S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మార్కెట్‌ను... అభివృద్ధి చేస్తాం

వడ్డేపల్లి,డిసెంబర్ 2:నగరంలోని కుమార్‌పల్లి కూరగాయల మార్కెట్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ది చేసి, మార్కెట్ సొసైటీ సభ్యులకు రుణ సహాయం అందించాలని, అదే విధంగా నగదు రహిత క్రయవిక్రయాలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి అధికారులను ఆదేశించా రు. పెద్దనోట్ల రద్దు, నగదు రహిత క్రయవిక్రయాల ప్రోత్సాహం, అవగాహణ నిమిత్తం శుక్రవారం పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌తో కలసి కుమార్‌పల్లి కూరగాయల మార్కెట్ సొసైటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. మార్కెట్‌లోని కూరగాయల అమ్మకందారుల సమస్యలు, మార్కె ట్ స్థితిగతులు, నోట్లరద్దుతో వ్యాపారాల పరిస్థితిపై చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నగరంలోని అన్ని కూరగాయల మార్కెట్లను అన్ని హం గులతో అభివృద్ది చేయుటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సొసైటీ సభ్యులు సమూహికంగా కలసి బయటనుండి ఒకేసారి కూరగాయాలు తీసుకునిరావడం ద్వారా రవాణా చార్జీలు ఆదా అవుతాయని వివరించారు. మార్కెట్‌లో నాణ్యమైన కూరగాయలు అందుబాటు ధరలలో వినియోగదారులకు అందించడానికి ఎలక్ట్రానిక్ కాంటాలు ఏర్పాటు చేయాలని, పెద్దనోట్ల రద్దువలన ఏర్పడ్డ సమస్యలను అధిగమించేందుకు స్పైపింగ్ మిషన్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నగరంలోని రియలన్స్‌లాంటి పెద్ద కార్పోరేట్ మార్కెట్‌తోపాటు, గల్లీగల్లీలో కూరగాయలు విక్రయిస్తునారని తెలిపారు. అందుకోసం వినియోగదారులను ఆకర్షించడానికి నాణ్యమైన కూరగాయలు, సరసమైన ధరలకు అందించేలా మార్కెట్ మెళకువలు నేర్చుకోవాలని తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని కూరగాయల మార్కెట్లను నూతన హంగులతో అభివృద్ది చేయడానికి ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేశారని అన్నారు. కుమార్‌పల్లి మార్కెట్ 50లక్షల రూపాయల నిధులతో అభివృద్ది చేశామని, మార్కె ట్ సొసైటీలో 110 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. ఇంకా ఈ ప్రాంతంలోని కూరగాయల విక్రయదారులను సభ్యులుగా చేర్చుకుని సొసైటీని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. సొసైటీ పరంగా, మహిళా సంఘాలకు వ్యక్తిగతంగా రుణాలు అందజేయడానికి బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి చక్రధర్, ఆంధ్రాబ్యాంకు ఎజిఎం రమేష్‌బాబు, ఎస్‌బిఐ మేనేజరు రాంమెహన్‌రావు, కార్పోరేషన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు
మహాదేవపూర్, డిసెంబర్ 2: మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రం లో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తామని ఆచార్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి అన్నారు. శుక్రవారం రాత్రి ఆకస్మికంగా ఆసుపత్రిని తనిఖీ చేశారు. అనంతరం మెడికల్ సూపరింటెండ్ డాక్టర్ రవిప్రవీణ్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పా టు చేసిన ఆసుపత్రి అభివృద్ధి సమావేశంలో జిల్లా కలెక్టర్ మురళి పాల్గొన్నా రు. ఆసుపత్రిలో మురికి నీటి కాలువలను పరిశీలించారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది నివాస గృహాలను కలెక్టర్ పరిశీలించారు. చిన్న చిన్న రిపేర్లు ఉన్న వాటిని వెంటనే మరమ్మ త్తు ప నులు చేయించాలని ఆయన సూచించారు. క్వార్టర్లను అధునాతంగా తయా రు చేయాలని ఆదేశించారు. ప్రసూతి అయిన బాలింతలను ఆరోగ్య పరిస్థితిపై కలెక్టర్ ఆరా తీశారు. జనరల్ వార్డులోని రోగులను ప్రతి ఒక్కరిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దోమ తెరలు వాడాలని, గోడలకు రంగులు వేయాలని ఆదేశించారు. ఇకపై ప్రతి రోగికి కావాల్సిన ఆపరేషన్లు నిపుణులైన వైద్యులతో వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సత్యవిద్యాసాగర్, డాక్టర్ జయపాల్, డాక్టర్ రాజ్‌కుమార్, సర్పంచ్ తోట రాజబాబు, జడ్పిటిసి హసినాభాను, కాటారం జడ్పిటిసి చల్లా నారాయణరెడ్డి, మహాదేవపూర్ తహశీల్దార్ సాంబమూర్తిలు పాల్గొన్నారు.

నగదు రహితం కావాలి
నక్కలగుట్ట,డిసెంబర్ 2:వ్యాపారులు నగదు రహిత లావాదేవీలు నిర్వహించి, క్యాష్‌లెస్ సొసైటీకి సహకరించాలని రూరల్ జిల్లా కలెక్టర్ జీవన్ పాటిల్ అన్నారు. నగదు రహిత చెల్లింపులపై జిల్లాలోని వర్తక, వ్యాపార సంస్థల ప్రతినిధులతో శుక్రవారం వరంగల్ అర్బన్ కలెక్టర్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. నగదు రహిత సేవలకు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వారిని అడిగి తెలసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు చేసిన నేపథ్యంలో నగదు రహిత చెల్లింపులను కొనసాగించాలని తెలిపారు. ఇది ఒకే సారి జరిగేది కాదని, ప్రణాళికలతో దశల వారీగా ముం దుకు పోవాలని సూచించారు. నగదు రహి త సమాజానికి ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా ముందుకు వస్తే, ఆర్థిక రంగంలో పారదర్శకత పెరుగుతుందని వివరించారు. వ్యాపారులు నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని, ఇందుకు స్వైప్‌మిషన్లు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని అన్నా రు. జిల్లాలోని విత్తన, ఎరువుల, మందుల వ్యాపారులు ఐపాస్, ఎంపాస్ మిషన్లను ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు సంబందిత బ్యాంకులకు దరఖాస్తులు చేసుకుంటే, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయం చేస్తారని తెలిపారు. వ్యాపారులు ముందుకు వస్తే జిల్లా యంత్రాగం పూర్తి సహకారం అందిస్తుందని వివరించారు. వ్యాపార సంస్థలలో పనిచేస్తున్న కార్మికులందరికి బ్యాంకు ఖాతాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని లేబర్ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో బ్యాంకర్లు, వర్తక, వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

నగర అభివృద్ధికి చర్యలు
నక్కలగుట్ట,డిసెంబర్ 2:వరంగల్ నగర పరిథిలోని రోడ్ల అభివృద్ది, ముఖ్య కూడళ్లలో అభివృద్ది పనులు చేపట్టుటకు డిపిఆర్ సిద్దం చేయాలని అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో నగర అభివృద్ది కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నగరంలో కార్పోరేషన్ నిధులు, రాష్ట్ర బడ్జెట్ నుండి విడుదలైన ప్రత్యేక నిథులతోపాటు, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక పథకాల నిధులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ నిధులతో నగరాన్ని నూతన మాస్టర్‌ప్లాన్, స్మార్ట్‌సిటీ నియమనిబంధనలతో రోడ్లు, డ్రైనేజీ, ముఖ్యకూడళ్లను విస్తరించి పూర్తి స్థాయిలో నూతన హంగులతో అభివృద్ది చేయడానికి అధికారులు సమన్వయంగా పనిచేయాలని కోరారు. ఖాజీపేట నుండి పెద్దమ్మగడ్డ వరకు, పబ్లిక్ గార్డెన్ నుండి హసన్‌పర్తి వరకు రోడ్లకు ఇరువైపుల ఫుట్‌పాత్, సైకిల్‌పాత్, అండర్ గ్రౌండ్ సైడ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉండే విధంగా 20 కిలోమీటర్ల అభివృద్దికి 44 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. అలాగే నగరంలోకి 14 ప్రధాన కూడళ్లను అన్ని హంగులతో విస్తరించి అభివృద్ది చేయడానికి 27 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. మొత్తం నగరాభివృద్ది 71 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని, ఈ నిధులతో రోడ్లను, జంక్షన్లను భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ది చేయుటకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జాతీయ రహదారులు, రోడ్లు, భవనాలశాఖ, కార్పోరేషన్, కుడా సంబంధిత అధికారులు సంయుక్తంగా పర్యటించి పూర్తి స్థాయిలో డిపిఆర్‌ను సిద్దం చేసుకుని టెండర్లు పిలవడానకి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. పనులు చేపట్టుటలో నిర్లక్ష్యం వహించినా, అలసత్వం వహించినా సహించేది లేదని, నిర్ణీత గడువు ప్రకారం పనులు జరగే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మల్లన్న బ్రహ్మోత్సవాల పోస్టర్ విడుదల
చేర్యాల, డిసెంబర్ 2: తెలంగాణాలోనే ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం, బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, సిద్దిపేట జాయింట్ కలెక్టర్ హన్మంతారావులు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొమురవెల్లి ఆలయ ఇవో రాంకిషన్‌రావు అధ్యక్షతన బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశాన్ని నిర్వహించగా వారు పాల్గొని మాట్లాడారు. స్వామివారి కల్యాణం ఈ నెల 25న నిర్వహించనున్నందున కల్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు, ఆలయ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని అన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అన్నారు. కల్యాణ వేదిక వద్ద ఎలాంటి తొక్కిసలాట జరుగకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, అగ్నిమాపక శాఖలతో పాటు వివిధ శాఖల అధికారులు వారి వారి బాధ్యతలను సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధిపై సి ఎం కెసి ఆర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వారు తెలిపారు. బంగారు తెలంగాణ కెసి ఆర్‌తోనే సాధ్యమైందని అన్నారు. గోదావరి జలాలతో చెరువులను నింపడం విషయంలో సి ఎం ప్రత్యేక దృష్టి చూపినట్లు తెలిపారు. ఈ విషయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించారని జెసి తెలిపారు. సిఎం ఏ ప్రాంతంలో అడుగుపెడితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. సిద్దిపేట కోమటిచెరువు మాదిరిగా కొమురవెల్లి చెరువును అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. కొమురవెల్లి నుంచి వేములవాడ, యాదగిరిగుట్టకు ప్రత్యేక బస్సులు నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు. జాతర దృష్ట్యా రోడ్ల మరమ్మతులు, కొమురవెల్లిలో ఎటిఎం సెంటర్ ఏర్పాటు, స్వైపింగ్ మిషన్‌లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా హెల్త్ ఔట్‌పోస్టులను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ విషయంలో గ్రామ పంచాయతీ, దేవస్థానం వారు సమన్వయంతో పనిముందుకు సాగుతూ భక్తులకు సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. అనంతరం బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎంపిపి మేడిశెట్టి శ్రీ్ధర్, తహశీల్దార్ విజయ్‌సాగర్, ఇన్‌చార్జి ఎంపిడివో రాంప్రసాద్, సర్పంచ్ గీస బిక్షపతి, ఆర్ అండ్ బి ఈ ఈ బాల్‌నర్సయ్య, ఎ ఇవో అంజయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎనుగల్లు చెరువును రిజర్వాయర్‌గా చేయడానికి కృషి
ఎమ్మెల్యే అరూరి రమేష్
పర్వతగిరి, డిసెంబర్ 2 : ఎనుగల్లు చెరవును రిజర్వాయర్‌గా మార్చడానికి కృషి చేస్తానని వర్ధన్నపేట నియోజక వర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. శుక్రవారం పర్వతగిరి మండలంలోని ఎనుగల్లు చెరువును సందర్శించి పరిశీలించారు. ఐబి అధికారులతో రిజర్వాయర్‌గా చేయడానికి కావలసిన వనరుల గూర్చి చర్చించారు. దీనిని రిజర్వాయర్‌గా మార్చండం వలన చుట్టుపక్క గ్రామాల్లోని చెరువులు నిండుగా ఉంటాయని అన్నారు. కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అంది సస్యశ్యామలంగా రైతులు పంటలు పండించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎనుమాముల మార్కెట్ వైస్ చైర్మన్ జితేందర్‌రెడ్డి, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ గుజ్జ సంపత్‌రెడ్డి, ఎఎంసి డైరెక్టర్ యుగేందర్‌రావు, చాటేడ్ అకౌంట్‌టేన్స్ చాంబర్ జిల్లా ఉపాధ్యాక్షుడు కొయ్యాడ రాజు తదితరులు పాల్గొన్నారు.

కన్నుల పండువగా సుబ్రహ్మణ్య యాగం
వరంగల్ (కల్చరల్),డిసెంబర్ 2: వరంగల్ భద్రకాళీ దేవాలయ క్షేత్రంలో రెండవ రోజు సుబ్రహ్మణ్య యాగం కనుల పండువగా జరిగాయి. శుక్రవారం ఉదయం 6గంటలకు సుప్రభాత సేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. ఆలయంలో ఆరుముఖాలతో కొలువుదీరిన సుబ్రహ్మణ్య స్వామికి పురాణములో చెప్పిన విధంగా ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క సహస్రనామాలను చేస్తు ఆరువేల గులాభిపూలతో పుష్పార్చన చేసారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషు ఆధ్వర్యంలో కల్పోక్తప్రకారంగా సుబ్రహ్మణ్య యాగాన్ని జపహోమార్చన అభిషేక విధులతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని సేవించారు. ఈ యాగంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి తదితరులు పాల్గొని పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ ఈవో సునిత, వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

నగదు రహిత మండలంగా హసన్‌పర్తి
కలెక్టర్ అమ్రపాలి
నరుూంనగర్, డిసెంబర్ 2: పెద్దనోట్ల రద్దునేపథ్యంలో ఏర్పడిన సమస్యలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నట్లు అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి తెలిపారు. అందులోభాగంగా హసన్‌పర్తి మండలాన్ని పైలట్‌గా ఎంపికచేసి నగదురహిత చెల్లింపునకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ శుక్రవారం పిలుపునిచ్చారు. నగదు రహిత క్రయవిక్రయాలను స్వైపింగ్ మిషన్ స్మార్ట్ ఫోన్‌ల ద్వారా చెల్లించే విధంగా మహిళ సంఘ సభ్యులకు రైతులకు ప్రజలకు శిక్షణ ఇచ్చుటకు ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆమే తెలిపారు. ఈ విధానాన్ని ఇతర మండలాల్లో కూడా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. స్థానిక బ్యాంక్ బ్రాంచీల ద్వారా కావల్సిన స్వైపింగ్ మిషన్స్, ఆన్‌లైన్ చెల్లింపులు, స్మార్ట్ ఫోన్‌ల వినియోగం బ్యాంకు అకౌంట్ ఉన్న వారికి ఎటియం డెబిట్, క్రెడిట్ కార్డులను అందచేయడంతోపాటు బ్యాంకు అకౌంట్ లేనివారికి ఖాతాలను ప్రారంభిస్తామని తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లాలో నగదు రహిత లావాదేవిలు పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ప్రజలు సలహాలు, సూచనలు చేయాలని కలెక్టర్ కోరారు.

స్వాతంత్య్ర ఫలాలు అందని ద్రాక్షేనా?

మహబూబాబాద్, డిసెంబర్ 2: స్వాతంత్య్రం వచ్చి 70సంవత్సరాలు పూర్తి కావొస్తున్నా ఇంకా ఆ స్వాతంత్య్ర ఫలాలు అన్ని వర్గాలకు అందని ద్రాక్షగానే మిగిలింది. తరాలు మారినా.. యుగాలు మారి నా, పదుల సంఖ్యలో ప్రభుత్వాలు మారినా దివ్యాంగుల తలరాతలు మారడంలేదు. ఎన్నికల ముందు దివ్యాంగులకు వివిద రాజకీయ పార్టీలు ఇచ్చిన వాగ్ధానాలు అమలుకు నోచుకోవడంలేదు. మెనిఫెస్టోలో పెట్టిన హామీలు బట్టుదాఖలవుతున్నా యి. సమాజంలో దాదాపు 10నుండి 20శాతం కలిగిన వికలాంగుల జీవితాలు అగమ్యగోచరంగా ఉన్నాయి. ప్రభుత్వం వికలాంగులకంటే చేతగానిది గా తయారైందని విమర్శలు వస్తున్నాయి. బంగారు తెలంగాణలో వికలాంగుల జీవితాలు ప్రశ్నార్ధకమే అన్న సందేహలు కలుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వికలాంగుల సంస్థ చైర్మన్‌ను నియమించలేదు. దీంతో వికలాంగుల సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి. వికలాంగులకు ఇచ్చే రూ.1500పెన్షన్ కూడా ఉమ్మడి రాష్ట్రంలో మంద కృష్ణమాదిగ పోరాట ఫలితంగానే వస్తున్నాయని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్కిరెడ్డి సత్యం తెలిపారు. బోలా శంకరునిగా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు దివ్యాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీను కూడా నెరవేర్చలేదని ఆయన అన్నారు. వికలాంగులకు వెలుగు నింపే విధంగా సహకారాన్ని అందిస్తామన్న ప్రభుత్వం వికలాంగులకు ప్రొత్సహక బహుమతి క్రింద రూ.లక్ష రూపాయలు, దివ్యాంగుల జంటలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంత వరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. దివ్యాంగులైన క్రీడాకారులను, కళాకారులను గుర్తించి తగు ఆర్ధిక సహాయం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం అలాంటి చర్యలు చేపట్టడంలేదు. వికలాంగుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు వికలాంగుల సంక్షేమశాఖను ఐసిడిఎస్‌లో విలీనం చేయడం కూడా పుండుమీద కారం చల్లినట్లేనని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆరోపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వికలాంగుల రిజర్వేషన్ 8శాతానికి పెంచాలని, అన్ని ప్రభుత్వ శాఖలలో, విశ్వవిద్యాలయాల్లో వికలాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను ప్రతీసంవత్సరం భర్తీ చేయాలని, ప్రభుత్వం ఇచ్చే రాయితీ రుణాలలో ఎస్సీ, ఎస్టీల వలే సబ్సిడిని 85శాతం పెంచాలని, ఉన్నత చదువులు చదువుకున్న ప్రతీ వికలాంగునికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లేని పక్షంలో నిరుద్యోగ భృతి కింద ప్రతి వికలాంగునికి రూ.5వేలు కల్పించాలని, ప్రభుత్వం ఇచ్చే నామినేట్ పదవుల్లో వికలాంగులకు అవకాశం కల్పించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది.

ములుగు సబ్ కలెక్టర్‌గా గౌతం
ములుగుటౌన్, డిసెంబర్ 2 : ములుగు నూతన సబ్ కలెక్టర్‌గా విపి.గౌతం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయనను డివిజన్‌లోని తహసీల్దార్‌లు, రెవెన్యూ సిబ్బంది పూలబొకేతో ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా గౌతం సబ్ కలెక్టర్‌గా విధుల్లో చేరారు. 2012 ఇక్కడ సర్ఫరాజ్ అహ్మద్ సబ్ కలెక్టర్‌గా పనిచేయగా అప్పటి నుండి డివిజన్ పాలన ఆర్‌డి ఒలతో కొనసాగింది. ప్రస్తుతం సబ్ కలెక్టర్‌గా గౌతం విధుల్లో చేరడంతో ప్రభుత్వ పాలన సజావుగా సాగుతుందని పలువురు ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

రామప్పలో వింత జంతువు
వెంకటాపురం, డిసెంబర్ 2 : మండలంలోని పాలంపేటలో గల రామప్ప దేవాలయం ఆవరణలో శుక్రవారం వింత జంతువు దర్శనం ఇవ్వడంతో భక్తులు, పర్యాటకులు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటువంటి వింత జంతువు ఎప్పడూ చూడలేదని పలువురు పేర్కొన్నారు. వింత జంతువు దర్శనం ఇవ్వడంతో గౌడ్ వెంకటేష్ దానిని చాకచక్యంగా పట్టుకున్నాడు.

ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వం
వడ్డేపల్లి,డిసెంబర్ 2: తెరాస ప్రభుత్వం ఏర్పడి రెం డున్నర సంవత్సరాలు కావస్తున్నా, రాష్ట్రంలోని ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కుటుంబపాలనకే పరిమితమయ్యారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శ రేవూరి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 6న జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాలో జరిగిన రైతుపోరు మహాసభలో రైతాం గ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే, సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ప్రతి విమర్శలకు దిగడం సిగ్గుచేటని అన్నారు. తెరాస అధికారంలోకి వస్తే ఏడాదికి లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న కెసిఆర్, తన కుటుంబంలోని ముగ్గురికి మాత్రం ఉద్యోగాలు కల్పించారని ఎద్దేవా చేశారు. స్వర్గీయ ఎన్టీరామారావు స్థాపించిన ఆశ్రమపాఠశాలలోనే కెజి టు పిజి విద్యను కొనసాగిస్తామని ఉపముఖ్యమంత్రి చెప్పడం ఆయన అవగాహణ రాహిత్యానికి పరాకాష్ట అని విమర్శించారు. విద్యార్థుల బోధనా రుసుములు, ఉపకారవేతనాలు చెల్లించడంపై తప్పుడు ప్రకటనలు చేస్తూ కాలయాపన చేస్తూ, వారిని మోసగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దనసరి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాం గా సమస్యలపై ఆరు పోరుయాత్రలను నిర్వహించి, రైతాంగా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడడం అనైతికం అని అన్నారు. టిడిపి నిర్వహించిన రైతుపోరు యాత్రలలో ప్రజల స్పందనను చూసి ఓర్వలేకనే టిడిపిపై విమర్శలు గుప్పిస్తున్న తెరాస నాయకులకు ప్రజలే తగిన బుద్ది చెపుతారని తెలిపారు.