నందిత మాయ!
Published Monday, 21 November 2016![](http://andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/22v6.jpg?itok=RBgOW6VH)
కొంతకాలం క్రితం నాని ‘జెంటిల్మన్’ చిత్రంతో నివేదాథామస్ మంచి పేరు తెచ్చుకుంది. ‘నేను శైలజ’ చిత్రంతో ‘కీర్తి సురేష్’ ఫేమస్ అయిపోయి, పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అలాగే మలయాళ నటి మంజిమ మోహన్ ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకుంటే.. తాజాగా నిఖిల్ చిత్రం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’తో పరిచయమైన కన్నడ నటి ‘నందితా శే్వత’ ఒక్కరోజులోనే ఇక్కడ సెలబ్రిటీ అయిపోయింది. సినిమాలో ఆమె నటన, హావభావాలు, బాడీ లాంగ్వేజ్, అందం అన్నీ తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయ. దాంతో ఆమె స్టార్డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అంటే -పర భాషా హీరోయన్లు పూర్తిగా టాలీవుడ్‌ను ఆక్రమించేస్తున్నారన్న మాట. ఇక తెలుగు పిల్లలకు చాన్స్‌లు ఎందుకొస్తాయ? ఎక్కడినుంచి వస్తాయ?