దటీజ్..అనుష్క!
Published Saturday, 3 December 2016![](http://andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/dateez%20anushka.jpg?itok=_kAfGxSO)
ఎస్.ఎస్.రాజవౌళి ‘బాహుబలి ది కన్‌క్లూజన్’తో పాటు ‘బాగ్మతి’ సినిమాల్లో నటిస్తూ యమ బిజీ బిజీగా వుంది టాలీవుడ్ బ్యూటీ అనుష్క. నాగార్జున హీరోగా నటించిన ‘సూపర్’తో ప్రారంభమైన ఈమె జైత్రయాత్ర పదేళ్లు పూర్తి చేసుకుంది. గొప్ప గొప్ప చిత్రాలు.. అంతకంటే వైవిధ్యమైన పాత్రలు వేటికవే ప్రత్యేకంగా వుండడంతో కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదిగింది. యోగా టీచర్‌గా వున్న అనుష్కకు చిత్రసీమలో అవకాశాలు రావడంతో ఈమె కెరీర్ ఊపందుకుంది. వెనక్కు తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు ఈ భామకు. కెరీర్ ఎలా అనిపిస్తుంది అని అనుష్కను కదిలిస్తే- ‘‘హాయి హాయిగా సాగుతోంది. నా అదృష్టం కొద్దీ మంచి పాత్రలు.. మంచి బ్యానర్లు.. అంతకంటే మంచి కథానాయకులు ఇలా అందరి ప్రోత్సాహంతోనే నేటికీ కెరీర్ ఇలా తిరుగులేకుండా వుంది. ఎంపిక చేసుకున్న పాత్రలు ప్రేక్షకుల మెప్పుపొందేలా చేశాను కాబట్టే అవి అంతగా అభిమానాన్ని చూరగొన్నాయి’’ అంటూ ఎంతో వినయంగా చెప్పుకొచ్చింది. అంతటి వినయం వుంది కాబట్టే ఆమె కెరీర్లో ఎక్కడికో వెళ్లిపోయింది, దటీజ్..అనుష్క!!