అక్షరాలు మండాలి
Published Sunday, 4 December 2016అక్షరమా.. అక్షరమా...
నీ గొంతు నొక్కేస్తున్నప్పుడు
సాక్ష్యాలు గుట్టలు గుట్టలుగా
బయటపడుతున్నప్పుడు
హక్కులకు రాజ్యాలు ‘బేడీ’లు
బిగిస్తున్నప్పుడు
నిజాన్ని నిగ్గుతేల్చి రచ్చబండ
కింద ఈడ్చాలి
సంకేలను’ స్వేచ్ఛగా బద్దలు కొట్టాలి
ఉక్కుపిడికిల్లు బిగించి గొంతెత్తి
గర్జించాలి
హక్కులుక స్వేచ్ఛా సమరం చేయాలి
ద్వేష విద్వేషా భావాలను
రాజ్య నియంతుల నిర్ణయాలను
ప్రజాస్వామ్య పోరులో గెలవాలి
స్వేచ్ఛా రాజ్యం రావాలి
హక్కుల వెలుగులు వెలగాలి
అక్షరాలు కణకణమండాలి.