S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మితిమీరితే ప్రమాదమే

హైదరాబాద్, డిసెంబర్ 2: రానున్న మూడున్నర దశాబ్దాల కాలంలో యాంటీబయాటిక్స్ కూడా పని చేయని పరిస్థితుల వల్ల 30 కోట్ల మంది మరణించే పరిస్థితి ఉంటుందని సిఎన్‌ఆర్‌ఎస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీని కావేరి హెచ్చరించారు. మితిమీరిన పరిమాణంలో, లేదా అవసరంతో నిమిత్తం లేకుండా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల అవి పని చేయని పరిస్థితి తలెత్తుతుందని ఆయన చెప్పారు. దీనివల్లే మరణాల సంఖ్య పెరిగిపోయే ప్రమాదం ఉంటుందని ఆయన హెచ్చరించారు. తార్నాకాలోని ఐఐసిటిలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ‘మానవ రోగ నిరోధక వ్యవస్థ పర్యావరణ మార్పుల ప్రభావం’ అన్న అంశంపై డాక్టర్ మనోహర్ శిరోద్కర్ సంస్మరణ ఉపన్యాసాన్ని డాక్టర్ శ్రీని చేశారు.
మానవ దేహంలోని బి కణాలు యాంటిబాడీలను ఉత్పత్తి చేస్తాయని, ఇవి ప్యాథోజెన్స్ తటస్థీకరణలో పాలుపంచుకుంటాయని, వాటిని తుడిచిపెడతాయని డాక్టర్ శ్రీని చెప్పారు. ఇక శరీరంలోకి చొరబడే ప్యాథోజెన్స్ జాడను గుర్తించడంలోను, వాటిని నాశనం చేయడంలోనూ టి కణాలది ప్రత్యేక పాత్ర అని అన్నారు. నిరోధక శక్తి పనిచేయడం మానివేస్తే తీవ్రమైన రోగాలు సంక్రమిస్తాయని చెప్పారు. పర్యావరణ సంబంధ అంశాల్లో పరిసరాలను కలుషితం చేసేవే గాక వ్యక్తులపైన భావోద్వేగాలు, ఇంకా ఇతర ఒత్తిడిని కలిగించే అంశాల పరమైనవి కూడా కలిసి ఉంటాయని అన్నారు. మన చుట్టూ ఉండే సూక్ష్మజీవులతో కూడిన పర్యావరణం మరో ఆసక్తిదాయకమైన అంశమని అన్నారు. మైక్రోబియల్ ఎకోసిస్టం ప్రతిస్పందనలను మధిస్తూ ఉంటే అణు సంబంధిత, కణ సంబంధ ఆధారితమైన పలు వ్యాధి విజ్ఞాన శాస్త్ర లోతుపాతులను కనుగొనడం, తద్వారా విభిన్న రోగ లక్షణాలకు సంబంధించిన రోగ చికిత్సా వ్యూహాలను రచించడంపైన పట్టు చిక్కగలదని శ్రీని అన్నారు. ఇందిరాదేవి ధనరాజ్ గిరి విరాళం ద్వారా తెలంగాణ అకాడమీ ఆఫ్ సైనె్సస్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ విసి ప్రొఫెసర్ అప్పారావు, సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్ రాకేష్ కె మిశ్రా, టిఎఎస్ అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్ మోహనరావు, ఉపాధ్యక్షుడు డాక్టర్ డిఎన్‌రెడ్డి, డాక్టర్ బి శశికిరణ్ తదితరులు పాల్గొన్నారు.