S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బైక్‌ను ఢీకొన్న కారు

సబ్బవరం, నవంబర్ 20: సబ్బవరం-అనకాపల్లిరోడ్డుపై ఆదివారం రాత్రి బైక్‌ను వేగంగా వస్తోన్న సఫారీ కారు అదుపుతప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రగాయా లపాలయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానిక ఎస్‌ఐ తోట మల్లేశ్వరరావు తెలిపిన వివరాలిలాఉన్నాయి. అనకాపల్లి వైపు నుంచి పెందుర్తి వైపు వెళ్తున్న సఫారీ కారు స్థానిక వాయుపుత్ర హోటల్ ఎదురుగా అదుపుతప్పి రోడ్డు మధ్య లో ఉన్న డివైడర్లపై నుంచి దూసుకువెళ్ళి అవతలి వైపు బైక్‌పై వెళుతున్న అయ్యప్ప పూజకు వెళ్తున్న స్వయంవరపు శ్రీను(33), తీడ రాజు(29), కోన రాము(35)లను ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటారు సైకిళ్ళపై వెళ్తున్న ఇద్దరు భక్తులతోపాటు నడిచి వెళ్తున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని హుటాహుటిన విశాఖ కెజిహెచ్‌కు తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.