S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పసిడికాంతులు

పసుపురంగుతో మెరిసిపోతున్న ఈ వృక్షాన్ని, చెట్టుకింద ఉన్న పసుపువర్ణంలో కన్పిస్తున్న వాటిని చూసి అవి ఆ చెట్టు పుష్పాలు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. నిజానికి అవన్నీ ఆ చెట్టు ఆకులే. పెద్దసంఖ్యలో ఆకులు అలా రంగుమారి జారిపోతూంటే ఆ శోభను తిలకించేందుకు పర్యాటకులు క్యూ కట్టారు. చైనాలోని షాంగ్జి ప్రావిన్స్‌లోని గ్జియన్ ప్రాంతంలో ఉన్న అతి పురాతన ‘గింగ్‌కో’ వృక్షం ఇలా మెరిసిపోయింది మరి.

బుల్‌డాగ్...గిన్నిస్ రికార్డ్

ముప్ఫైమంది కాళ్ల
మధ్యనుంచి (మానవ ఆర్చ్) తడబడకుండా, వారికి తగలకుండా స్కేటింగ్ చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పింది ఈ బుల్‌డాగ్. దీనిపేరు ఒట్టా. పెరూలో ఈ విన్యాసం నమోదైంది. స్కేటింగ్ చేస్తున్నప్పుడు వేగం తగ్గితే...ఒక కాలు నేలపై పెట్టి, నెట్టుకుని మళ్లీ స్కేటింగ్‌బోర్డుపై నిలబడి తన ప్రతిభను చాటుకుంది. ‘లాంగెస్ట్ హ్యూమన్ టనె్నల్’ను వేగంగా దాటిన ఘనత సాధించింది.

ఊపిరితిత్తి..మానవహారం
శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తులను కాపాడుకోవడంపై ప్రజలను చైతన్యపరిచేందుకు బీజింగ్‌లో చేపట్టిన చైతన్య కార్యక్రమం ఇది. మానవ ఊపిరితిత్తుల మాదిరిగా దాదాపు 1500మంది బారులు తీరి గిన్నిస్ రికార్డు సాధించారు. ఎరుపు, నీలిరంగు కోట్లు ధరించిన వీరు ఇలా మానవహారం కట్టారు.

బొమ్మ వెనుక కథ

పారిస్‌లోని వౌంట్ సౌరిస్ పార్కులోని ఓ తటాకంలో బారులు తీరిన ఈ బొమ్మలు కన్పిస్తాయి. అక్కడ ఈ మధ్య జరిగిన వాతావరణ సదస్సు (కాప్-21) సందర్భంగా అర్జెంటినా కళాకారుడు పెడ్రొ మర్జరోటి తయారు చేసిన ఈ ప్రతిమలను ఆ కొలనులో ప్రతిష్టించారు. అ బొమ్మలలో ఒకదానిపై సీగల్ పక్షి వాలి కొత్త అందాన్ని తెచ్చిపెట్టింది.

చిలగడదుంప సొగసు

కెంట్‌కు చెందిన రైతు బెన్‌స్లెచ్ తన పొలంలో పండిన ఈ దుంపలను బయటకు తీసినపుడు దీనిని చూసి తెగ ఆశ్చర్యపోయాడు. ఆనోటాఈనోటా ఆ విషయం తెలిసి దానిని చూసేందుకు జనం ఎగబడ్డారు. చివరకు అది మీడియానూ ఆకర్షించింది. పనిలోపనిగా మీడియా సంస్థలు అలా వివిధ రూపాల్లో పండిన ఇతర కూరగాయలనూ తెరమీదకు తెచ్చారు.

డిజైనర్ రోబో

సరికొత్త రూపంలో, సరికొత్త దుస్తుల్లో సేవలందించే రోబోలను తయారు చేసింది జపాన్‌కు చెందిన ‘మజిల్ కార్పొరేషన్’. ఈ సంస్థ వివిధ రకాల రోబోలను తయారు చేయడంలో దిట్ట. టోక్యోలో జరిగిన ఇంటర్నేషనల్ రోబొట్ ఎగ్జిబిషన్‌కోసం తాజాగా ఆ సంస్థ తయారు చేసిన మనె్నక్విన్ రోబోలు ఆకర్షణగా నిలిచాయి.

-ఎస్.కె.కె.రవళి