S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తోకతో చరిచిందంటే...ప్రమాదం ఉన్నట్లే

‘రోడెంట్’ వర్గానికి చెందిన జీవుల్లో ‘బీవర్’ అతి పెద్దది. దాదాపు 30 కేజీల బరువు వరకు పెరిగే ఇవి 25 ఏళ్లపాటు జీవిస్తాయి. యురేషియా, ఉత్తర అమెరికా దేశాల్లో ఇవి కనిపిస్తాయి. తెడ్డులాంటి తోక వీటికి ప్రత్యేకం. నీళ్ల లోపల పావుగంటపాటు గడపగలగడం వీటి స్పెషాలిటీ. అవి జీవించి ఉన్నంతకాలం పెరిగే బలమైన దంతాలు వాటి ఆయుధాలు. నీటి మధ్యలోను, సరస్సులు, చెరువుల ఒడ్డున, కాల్వల మధ్య కర్రలు, బెరడు, చెట్ల ఆకులతో వంతెనల్లాంటివి నిర్మించడంలో ఇవి నైపుణ్యం చూపిస్తాయి. నీటి ఉపరితలంపై గూడుకట్టి, నీటి అడుగనుంచి ప్రవేశద్వారం పెట్టకోవడం వీటి రక్షణ వ్యవస్థలో భాగం. మనిషి తరువాత పరిసరాలను తమకు అనుగుణంగా మార్చుకోవడంతో బీవర్స్ ప్రావీణ్యం సాధించాయని చెబుతారు. ఇంజనీరింగ్ నైపుణ్యానికి వీటి పేరు చెబుతారు. నీళ్లలో ఈదేటపుడు ఏదైనా ప్రమాదం ఎదురైతే తెడ్డులాంటి తోకతో నీటిపై చరచి మిగతావాటిని హెచ్చరించడం బీవర్ల లక్షణం.

ఎస్.కె.కె.రవళి