S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనిషికన్నా కోడిపిల్లలకు చురుకుదనం ఎక్కువ

ఇది నిజమేసుమా. అప్పుడే పుట్టిన పసికందుకన్నా, అప్పుడే పుట్టిన కోడిపిల్ల చురుకుగా ఉంటుంది. అదీగాక చుట్టుపక్కల పరిస్థితులను అర్థం చేసుకోవడం, అవగాహన, అలవాటు చేసుకోవడం, భద్రతను చూసుకోవడం దీనికి తక్షణమే అలవడుతుంది. అలాగే కోడిగుడ్డుపై 17వేలకుపైగా సూక్ష్మరంధ్రాలుంటాయి. కాల్షియం కార్బొనేట్‌తో తయారయ్యే కోడిగుడ్డు పెంకునుండి ఆక్సిజన్ లోపలికి వెళ్లడానికి, కార్బన్‌డయాక్సైడ్, ధూళి బయటకు రావడానికి ఈ రంధ్రాలు ఉపయోగపడతాయి. ఇవి సాధారణంగా కంటికి కన్పించవు. ఇక గుడ్డురంగు కోడి రంగునుబట్టి ఉంటుంది. తెల్లగా ఉండేకోళ్లు తెల్లగుడ్డు పెడతాయి. నలుపు, ఎరుపు, పసుపుఎరుపు ఈకలున్న కోళ్లు పెట్టే గుడ్లు కాస్త జేగురురంగులో ఉంటాయి. సాధారణంగా తెలుపు, జేగురురంగులో ఉండే గుడ్లు అందరికీ తెలుసు. కోళ్లు తినే ఆహారాన్నిబట్టి కొన్ని ప్రాంతాల్లో కాస్త నీలిరంగుకూడా ఉన్న గుడ్లు పెడతాయి. ఈ భూమీద ఇంత పుష్టికరమైన సహజసిద్ధ ఆహారం ఇంకోటి లేదంటే నమ్మాలి.

తొలిషాంపూ వీటితోనే...
సహససిద్ధ షాంపూ తొలిసారిగా తయారైంది కుంకుడుకాయలు, రాశి ఉసిరికాయలతోనే. అదీ మనదేశంలోనే. కుంకుడుకాయలలో అత్యధికంగా ఉండే ‘సపోనిన్’ అనే సహజసిద్ధమైన రసాయనం నీళ్లతో కలిసినపుడు నురగవస్తుంది. కుంకుళ్లలో ఇది 35శాతం ఉంటుంది. దీనివల్ల తల, శరీరంపై ఉండే మలినాలు పోయి కేశాలు నిగనిగలాడుతూ మృదువుగా ఉంటాయి. దీనికి రాశిఉసిరికాయల రసం కలిపితే మరింత మెరుపువస్తుంది. చర్మసంబంధ సమస్యలకూ ఇవి మందుగా పనికొస్తాయి. వీటిని సబ్బులు, డిటర్జెంట్, సర్ఫ్ తయారీలోనూ ఉపయోగిస్తారు. కాస్మొటిక్, ఆయుర్వేదం, వైద్యం, ఔషధాలు, డిటర్జెంట్ తయారీ రంగాల్లో వీటి వినియోగం ఎక్కువ. ఒకటిరెండు రకాల పక్షులు మినహా కుంకుడుపళ్లను తినవు. ఇప్పుడు మార్కెట్‌లో లభిస్తున్న ఆధునిక షాంపూల్లో సింథటిక్ రసాయనాలు వాడటంవల్ల దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. కొన్ని రకాల షాంపూల్లో రసాయనాలు వాడకుండా ఇప్పటికీ కుంకుడు, శికాకాయ, ఉసిరిని వాడుతున్నారు.

కాలువిరిగినట్లు
నటించే పక్షి
ఈ చిత్రంలో కన్పిస్తున్న పక్షి పేరు ‘కిల్-డీర్’. కాలికి, ఒక రెక్కకు దెబ్బతగిలినట్లు, కుంటుతూ, పడతూలేస్తూ తిరిగే పక్షి నిజానికి బాగానే ఉంటుంది. ఇదంతా ఓ లెక్క ప్రకారం అలా నటిస్తుంది. తన గుడ్లు పెట్టిన చోటుకు శత్రువులు వచ్చినపుడు హఠాత్తుగా ఇలా నటించి వాటి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తుంది. పరిస్థితి చేయిదాటితే చటుక్కున ఎగిరిపోతుంది. సాధారణంగా దాని ట్రిక్కు ఎప్పుడూ విజయవంతం అవుతూనే ఉంటుంది. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇది కన్పిస్తుంది. జతకలిసేటపుడు చేసే అరుపు కిల్-డీర్ అన్న శబ్దంతో ఉంటాయి. అందుకే వీటికి ఆ పేరు వచ్చింది. నిజానికి ఇవి గోరింకల్లా గోలచేసే పక్షులే.

-ఎస్.కె.కె.రవళి