వసంతోత్సవం
Published Saturday, 25 February 2017వచ్చే వసంతానికి
స్వాగతం పలికేందుకు చెట్లు
కొత్త కోకలు ధరించి
కనువిందు చేస్తాయ
మనసు పళ్ళెం నిండా
దృశ్యాల సురుచి సంబరాల్ని
నింపుతాయ
వసంతం చెట్ల పండుగ
పక్షుల పండుగ
నూతన వస్త్రాలు ధరించడమే
పండుగైతే
అది చెట్ల పండుగే
పాటలు పాడుకోవడం
ఆటలు ఆడుకోవడమే
పండుగైతే
అది కోయలల పండుగే
నెమలుల పండుగే
కవి కలం మయూరం
కవితల పురి విప్పితే
అది వసంతోత్సవం