S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వాహ్..రాశీ!

‘‘వెండితెరపై కథానాయిక అందంగా కనిపించాలి. కానీ అదే సమయంలో నటనకూడా ఎంతో ముఖ్యమన్న విషయం మరచిపోకూడదు. అందుకే నేను నటించే చిత్రాల్లో అందంతో పాటు నటనపై కూడా ఎక్కువ శ్రద్ధపెడతాను. అందుకు నాకు అదృష్టం కూడా తోడవుతోంది. కాబట్టే మంచి అవకాశాలు వస్తున్నాయి. నాకు వచ్చిన అవకాశాలను నేను చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నానన్న తృప్తి కలుగుతోంది’’ అని ఆనందంగా చెబుతోంది అందాలభామ రాశీఖన్నా. తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా రవితేజతో నటించిన ‘బెంగాల్ టైగర్’లో గ్లామర్‌ను చిందించి మైమరపింపజేసింది. ‘శివమ్’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయినా ‘సుప్రీమ్’పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇలా వరుస అవకాశాలతో రాశీఖన్నా డైరీ నిండిపోయింది. ప్రతి అడుగు ఆచితూచి వేస్తూనే తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటోంది. రాబోయే రోజులన్నీ రాశీఖన్నాయే అని కూడా ఆమె సన్నిహితులు చెప్పుకుంటున్నారు. వాహ్..రాశీ..ఆల్ ది బెస్ట్!!

లక్ అంటే లావణ్యదే!
తెలుగులో నవీన్‌చంద్ర సరసన ‘లచ్చిందేవికి ఓ లక్కుంది’ చిత్రంలో కథానాయికగా నటించిన లావణ్య త్రిపాఠికి లక్ బాగానే కలిసివస్తున్నట్లుంది. టాలీవుడ్‌లో నటిగా మంచి పేరునే తెచ్చుకుంటోంది. ‘ఒక సినిమాలో మూడు కోణాల్లో సాగే పాత్రని పోషించడం ఇదే తొలిసారి. నా ప్రయాణంలో మరో ప్రత్యేకమైన పాత్రగా ఇది నిలిచిపోతోంది’’అని చెబుతోంది ‘లచ్చిందేవికి ఓ లక్కుంది’లోని పాత్ర గురించి. ఇందులో అంకాళమ్మ, ఉమాదేవి పాత్రల్లో కనిపిస్తానంటున్న ఈ భామకు ‘్భలే భలే మగాడివోయ్’ తర్వాత వస్తున్న చిత్రమిదే కావడం విశేషం. ‘కెరీర్‌ను ఎలా మలుపు తిప్పుకోవాలో బాగా తెలుసు. మంచి పాత్రలు చేసుకుంటూ టాలీవుడ్‌లో మంచి కథానాయికగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా’అని ఎన్నో ఆశలతో చెప్పుకొచ్చింది.
లావణ్యా...మజాకా మరి!!

ఆశల పల్లకిలో..!
రకుల్.. ఆశల పల్లకిలో అడుగులు ముందుకు వేస్తోంది. 2015లో నటించిన మూడు చిత్రాలు ఆమె కెరీర్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి. 2016 పై కూడా గంపెడు ఆశలు పెట్టుకుంది. అదే ఆశతో కెరీర్‌ను మలుచుకుంటోంది. ఎన్‌టిఆర్‌తో ‘నాన్నకు ప్రేమతో...’, అల్లు అర్జున్‌తో ‘సరైనోడు’ చిత్రాలు చేస్తూ యమబిజీగా వుందిప్పుడు. ఈ రెండు చిత్రాలూ రకుల్ కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడేవేనంటున్నారు సినీజనాలు. వీటితో పాటు బాలీవుడ్‌లో ‘సిమ్లా మిర్చి’ అనే చిత్రం కూడా చేస్తోంది. తెలుగులో నటించిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తర్వాత వచ్చిన ‘లౌక్యం’ రకుల్‌కు నటిగా మంచి ఇమేజ్‌నే తెచ్చిపెట్టింది. ‘పండగచేస్కో’ ఫర్వాలేదనిపించింది. ‘బ్రూస్‌లీ’, ‘కిక్-2’ కాస్త నిరాశపరిచినా ఆమె కెరీర్‌కు ఏ మాత్రం ఢోకాలేకుండా పోయింది. ఇదంతా తన అదృష్టంగానే భావిస్తానంటోంది ఈ ముద్దుగుమ్మ. ‘‘ తెలుగులో నాకు మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి. వాటికి తగిన విధంగా న్యాయం చేయడమే నా ముందున్న లక్ష్యం. నేను ఆ దిశగా కెరీర్‌ను మలుచుకుంటున్నాను. టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లో కూడా మంచి ఆఫర్లు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. వాటిని కూడా సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌ను మలుచుకుంటున్నా’’అని చెప్పుకొచ్చింది రకుల్.

-సమీర్