S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆరూఢం - విజ్ఞానం

కారకారూఢయో స్త్భ్యాం పంచమేశస దృష్టితః
మేధావంతో జ్ఞానవంతో భవంత్యత్రన సంశయః
కారక లగ్నమునకు ఆరూఢ లగ్నములకు వానికి పంచమాధిపతి అయిన గ్రహము యొక్క దృష్టి కలిగినేని జాతకులు బుద్ధిమంతులు, జ్ఞానవంతులు అగుదురు. కారక లగ్నము యొక్క నిర్ణయం జైమినీ సూత్రముల ప్రకారము ‘ఆత్మకారక నిర్ణయం’ పద్ధతిలో కారక లగ్నం నిర్ణయం చేయవలెను. ఆత్మాధికః కలాదిభిర్న భోగస్సప్తానాం వాష్టానాంతా’ అనే సూత్రం ప్రకారం అధిక భాగము భోగ్యము అయిన గ్రహమును ఆధారంగా చేసుకొని కారక లగ్నము నిర్ణయం చేయవలెను. ఆరూఢ కారకాభ్యాంతా లగ్నాత్తత్సప్తమాదపి చతుర్థ్ధాప దృష్టి స్స్యాత్తత్రజాతః సుఖీనరః - ఆరూఢ లగ్న కారక లగ్నములకు గానీ జన్మ లగ్నమునకు గానీ, ఈ పై మూడు లగ్నములలో ఏ లగ్నములందు అయినా సప్తమ స్థానమునకు చతుర్థ్ధాపతి యతి వీక్షణలు కలిగిన యెడల జాతకుడు సుఖవంతుడు కాగలడు. అనగా జన్మలగ్నము జన్మ లగ్నాత్ సప్తము లేదా ఆరూఢ లగ్నము ఆరూఢ లగ్నాత్ సప్తమము, కారక లగ్నము, కారక లగ్నాత్ సప్తమములలో ఏదేని రాశికి చతుర్థ్ధాపతి సంబంధము వలన జాతకుడు సుఖజీవి కాగలడు. సహజముగా కేంద్ర స్థానము విష్ణువుగాను, కోణ స్థానము లక్ష్మీస్థానముగా చెబుతారు. అందువలన కేంద్ర కోణాధిపతుల కలయిక రాజయోగము అని చెబుతారు. లక్ష్మీ నారాయణులు ఇరువురూ కలిసి ఉంటే మంచి యోగము కదా! కేంద్ర త్రికోణాధిపయో రైక్యతే యోగకారకాః అన్యత్రికోణ పతినా సంబంధోయదికిం పునః అంటారు. కేంద్ర త్రికోణాధిపులు కలిసి ఉండగా వారితో మరొక త్రికోణాధిపతి సంబంధం చాలా విశేషము. ఇదే రీతిగా ‘అష్టమాధిప దృష్టే ర్వారూఢ కారకయో ర్భవేత్ లగ్న సప్తమ యోర్వాపి సదరిద్రో భవేన్నరః - పైన చెప్పిన లగ్న, ఆరూఢ, కారక లగ్నాలలో వాటికి సప్తమ స్థానమునకు అష్టమాధిపతి సంయోగం కలిగినేని జాతకుడు దరిద్రుడు అవుతాడు. మరొక ఆరూఢ సూత్రం పరిశీలిద్దాం.
ద్వాదశాధిపతే ర్దృష్ట్యా వ్యయ శీలో భవేత్తయోః లగ్న ధర్మే శయో ర్దృష్ట్యా జాతస్స్యాత్ప్రబలో నరః.. ఆరూఢం, కారక లగ్నం, జన్మలగ్నం వీటికి సప్తమ లగ్నములు ఏవి అయితే వున్నవో వాటికి వ్యయాధిపతి దృష్టి కలిగినేని జాతకుడు వ్యయం అధికంగా చేయువాడునూ, లగ్న భాగ్యాధిపతుల దృష్టి కలిగినేని జాతకుడు ప్రబలుడు అగును.
అదే రీతిగా ‘లగ్నాచ్చ ద్విర్ద్వా శయోర్గ్రహ సామ్యేతు బంధనమ్’ అని చెప్పారు. లగ్నానికి ద్వితీయ ద్వాదశ స్థానముల యందు పాపగ్రహములు సమానముగా వుండెనేని జాతకునకు ఆయా గ్రహ దశ అంతర్దశులలో బంధనం కలుగును. ఇక్కడ జ్యోతిశ్శాస్త్ర శోధనలో జన్మలగ్న, ఆరూఢ లగ్నం, కారక లగ్నముల శోధన ఏది అయినా ‘ర్ఫిఃష్టారి గతస్య రాశిర స్తద్దేశయు గ్దృష్ట్భం భ్రష్టంస్యాత్’ అనే సూత్రం ప్రధాన భూమిక అవుతోంది. అయితే ఈ 6,8,12 స్థానాధిపతులు ఒకరి ఇంట ఒకరు వారికి పరివర్తన మాత్రం రాజయోగమే చెబుతోంది. ఏ చక్రాలలో అయినా ‘నీచస్థాన గతాశ్చ పరాజితాస్త్వరి గతా పాపేక్షితా క్రాంత యుఙ్మధ్వస్థాన గతాశ్చవక్ర వికల స్వర్భాను సంసర్గకాః భావంత స్థితిభే చరాః షష్ఠాష్టరిఫాధిపాః’ అనే నియమం ప్రకారం మనం ఏ భావం శోధన చేయుచున్నామో ఆ భావం యొక్క అధిపతి నీచలో వున్ననూ, కుజుడితో కలిసి పరాజితుడు అయిననూ అనగా కుజుడుకు వెనకగా వుండటం, శత్రు క్షేత్రంలో వుండడం, పాపగ్రహముల వీక్షణ, యతి (కలయిక), వారిచేత ఆక్రమింపబడటం, వక్రము, వికలావస్థ, అస్తమయం పొందడం, భావం యొక్క అంత్యంలో వుండడం, 6,8,12 అధిపులతో కలయిక ఆ స్థానములలో వుండడం అనేవి ఏ భావమునకు అయినా మంచిది కాదు. ఇది ప్రతి భావం విషయంలోను శోధించాలి. పైన చెప్పిన మంచి చెడు యోగములు ఏవి అయినా సరే నీచగ్రహంతో కలిగినేని అది పెద్దగా ప్రభావం చూపదు. ఇక్కడ ప్రధాన అంశం ఏమిటి అంటే మంచి యోగము అయినా చెడు యోగము అయినా సరే దానిని ఇస్తున్న గ్రహము బలవంతమయిన గ్రహం అయితే యోగం పని చేస్తుంది. మంచి యోగం ఇచ్చే గ్రహం బలవంతమయిన గ్రహం అయితే మంచి ఫలితాలు అధికం. చెడు ఇచ్చే గ్రహము బలమయితే అధిక చెడు కలుగజేయును. మంచి చేయు గ్రహం స్థానబలం లేనిది అయితే మంచి పెద్దగా జరగదు. చెడు చేయవలసిన గ్రహం బలహీనం అయితే చెడు పెద్దగా జరగదు. ‘లగ్నాదారూఢ లగ్నాద్వాకోణ యోరి పురంధ్రయో తృతీయైకాద శయోరావ గ్రహసామ్యేపి బంధనం.. జన్మలగ్నం ఆరూఢ లగ్నమునమే గానీ పంచమ నవయములు/ షష్ఠాష్టములు/ తృతీమైకా దశములలో వీటిలో ఎందయినా సమస్థాయి పాపగ్రహములు వున్న యెడల ఆ గ్రహ దశాంతర్దశలతో కారాగార యోగం కలుగును.
*

కప్పగంతు సుబ్బరామశర్మ -9848520336