిఆర్‌సి సాధించుకున్న రీతిలోనే ఉద్యోగుల భద్రత, సంక్షేమానికి పాటుపడతామన్నారు. పాత పింఛను విధానం అమ లు, రెండు నెలల డిఎలు, హెల్త్‌కార్డు సమస్యలపై ఇప్పటికే ఆర్థికశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. సమావేశంలో యూ నియన్ పూర్వ చరిత్రను పెద్దింటి అప్పారావు వివరించారు. కార్యదర్శి నివేదికపై తాలూకా యూనియన్ నాయకులు చర్చించి ఆమోదించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు డివి రమణ, జె మురళీ, ఉపాధ్యక్షుడు కె.సురేష్‌కుమార్, పద్మనాభం, కె.శ్రీనివాసరావు, కె.ఆదిలక్ష్మి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సిఎం పర్యటనకు ఏర్పాట్లు

విజయనగరం, నవంబర్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాక సందర్భంగా అవసరమైన ఏర్పా ట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 24న నెల్లిమర్లలోని జనచైతన్య యాత్రలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నాం 3 గంటలకు స్థానిక అయోధ్య మైదానంలో బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. సిఎం హెలీకాఫ్టర్‌లో సభాస్థలికి చేరుకుంటారని అందువల్ల ఎస్‌ఎస్‌ఆర్ పేట, విజయనగరంలో హెలీప్యాడ్‌లు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. సభా స్థలి వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పా టు చేయాలని ఆర్‌డబ్ల్యుఎస్ శాఖను ఆదేశించారు. తాగునీటిని అందుబాటులో ఉంచాలని ఆర్‌డబ్ల్యుఎస్, మున్సిపల్ శాఖలను ఆదేశించారు. సమాచార, విద్యాశాఖలు సాంస్కృతిక శాఖలు ఏర్పాటు చేయాలన్నారు. వేదికకు సంబంధించిన ఏర్పాట్లను డిఆర్‌డిఎ, డ్వామా అధికారులు చూడాలన్నారు. అయోధ్య మైదానంలో ప్రభుత్వ పధకాలకు సంబంధించి స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. జనధన్ యోజన, ముద్ర రుణాలు, స్టార్టప్ ఇండియా, 500, వెయ్యి నోట్ల రద్దుపై అవగాహన, వయోజన విద్య, ఆర్థిక విద్య, ప్రజాసాధికార సర్వే తదితర వాటిపై స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆస్తుల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. రూపే కార్డులు, పెట్టుబడినిధి ఉత్తర్వులు, చంద్రన్న బీమా క్లైయిమ్‌లు పంపిణీకి ఏర్పాటు చేయాలన్నారు. సుమారు 25వేల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున ఆ మేరకు ఏర్పాట్లు చేయాలన్నా రు. ఈ సమావేశంలో జెసి లఠ్కర్, ఎస్పీ ఎల్‌కెవి రంగారావు, ఒఎస్‌డి అప్పలనాయుడు, జెసి-2 నాగేశ్వరరావు, డిఆర్వో జితేంద్ర, జెడ్పి సిఇఒ రాజకుమారి, ఎస్‌ఇలు కాంతిమతి, రమణమూర్తి, వేణుగోపాల్, చిరంజీవిరావు, పిడిలు డిల్లీరావు, ప్రశాంతి, సిపిఒ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం

విజయనగరం, నవంబర్ 20: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. ఆదివారం ఇక్కడ 28వార్డులో దండుమారమ్మకాలనీలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవడంతోపాటు, అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేందుకు పార్టీ జనచైతన్య యాత్రలను చేపడుతుందన్నారు. రాష్ట్ర విభజన వల్ల లోటుబడ్జెట్ ఏర్పడినప్పటికీ నియోజకవర్గంలోను, మున్సిపాల్టీలోను అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలుగుతున్నామన్నారు. కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు చొరవతో పట్టణంలోని బిసి కాలనీ, గాజులరేగ తదితర ప్రాంతాల్లో ఫుట్‌పాత్ బ్రిడ్జిలు మంజూరయ్యాయన్నారు. అలాగే రూ.10 కోట్లతో శిల్పారామం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. డ్వాక్రా మహిళలకు రెండో విడత రూ.3వేల నగదు ఈ నెలాఖరులోగా వారి ఖాతాలకు జమచేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు కృషి వల్ల బోగాపురంనకు ఎయిర్‌పోర్టు వచ్చిందన్నారు. దీనివల్ల మిగిలిన రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. అలాగే ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో మొక్కల పెంపకం చేపట్టనున్నామన్నారు. టిడిపి వచ్చాక పింఛను మొత్తాన్ని రూ.200 నుంచి వెయ్యి రూపాయలకు పెంపుదల చేశారని గుర్తు చేశారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ వి.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ జనచైతన్య యాత్రల ఆవశ్యకతను వివరించారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పటికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టగలుగుతున్నామన్నారు. ఎమ్మెల్యే గీత చొరవతో పట్టణంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషిని వివరించేందుకు మండలాలు, వార్డుల్లో జనచైతన్య యాత్రలు చేపడుతున్నామని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రసాదుల రామకృష్ణ, వార్డు కౌన్సిలర్ పిన్నింటి కళావతి దంపతులు, డాక్టర్ విఎస్ ప్రసాద్ తదితరులకు కాలనీవాసులు పౌరసన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కనకల మురళీమోహన్, వార్డు కౌన్సిలర్ పిన్నింటి కళావతి, పిన్నింటి సూర్యనారాయణ, కౌన్సిలర్లు శ్రీను, మేకా కాశీవిశే్వశ్వరుడు, కంది మురళీ, ఆదిబాబు, పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి ముత్యాలరావు, కాలనీనేతలు రామావతారం, గాంధీ, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

నెత్తురోడిన రహదారి

రామభద్రపురం, నవంబర్ 20: తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి మృతిచెందగా మరో 10 మంది గాయపడ్డారు. తెల్లవారుజామున దాదాపు 3.30గంటల సమయంలో అందరూ నిద్రావస్థలో ఉన్న సమయంలో రామభద్రపురం బైపాస్ రోడ్డులో ఆదివారం ఒడిశా ఆర్టీసి బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తాపడింది. ఒడిశాలోని నవరంగపూర్ నుంచి బయలుదేరిన ఈ బస్సు విశాఖకు వెళ్లాల్సి ఉంది. రామభద్రపురం బైపాస్ రోడ్డు వద్దకు రాగానే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నవరంగపూర్‌కు చెందిన షాహినాసుల్తాన్ (40), వాజీ మహమ్మద్ సుల్తాన్ (30)తోపాటు 14 నెలల చిన్నారి సయ్యద్ మహమ్మద్ మృతిచెందారు. దీంతోపాటు మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ఒక్కసారిగా బోల్తాపడటంతో ప్రయాణీకులు బెంబేలెత్తిపోయారు. సంఘటన తెల్లవారుజామున జరగడంతో క్షతగాత్రులను వెనువెంటనే ఆసుపత్రికి తరలించలేకపోయారు. సమాచారం అందిన వెంటనే సాలూరు సిఐ రామకృష్ణ, ఎస్‌ఐ డిడి నాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాడంగి కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌కు తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే మృతిరాలి తల్లి ఆసుపత్రికి చేరుకుని బోరున విలపించడం పలువురికి కంటతడిపెట్టింది. ఇద్దరు కుమార్తెలను, మనవుడిని కోల్పోయిన ఆమె కన్నీరు మున్నీరైంది. ఈ ఘటన అందరినీ కలిచివేసింది.
మరణంలోనూ వీడని బంధం
విశాఖపట్టణంలో ఉంటున్న అక్క ఇంటికి వెళుతున్న చెల్లెలు కూడా ఆమెతోనే తనువుచాలించడంతో పలువురిని కంటతడిపెట్టించింది. చావులోను కూడా వీరి బంధం వీడలేదు. సాహీనా సుల్తాన్ భర్త విశాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. అత్తవారంటి నుంచి విశాఖకు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. అక్కతోపాటు ఆమె, 14నెలల కుమారుడుకూడా చనిపోవడంతో భర్తతోపాటు బంధువులు విషాదంలో మునిగిపోయారు.

గ్రంథాలయాల అభివృద్ధికి యువత కృషి చేయాలి
విజయనగరం (్ఫర్టు), నవంబర్ 20: గ్రంథాలయాల అభివృద్ధికి యువత నడుం బిగించాలని జిల్లా ఉప విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి కోరారు. స్థానిక మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన 49వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపుసమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లింగేశ్వరరెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని, వాటిని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని తెలిపారు. అందువల్ల యువత, విద్యార్థులు గ్రంథాలయాలకు వెళ్లడం అలవాటు చేసుకోవాలని, గ్రంథపఠనం అలవర్చుకోవాలని అన్నారు. మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెనే్నటి స్వప్నహైందవి మాట్లాడుతూ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు, యువతకు గ్రంథాలయాలు ఎంతో ఉపకరిస్తాయని తెలిపారు. గ్రంథాలయాలలో తగినంత సమాచారం ఉంటుందని, వాటిని సద్వినియోగం చేసుకుంటే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చునని చెప్పారు. గ్రంథాలయాల వారోత్సవాల సందర్భంగా గ్రంథాలయ సంఘం జిల్లా, మండల కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి బాలక్రిష్ణ, మాజీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్వ్రూఫ్, మండల కమిటీ అధ్యక్షుడు కె.దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల జియో ట్యాగ్
కొలిక్కి వచ్చేనా?

విజయనగరం, నవంబర్ 20: జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు సంబంధించి జియోట్యాగింగ్ నత్తనడకన సాగుతొంది. జిల్లాలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి దాదాపు ఏడేళ్లు కావస్తున్న జియోట్యాగింగ్ ఇంకను కొలిక్కి రాలేదు. ఇందిరమ్మ ఇళ్లకు జియో ట్యాగింగ్ పెట్టడం ద్వారా బినామీ పేర్లను, అనర్హులను ఏరివేస్తామని గృహనిర్మాణశాఖ మంత్రి మృణాళిని స్పష్టం చేసిన విషయం విధితమే. అయితే ఇప్పటి వరకు 60 శాతం మాత్రమే జియోట్యాగింగ్ చేయగలిగారు. ఇంకను 70వేల ఇళ్లకు సంబంధించి జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంది. వీటికి ఆధార్ ఉంటే జియోట్యాగ్ లేకపోవడం, జియో ట్యాగ్ ఉన్నచోట లబ్ధిదారులకు ఆధార్ లేకపోవడం వంటి కారణాల వల్ల ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో మొత్తం 3.13 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. వీటిలో ఇప్పటి వరకు 2.43 లక్షల మంది ఇళ్లకు మాత్రమే జయోట్యాగ్ చేయగలిగారు. ఇంకను మిగిలిన వాటికి ఆధార్ సీడ్, జియోట్యాగింగ్ లేకుండా ఇళ్లు అనేకం ఉన్నాయి. ఇప్పటి వరకు జియో ట్యాగింగ్ పూర్తి చేసినను, ఆధార్ లేకుండా ఉన్నవీ 29041 ఇళ్లు ఉన్నాయి. అలాగే ఆధార్ ఉండి జియోట్యాగ్ లేనివి 24330 ఇళ్లు ఉన్నాయి. ఆధార్, జియోట్యాగ్ రెండు లేనివి ఇంకను 16735 ఇళ్లు మిగిలి ఉన్నాయి.
ఇక నియోజకవర్గాల వారి పరిశీలిస్తే.. బొబ్బిలి నియోజకవర్గంలో మొత్తం 43868 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయగా వాటిలో ఇప్పటి వరకు 32,773 ఇళ్లకు మాత్రమే జియోట్యాగ్ చేయగలిగారు. అలాగే చీపురుపల్లి నియోజకవర్గంలో 44307 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయగా వాటిలో 30851 ఇళ్లకు, గజపతినగరం నియోజకవర్గంలో 32,201 లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయగా వాటిలో 26684 ఇళ్లకు, కురుపాం నియోజకవర్గంలో 40358 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయగా వాటిలో 30956 ఇళ్లకు జియో ట్యాగ్ పూర్తి చేశారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో 31188 మంది లబ్ధిదారులకుగాను ఇళ్లస్థలాలు మంజూరు చేయగా, వాటిలో 24171 ఇళ్లకు, పార్వతీపురం నియోజకవర్గంలో 28,930 మంది లబ్ధిదారుల ఇళ్లకు సంబంధించి ఇప్పటి వరకు 21969 ఇళ్లకు మాత్రమే జియోట్యాగ్ చేయగలిగారు. సాలూరు నియోజకవర్గంలో 38645 ఇళ్ల స్థలాలకు సంబంధించి 32405 ఇళ్లకు ట్యాగ్ పూర్తి చేశారు. ఎస్‌కోట నియోజకవర్గంలో 36659 మంది లబ్ధిదారులకు సంబంధించి 29688 ఇళ్లకు జియోటాగ్ చేయగలిగారు. విజయనగరం నియోజకవర్గంలో 17319 లబ్ధిదారులకు సంబంధించి ఇళ్లు మంజూరు చేయగా, వాటిలో ఇప్పటి వరకు 13872 ఇళ్లకు జియోట్యాగ్ పూర్తి చేయగలిగారు. ఇంకను మిగిలిన ఇళ్లకు ఎప్పుడు జియో ట్యాగ్ పూర్తవుతుందో ఆ దేవునికెరుక.

నవ్యాంధ్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
విజయనగరం (్ఫర్టు), నవంబర్ 20: రాష్టవ్రిభజన వల్ల ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్‌ను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దే కృషిలో ప్రజలు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే మీసాల గీత కోరారు. పట్టణంలో 26, 28 వార్డులలో ఆదివారం జరిగిన జనచైతన్యయాత్రలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలు అండగా ఉండాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంతలా కష్టపడుతుంటే కొన్నిరాజకీయ పార్టీలు తమ స్వార్థరాజకీయ ప్రయోజనాల కోసం లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. ప్రతిపక్షాల కుట్రలో చిక్కుకోకుండా ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుటిల రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రాజీలేని పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రజా స్పందనే అభివృద్ధికి మూలమని, అందువల్ల ప్రజలు ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, వైస్‌చైర్మన్ కనకల మురళీమోహనరావు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సైలాడ త్రినాధరావు, మున్సిపల్ కౌన్సిలర్లు బొబ్బాది త్రినాధరావు, పిన్నింటి కళావతి, మైలపిల్లి పైడిరాజు, గేదెల ఆదినారాయణ, కోండ్రు శ్రీనివాసరావు, టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దాల ముత్యాలరావుతదితరులు పాల్గొన్నారు.