రూపాయ పోరాటం
Published Saturday, 31 December 2016రోజల్లా
నడిచే ప్రయాణాన్ని
ముక్కలుగా విరిచి
కన్నీళ్లనే తొడగటం
అర్ధరాత్రి నిర్ణయాల
ముసుగుల్లో ముంచెత్తటాలు
ఒక విధ్వంసపు ఆనవాలు
నల్ల కుబేరులెపుడూ
రూపాయని వివిధ రూపాలుగా
తొడుక్కుంటారు
ఇప్పుడు
విరిగిన సగం జీవితం
సామాన్యుడిపైనో
మధ్యతరగతిగానో
విలవిలలాడుతూ
ప్రాణాలు ఆఖరి శ్వాసగా
విడవబడుతున్నాయ
పనులు గాల్లో కలిసి
బారులు కట్టిన జనం
బ్యాంకుల చుట్టూ యుద్ధం
ప్రాణం గుప్పిట తల్లడిల్లుతూ
ప్రణాళిక లేని పెద్ద వ్యవహారానికి
బలవుతూ ప్రణమిల్లుతూ
ఒక పరిష్కారానికి
ఎదురుచూపులు
పోరాడుతున్నాయ
**