S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆన్‌లైన్ (మాతో-మీరు)

నగదు వద్దు - ఈ-మనీ ముద్దు’ అంటూ భవిష్యత్‌లోకి తొంగి చూసేలా చేశారు. ఈపాటికే యువత ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నది. పెద్దలు కూడా అనుసరించాల్సిందే. వీసా, మాస్టర్ కార్డ్ లాంటివి అమెరికావి. పేటిఎం చైనాది. వాటిని ఉపయోగిస్తే కమిషన్ ఆ దేశాలకు పోతుంది. స్వదేశీ రూపే, స్టేట్ బ్యాంక్ బడ్డీ ఉపయోగిస్తే మన దేశానికీ, మనకీ లాభదాయకం. ఇక వానతోపాటు వడగళ్లు, చిన్నచిన్న చేపలు పడటం విన్నాం. కాని రాళ్లు పడటం నమ్మలేని నిజమే. రాళ్ల వర్షం గురించి పరిశోధనలు, చెప్పిన విషయాలు అమితాసక్తి కలిగించాయి.
-హెచ్.పవన్‌పుత్ర (రామారావుపేట, తూ.గో.జిల్లా)

మెచ్చుకోవాల్సిందే
క్రైం కథలో ఇంటిని ఆక్రమించి, యజమానిని బెదిరించి తమ ఆజ్ఞలు పాటించేట్టు బలవంతం చేస్తున్న ముగ్గురు హంతక అతిథుల్ని చాకచక్యంగా మట్టుబెట్టిన ఇంటి యజమాని తెలివిని మెచ్చుకోవలసిందే. భూతల స్వర్గం మేఘాలయకు సంబంధించిన విశేషాలు అలరించాయి. ఇష్టం లేకపోతే అడుగు కదపని ఒంటె లాంటి యామాలు, కర్రలు బెరడు ఆకులతో వంతెన ల్లాంటివి నిర్మించే బీవర్ సంగతులు ఆకట్టుకున్నాయి.
-బి.సోనాలి (సూర్యారావుపేట)

సండే గీత
ఎక్కడో వున్నవారిని తలచుకుంటూ చెంతనున్న వారిని నిరాదరిస్తూ సంసారాన్ని దుఃఖభాజనం చేసుకునే వారికి ‘సండే గీత’ కనువిప్పు కావాలి. మరెందుకీ స్వచ్ఛ భారత్ అనడం తేలికే. ఎవరో వచ్చి మన పరిసరాల్ని శుభ్రం చేయాలని కూచుంటాం కాని ఇంటిని, ఒంటిని, మన పరిసరాల్ని మనమే శుభ్రంగా ఉంచుకోవాలన్న శ్రద్ధ, బాధ్యత ప్రజలకు ఉండాలి కదా. ‘అక్షరాలోచనల్లో’ -మళ్లీ జన్మిస్తే -అన్న కవిత బాగుంది. శాస్ర్తియ ఆవిష్కరణల్లో బైనరీ కోడ్ విశేషాలు ఆకట్టుకొన్నాయి.
-పి.ఎస్.లక్ష్మి (బృందావనం)

జీవిత సత్యం
మన శరీరంలో పరస్పర విరుద్ధ తోడేళ్లు రెండున్నాయి. ఆశావహ దృక్పథంతో ప్రేమ, సంతోషం, ఆనందం పెంచే తోడేలుకే ఆహారం పెట్టి పెంచాలి అన్న ‘ఓ చిన్న మాట’ ఒక జీవిత సత్యాన్ని ప్రబోధించింది. నీతో చేయి కలిపి నడిస్తే ఆనందం, ఇంటి కప్పు మీద వాన పడితే ఆనందం, మన ప్రేమలేఖ ఎగురుతుంటే ఆనందం అంటూ ఆనంద గీతం గురించి గోపాలంగారు చెప్పిన పాట మస్త్ ఆనందం కలిగించింది. సంగీత మేరు శిఖరం గురించి అమృతవర్షిణిలో చెప్పిన సంగతులు బాగున్నాయి.
-సదాప్రసాద్ (గొడారిగుంట)

మోహం
పదవీ విరమణ తర్వాత ఏదో కోల్పోయినట్టు, వయసు అరవై దాటితే అంతా అయిపోయినట్టు బాధపడకుండా ఏదో ఒక దానిపై మోహం పెంచుకోవడం మంచిదన్న ఓ చిన్న మాట బహు దొడ్డ మాట. అరిషడ్వర్గాల్లో ఒకటయినా తగు మోతాదులో మోహం మేలు చేస్తుంది. కథాకమామీషు సరదాగానూ ఉండొచ్చని అంటూ గోపాలంగారు చెప్పిన విషయాలు అలరించాయి. కాఫ్కా కథ ఆయనకే కాదు మాకూ నచ్చింది. కథానిక గాని, రచన గాని అసలైన ప్రయోజనం హాయిగా చదివించడం అని మేమూ నమ్ముతున్నాం. గడ్డి లేకపోతే మనుగడే లేదన్న విషయం ఆలోచిస్తే నిజమే సుమా అనిపించింది.
-పి.శుభలక్ష్మి (కాకినాడ)

బాపూ
బాపుగారి ముఖచిత్రంతో వచ్చిన ఆదివారం అనుబంధం మమ్మల్ని ఎంతగానో అలరించింది. బాపు గీసిన చిత్రాలు, బాపు బొమ్మ, బాపు రాత, బాపు గీత.. బాపు సినిమా.. బాపు మొత్తంగా మన తెలుగువారికి సొంతం అయిన వ్యక్తి. అటువంటి బాపు జీవిత చరిత్ర, ఆయన రాత, గీత, సినిమా అనుభవాలు చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.
-పట్నాల సూర్యనారాయణ (రాజమండ్రి)

వరం
నీతో వున్న వాళ్లని ప్రేమించు -కథనం బాగుంది. లేనివారి గురించి బాధపడే కంటే మనతో ఉన్నవారిని సంతోషపెట్టడం చాలా మంచిది. పిల్లలు చనిపోయినా, భర్త చనిపోయినా ఏళ్ల తరబడి బాధపడ్తూ పక్కవారిని విసిగిస్తూ చాలామందిని అందరూ దూరం చేసుకుంటారు. మనిషికి మరపు భగవంతుడు ఇచ్చిన వరం. అది తెలుసుకొని కొత్త వారిని కలుపుకొని సంతోషంగా ఉంటే అందరికీ మంచిది. ఓ చిన్న మాట నీతిదాయకంగా ఉంటోంది. మళ్ల జన్మిస్తే కవిత బాగుంది. భూతల స్వర్గం కనులకు కట్టినట్టుగా ఉంది. సంగీత మేరు శిఖరం బాలమురళీకృష్ణ గారిని గురించి మల్లాది సూరిబాబుగారు చక్కగా తెలియజేశారు. కథాసాగరంలో ‘గర్వం’ కథ బాగుంది. అందరూ పరమాత్మ శక్తిని గ్రహించగలిగితే ఆనందంగా జీవించగలుగుతారు.
-డి.వి.తులసి (విజయవాడ)

లోకాభిరామమ్
ఈ శీర్షికన ఇటీవల అందించిన ‘ఆనంద గీతం’ మమ్మల్ని ఎంతగానో అలరించింది. గాలిలో మన ప్రేమ పాటు ఎగురుతున్నది ఆనందం, తెలిసిన ఆలోచనలాగ ఎగురుతున్నది. గాలిలో సూర్యుని వెచ్చని కిరణాలూ ఉన్నాయి. ఆనందం తెలిసిన చిరునవ్వులాగ ఉన్నాయి. పాటలోని మాటలకు సూటిగా కాని అర్థాలు. ఇటువంటి ఎన్నో అంశాలను మా కళ్ల ముందుకి తెస్తున్న గోపాలంగార్కి ధన్యవాదాలు.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)