S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చేతులపై మూత్ర విసర్జన ఎందుకు చేస్తాయి?

చిన్నగా, అందంగా ఉడతలా కనిపించే ‘స్క్విరల్ మంకీ’ తన జీవితకాలంలో 99 శాతం చెట్లపై భాగంలోనే జీవిస్తాయి. నిరంతరం ఒకచెట్టు మీంచి మరో చెట్టుమీదకు తిరుగుతూ ఉంటాయి. ఆహారానే్వషణ కోసం ఎక్కడెక్కడికో వెళతాయి. అయితే తన కుటుంబంలో మిగతా సభ్యులు తనను అనుసరించేందుకు అవి ఒక పద్ధతి పాటిస్తాయి. ఇది వింతగా అనిపిస్తుంది కానీ వాటికి అదో భద్రతా ఏర్పాటన్నమాట. కుటుంబం నుంచి విడిపోకుండా ఉండటానికి, తమవారి జాడ తెలుసుకోవడానికి అవి ఓ విభిన్నమైన అలవాటు చేసుకున్నాయి. ఈ ఉడత కోతులు చేతులు, కాళ్లపై మూత్రాన్ని విసర్జిస్తాయి. ఆ తడిచేతులు, కాళ్లతో కొమ్మలను పట్టుకుని తిరుగుతాయి. ఆ మూత్రం వాసన చూసి దాని కుటుంబ సభ్యులు అదెక్కడ ఉందో కనిపెట్టి అక్కడకు వెళతాయన్నమాట.

- ఎస్.కె.కె. రవళి