S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గ్లామర్‌పైనే మోజు!

బాలీవుడ్ సుందరాంగులు కెరీర్‌లో పైకి రావాలంటే గ్లామర్‌ను చిందించడం తప్పదన్నది అందరికీ తెలిసిందే. అదే కోవలో దూసుకొచ్చిన నటి కత్రీనాకైఫ్. ఈ గ్లామర్ ప్రపంచంలో అందాల ప్రదర్శన ఏ నటికైనా తప్పదు. అలా చేయలేదంటే ఆ నటికి కెరీర్‌లో ఒడిదుడుకులు తప్పవన్న విషయాన్ని ప్రతి కథానాయిక అంగీకరిస్తుంది. ఈ విషయం గురించి కత్రీనా చెబుతూ- ‘‘చిత్రసీమలో అడుగుపెట్టే ముందు పరిశ్రమ గురించి అన్నీ తెలుసుకొని తీరాలి. అలా తెలుసుకుంటేనే కెరీర్‌లో ముందుకు పరుగుతీయడానికి వీలుంటుంది. గ్లామర్.. గ్లామర్ అంటూ హీరోయిన్లపై చిందులేస్తుంటారు. వాటికి దూరంగా వున్న తారలను ఏ మాత్రం ప్రోత్సహించరు. గ్లామర్ ఉంటేనే కథానాయికకు గుర్తింపు. వైవిధ్యమైన పాత్రల్లో ఎంతవరకు రాణించవచ్చో తెలియదు కానీ, అవే నిరంతరం నటిని నిలబెట్టలేవు అన్నది అందరూ ఒప్పుకుంటున్న మాటే. అందుకే అన్ని రకాల పాత్రలు చేయాలి. అలా చేసినప్పుడే ఏ నటికైనా కెరీర్ సూపర్‌గానే వుంటుంది’’అంటూ సెలవిచ్చింది. అదీ..సంగతీ!!