S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆన్‌లైన్ ఫీడర్ మోనటరింగ్ ద్వారా అంతరాయాలకు చెక్

విశాఖపట్నం, నవంబర్ 20:అనేక రకాలైన సాంకేతిక సమస్యలతో నిలిచిపోయే విద్యుత్ సరఫరాను క్షణాల్లో మెరుగుపర్చే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆన్‌లైన్ ఫీడర్ మోనటరింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చేస్తోంది. దీనివల్ల విద్యుత్ అంతరాయాలు క్షేత్రస్థాయి అధికారులకు క్షణా ల్లో తెలిసిపోతుంది. దీనిపై అందిన ఫిర్యాదుతో కేవలం 30 నిమిషాల్లో స్పందించకపోతే ఆ పైస్థాయి అధికారులకు అప్రమత్తం చేస్తుంది.ఈ విధంగా అంతరాయాల గురించిన సమాచారం సంస్థలో అన్ని కేడర్లలో అధికారులతోపాటు ప్రజలకు సులభంగా వెళ్ళిపోతుంది.జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన సేవలను అత్యంత వేగవంతంగా అందించే లక్ష్యంతోనే ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) తొలి ప్రయోగంగా చేపట్టింది. దేశంలో 48డిస్ట్రిబ్యూషన్ కంపెనీలుండగా, మరెక్కడా ఇటువంటి విధానం ఇంకా అమల్లోకి రాకపోగా,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తున్న ఈపిడిసిఎల్ ఆంధ్ర రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురాగలిగింది. ఇప్పటికే దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు ఆన్‌లైన్ ఫీడర్ మోనటరింగ్ సిస్టమ్‌ను లాంఛనప్రాయం గా ప్రారంభించారు కూడా. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలకు సంబంధించి ఐదు జిల్లాలు ఈపిడిసిఎల్ పరిధిలోనే ఉండగా, మరో ఎనిమిది జిల్లాలతో కూడిన సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఎస్‌పిడిసిఎల్)తో కలిపి 2,800 విద్యు త్ ఫీడర్లు ఉన్నాయి. ఇందులో ఏ ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా ఆన్‌లైన్ ఫీడర్ మోనటరింగ్ సిస్టమ్ ద్వారా సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్, లేదంటే డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్‌కు సమాచారంతో కూడిన ఫిర్యాదు అం దుతుంది. ఫీడర్‌లో నెలకొన్న సాంకేతిపరమైన సమస్యనుబట్టి జాప్యం జరిగితే ఆ మరుక్షణం పై సూపరింటెండెంట్ ఇంజనీర్‌కు ఫిర్యాదు చేరిపోతుంది. ఈ విధంగా జాప్యం జరిగిన కొలది ఉన్నత స్థాయి అధికారుల వరకు క్షణాల్లో అంతరాయాల ఫిర్యాదు చేరిపోతుంది. గత పదేళ్ళ కాలంలో ఇదే సమస్య సంస్థకు ఎదురైతే గంటల తరబడి పట్టేది. కొన్ని సందర్భాల్లో కనీసం రోజు గడిస్తే తప్ప సమస్య గురించి తెలుసుకోవడం, దీనిని పరిష్కరించడం సాధ్యపడేది కాదు. దీనివల్ల వినియోగదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తేవి. వినియోగదారుల ఫిర్యాదులకు సంబంధించి ఇటువంటి సరికొత్త పథ కం ఇప్పటికే అమల్లోకి వచ్చింది. దీనిని ఇటీవల సంస్థ సిఎండి ఎంఎం నాయక్ ప్రారంభించారు. విద్యుత్ సంబంధిత సమస్యలేమైనా ఉంటే ప్రత్యక్షంగా ఇక్కడి కార్యాయాలకు చేరుకు ని అధికారులకు ఫిర్యాదులపై వినతులు నివేదించుకునే విధానానికి ఈపిడిసిఎల్ యాజమాన్యం స్వస్తి పలికింది. కేవలం 1912 నెంబర్‌కు ఫిర్యాదు చేసిన మరుక్షణంలో సంబంధిత సమస్య నమోదై పరిష్కరించడం జరిగిపోతుంది. దీనివల్ల వ్యయప్రయాసాలకోర్చి వినియోగదారుడు ఐదు జిల్లాల్లో నుంచి ఇక్కడకు రావాల్సిన శ్రమ తప్పుతుంది. దీనిని కూడా సిఎండి ఇటీవల ప్రారంభించారు.ఈ విధంగా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రవేశపెట్టిన సరికొత్త విధానాలను పటిష్టంగా అమలు చేసేందుకు వీలుగా చర్యలు చేపడుతున్నారు. ఈ తరహాలోనే అంతరాయాలను అధిగమించి వినియోగదారుల మన్ననలు పొందేందుకు వీలుగా బహుళ ప్రయోజనాలు కలిగి ఉం డే ఆన్‌లైన్ ఫీడర్ మోనటరింగ్ సిస్టమ్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధమైంది.