S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆసక్తిదాయకం

‘సూపర్‌మూన్ వస్తోంది’ కవర్‌స్టోరీ కథనంలో పలు ఆసక్తిదాయక విశేషాలు తెలుసుకొన్నాం. మూన్ విశిష్టత కూడా తెలిసింది. ఎడిటర్‌తో ముఖాముఖి ‘మనలో మనం’ ద్వారా పలు అంశాలపై ఎడిటర్‌గారు ఇస్తున్న సమాధానాలు బాగుంటున్నాయి. అమృతవర్షిణి అమృతంలా ఉంటోంది. సిసింద్రీ ఆకట్టుకుంటోంది. వారంవారం సరికొత్త అంశాలతో మమ్మల్ని అలరిస్తోన్న భూమికి ధన్యవాదాలు.
-నీలిమ సబ్బిశెట్టి (రాజానగరం)
సూపర్
సూపర్‌మూన్ అంటే ఏమిటి? దాని విశేషాలను తెలుసుకొన్నాం. ఈసారి నవంబర్ 14న కనిపించిన చంద్రుడు 70 ఏళ్ల క్రితం కనిపించినంత పెద్దగా, మళ్లీ 19 ఏళ్ల తర్వాత చూడబోయేటంత గొప్పగా 14 శాతం పెద్దగా, 30 శాతం కాంతివంతంగా కనపడతాడని తెలుసుకొన్నాం. చూసి ఆనందించాం. చుట్టూ చంద్రుడు తిరిగే క్రమంలో భూమికి, చంద్రునికీ మధ్య దూరం నెలకు నెలకు మారుతుందని, సూపర్‌మూన్, మైక్రోమూన్ అంటే ఏమిటో తెలిసింది. ఖగోళ శాస్తవ్రేత్త సిద్దార్థ్ చెప్పిన అంశాలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి.
-సరికొండ శ్రీనివాసరాజు (వనస్థలిపురం)
గంధర్వుడే!
మల్లాది వారి ‘అమృతవర్షిణి’ ఆకట్టుకుంటోంది. అలనాటి గాయనీ గాయకుల ఆకాశవాణి లలిత గీతాలను లీలామాత్రంగా గుర్తు చేసినా, అందులో కొందరు రేడియోకే అంకితమయితే, మరి కొందరు ఆ వేదికను వెండి తెర వరకు తీసుకెళ్లి కృతార్థులనిపించుకున్నారు. వీరిలో ఘంటసాల. భగవంతుడు ప్రసాదించిన కంచు కంఠాన్ని అన్ని విధాలా సద్వినియోగ పరచుకొన్న యోగి. ఎన్నో మధురాతి మధురమైన అమృత గీతాలను ఆలపించటమేగాక, వందకు పైగా చిత్రాలకు సుస్వరాలను అందించిన ఘనుడు. దాదాపు మూడు దశాబ్దాలు మాత్రమే గాత్ర, సంగీత సౌరభాలను అజరామరం చేసి అలసి సొలసిపోయాడు. అటువంటి గాయకుణ్ణి సినిమాలకు పరిచయం చేసిన బాలాంత్రపు రజనీకాంతరావు గారికి కృతజ్ఞతలు. ఘంటసాల లాంటి గంధర్వ గాయకుడిని బ్రహ్మ మళ్లీ సృష్టిస్తాడా అన్న మల్లాది వారి వ్యాఖ్య అద్భుతం.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
వేగం
జీవితంలో పెరిగిన వేగం చిన్నచిన్న ఆనందాల్ని హరించి వేస్తున్నదని మా బాగా వివరించారు ‘సండే గీత’లో. ‘అవీ ఇవీ’లో పాడి పరిశ్రమ అభివృద్ధికి గుర్తుగా నిర్మించిన భారీ ఫైబర్ ఆవు, దీపావళిలో ఎల్‌ఇడి కేళి అలరించాయి. ఆలయ ప్రసాదాల్లో కనిపిస్తున్న చచ్చిన జీవుల గురించి అడిగిన ప్రశ్నకు మీ జవాబు సంయమనంతో, విజ్ఞతతో కూడి ఉన్నది. అక్షరాలోచనాల్లో - దేవుడు కొండెక్కాడు, కొండెక్కి పోలేదు భక్తి - అన్న నానీ బాగుంది. అలాగే వీరఖడ్గం మెరిసింది! అమృతవర్షిణిలో ఘంటసాల, బాలాంత్రపు గురించి చెప్పిన విషయాలు ఆకట్టుకున్నాయి.
-పి.ఎస్.లక్ష్మి (బృందావనం)
సుమధురం
చాలామందికి తెలియని వాస్తవాలను ‘అమృతవర్షిణి’ శీర్షిక ద్వారా మరో సంగీత ప్రపంచాన్ని ఆవిష్కరింపజేస్తున్నారు. అమర గాయకులు ఘంటసాల మేష్టారు గారిని ఆకాశవాణి సంగీతానికి పరిచయం చేసిన ఘతన బాలాంత్రపు గారికి దక్కడం ఆంధ్రుల మహద్భాగ్యం. ఆ రోజుల్లో ‘రజనీ’ అంటే మహిళా కళాకారిణి, సంగీత రచయిత్రి అనుకునేవాళ్లం. ‘అదిగో అల్లదిగో’ అన్నమయ్య పాట నేడు బహుళ ప్రచారంలో ఉంది. ఆ పాత రోజుల్లో మల్లిక్‌గారు ఆ పాట పాడేవారు. ‘జీవితమంతా కలయేనా.. పుట్టిన రోజున వేడుకలా.. గిట్టిన రోజున ఏడుపులా’ అనే వేదాంత పాట ‘ఈ విశాల.. ప్రశాంత’ తాజ్‌మహల్ పాటను ఎం.ఎస్. రామారావు గారు, జానపద రాణిద్వయం శ్రీమతి సీత, అనసూయ గారలు పాడిన పాటలు వింటూంటే ఏదో లోకాల్లో విహరించినట్టు ఉండేది. ఆనాటి జ్ఞాపకాలను మళ్లీ మనోఫలకంపైకి తెచ్చిన మల్లాది వారికి కృతజ్ఞతలు.
-ప్రొ.కె.ఎన్.రావు (నెల్లూరు)
అద్భుతం
ఈ వారం క్రైం కథ అద్భుతంగా ఉంది. కస్టమర్‌తో గైడ్ మాట్లాడుతున్నట్టు కథంతా ఉత్కంఠభరితంగా నడుపుతూ క్లైమాక్స్‌కు చేర్చడం నిజంగా కొత్త టెక్నిక్. బాగుంది ఈ టెక్నిక్. ‘ఒక్క తూటా చాలు’ క్రైం సస్పెన్స్ సీరియల్ చకచకా సాగుతూ ఆసక్తిని గొలుపుతోంది. హిల్లరీ, ట్రంప్‌లలో ఎవరు అమెరికా ప్రెసిడెంట్ అయినా ఏమున్నది గర్వకారణం? ఏ రాయి అయితేనేం పళ్లూడగొట్టుకోడానికి! భూమిని పోలిన గ్రహాల శాస్ర్తియ ఆవిష్కరణలు, నాలుగు రంగుల కలయికతో ఆకర్షణీయంగా కనిపించే సెబు పక్షులు, చిలుక ముక్కు చేపల విశేషాలు మమ్మల్ని ఎంతగానో అలరించాయి.
-కె.సుభాష్ (శ్రీనగర్)