S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

నక్కపల్లి, నవంబర్ 20: టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు లాంటి మహానీయులు మనభూమిపై జన్మించడం మనందరి అదృష్టమని ఆయన అడుగుజాడల్లో మనమంతా నడుచుకోవడం సదా శ్రేయస్కరమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉద్ఘాటించారు. మండలంలోని వేంపాడు గ్రామంలో ఆదివారం జరిగిన జనచైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆయన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా జరిగిన సమావేశం లో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ 1983లో ఎన్టీఆర్ స్థాపించిన దేశం పార్టీ అంచెలంచెలుగా ఎదిగి ప్రజాభివృద్ధికి ఎంతో ఉపయుక్తంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. ఏ ఆశయంతో ఎన్టీఆర్ దేశంపార్టీని ఆవిర్భవించారో అతని ఆశయం మేరకు మనమంతా పార్టీ అభ్యున్నతికి ఎంతగానో కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ అభ్యున్నతికి విశేష కృషిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. పేదల ముందుకు ప్రభు త్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను తీసుకెళ్లడం కోసమే ముఖ్యమంత్రి చం ద్రబాబు ఈ జనచైతన్య యాత్రలను చేపడుతున్నారన్నారు. మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేయడంతోపాటు వారు స్వశక్తితో జీవనాధారం సాగించేందుకు వీలుగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రన్నకే దక్కుతుందన్నారు. దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడాలేని విధంగా ఆరంభించిన చంద్రన్న బీమా పథకాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అయ్యన్న విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ప్రసంగించారు. వంగలపూడి అనిత మాట్లాడు తూ టిడిపి చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రధానంగా మహిళలకు చేపట్టిన అభివృద్ధి పథకాలు, డ్వాక్రా స్కీమ్‌ల గూర్చి ఈ చైతన్య యాత్రా కార్యక్రమంలో వివరించారు. ఈ కార్యక్రమంలో టిడి పి అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్, జెడ్పీటిసి కె.కొండబాబు, ఎంపీపి ఎం. లావణ్య, ఆ పార్టీ నాయకులు కె. చలపతిరావు, దేవర సత్యనారాయణ, ఎస్. రాయవరం, కోటవురట్ల, పాయకరావుపేట మండల పార్టీ అధ్యక్షులు వినోద్‌రాజు, లాలం కాశీనాయుడు, పెదిరెడ్డి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.