S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘స్పైడర్ మంకీ’లకు ఆ పేరెలా వచ్చింది?

చిలీ మినహా మధ్య, దక్షిణ అమెరికా దేశాల్లో కన్పించే ‘స్పైడర్ మంకీ’లకూ, సాలెపురుగులకూ ఎటువంటి సంబంధం లేదు. కానీ చెట్లపై అవి సంచరించేటపుడు సాలెగూడు ఆకారంలో విన్యాసాలూ చేస్తూండటం వల్ల వాటిని ‘స్పైడర్ మంకీ’లుగా పిలవడం ప్రారంభమైంది. దట్టమైన అడవుల్లో, సముద్రమట్టానికి 12,500 అడుగుల ఎత్తున అవి బతకగలవు. దట్టమైన అడవుల్లో చెట్లపై సంచరించే ఈ కోతుల్లో తోక చాలా పొడవుగా ఉంటుంది. బొటన వేలుండదు. నాలుగు వేళ్ల చేతులు, కాళ్లు, తోక సహాయంతో అవి చెట్లపై బ్యాలన్స్ చేస్తూ తిరుగుతాయి. ఒకే సమయంలో ఐదువైపులా కాళ్లు చేతులు, తోకను కొమ్మలకు బిగించి సాలెపురుగు గూడులా అల్లుకుని కన్పిస్తూంటాయి. చాలా అరుదుగా నేలమీదకు వస్తాయి. పగలు బృందాలుగా విడిపోయి ఆహారానే్వషణ చేసే ఈ కోతులు రాత్రిళ్లు మాత్రం ఒకేచోటకు చేరి విశ్రాంతి తీసుకుంటాయి. ఈ కోతులు బృందాలుగా జీవిస్తాయి. వాటిలో మగవాటి మధ్య అనుబంధం ఎక్కువగా ఉంటుంది. ఆడకోతులకు, వాటి పిల్లలను అమితమైన ప్రేమతో సాకుతాయి.

ఎస్.కె.కె.రవళి