S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉచిత తాగునీరు!

సబ్బవరం, నవంబర్ 20: కేంద్ర ప్రభు త్వం మంజూరు చేసిన ఎక్ట్స్రనల్ ఎయిడెడ్ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రంలో 5 వేల కోట్లరూపాయలతో తాగునీటి కొరతను తీర్చించేందుకు ఇంటింటికి పైప్‌లైన్ ద్వారా ఉచితంగా నీటిని అందించేందుకు ముఖ్యమం త్రి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. జనచైతన్య యాత్రల్లో భాగంగా ఆయన ఆదివారం మండలంలో ని ఆరిపాక శ్రీరామ్‌నగర్ కాలనీ, శ్రీనగర్ కాలనీ, రాయపుర అగ్రహారం గ్రామాల్లో సుమారు 3 కోట్లరూపాయల నిధులతో నిర్మించిన సిసి రోడ్లు, మంచినీటి పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆరిపాక సభలో మాట్లాడుతూ 2019 నాటికి ఇఎపి నిధులతో నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు తాగునీటి కొరత సంపూర్ణంగా నిర్మూలిస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భారత ప్రభుత్వం మొత్తం 20వేల కోట్లరూపాయల ప్రాజెక్ట్‌ను రూపొందించగాఅందులో రాష్ట్రంలో 13 జిల్లాల్లో తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. చంద్రన్నబాటతో నిరుపేదల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభు త్వం పెద్దపీట వేస్తోందన్నారు. గతంలో అనకాపల్లి విద్యు త్ సహకార సంస్థను పాలించిన పార్టీలు అవినీతికి పాల్పడితే తాము వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నామన్నారు. జలసిరి పథకంలో ఉచితంగా రైతులకు 20 కోట్ల మేర ఖర్చుచేస్తున్నామన్నారు. 90-10శాతం కేంద్రం నిధులతో ఆరిపాకలోనే 20 కెఎల్ రక్షిత పథకాలు, సిసి రోడ్లు అత్యధిక సం ఖ్యలో నిర్మించి మండలానికే ఇక్కడి సర్పంచ్ శరగడం సాయి అన్నపూర్ణశంకరరావు ఆదర్శంగా నిలిచారన్నారు. చంద్రబాబు పనితీరును మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అభినందించటాన్ని ప్రస్తావిస్తూ ఎమ్మె ల్యే, అభివృద్ధిలేదంటూ గగ్గోల పెట్టే కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలకు సిగ్గుందా? అంటూ మండిపడ్డారు. అనంతరం రాయపుర అగ్రహారం లో ఎమ్మెల్యే బండారు సిసి రోడ్లు,తాగునీటి పైపులైన్లు ప్రారంభించిన అనంతరం గ్రామసర్పంచ్ పిల్లల రావాలమ్మ-అప్పలనాయుడు, ఎంపిటిసి దొడ్డి అరుణాప్రకాశరావులు ఘనంగా సన్మానించారు. ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుని ప్రమాదంలో మృతి చెందిన నక్కెళ్ళ రాము భార్య సన్యాసమ్మకు నారాలోకేష్ ప్రకటించిన 2 లక్షల రూపాయల సహాయాన్ని అందజేశారు. ఈ పర్యటనలోజడ్పీటిసి గేదెల సత్యనారాయణ, టిడిపి నేతలు శరగడం శంకరరావు, కొటాన అప్పారావు,దొడ్డి ప్రకాశ్, వత్సవాయి రమేష్, భరిణికాన సాయినాథరావు,కొత్తూరు గడ్డప్ప,కె.రామకృష్ణరాజు, కోరాడ శ్రీను, పిల్లల అప్పలనాయుడులు పాల్గొన్నారు.