S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వీటి ముఖం ఎర్రబడిందంటే..

జపాన్‌లోని మూడు దీవుల్లో మాత్రమే కనిపించే అరుదైన కోతులు ఇవి. ఇవి తెలివైన జీవులు. ఆహార సేకరణ, అనుకరణ, కొత్త విషయాలు నేర్చుకోవడంలో చురుకుగా, తెలివిగా వ్యవహరిస్తాయి. 35 అంగుళాల ఎత్తువరకు పెరిగే ఈ కోతులు మంచులోనూ జీవిస్తాయి. ఒతె్తైన బొచ్చు వీటి ప్రత్యేకత. శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోకుండా సమూహంగా, ఒకదానిని ఒకటి పట్టుకుని దగ్గరగా ఉంటాయి. వీటి ముఖం ఎర్రగా మారితే అవి యుక్తవయస్సుకు వచ్చినట్లు లెక్క. ఆ రంగును చూశాకే జత కట్టేందుకు మగకోతులు సిద్ధమవుతాయి. ముఖ్యంగా చిలకడ దుంపలంటే వీటికి ఇష్టం. ఆ దుంపలను నీటిలో కడిగి తినడం వీటి అలవాటు. ఉప్పునీటిలో కడిగి తినడం అంటే వాటికి మరీ ఇష్టం. ఎందుకంటే ఉప్పు రుచితో కూడిన దుంపలంటే వీటికి చాలా చాలా ఇష్టమట.

- ఎస్.కె.కె. రవళి