S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సీ..రియల్

ఆదివారం అనుబంధంలో ఏ శీర్షిక ప్రత్యేకత దానిదే. ‘ఒక్క తూటా చాలు’ సీరియల్ ఆద్యంతం ఆసక్తిదాయకంగా ఉంటోంది. రాసమణి చెప్పిన మాటలు ఎంతో బావున్నాయి. ఎదుటి మనిషి గురించి తెలుసుకోవాలంటే పెద్దగా తెలివిని ఉపయోగించాల్సిన పనిలేదు. అతను మాట్లాడే తీరు.. ఆలోచించే విధానం చాలు. రకరకాల మనుషులతో సావాసం చేసే రాసమణి పాత్రని మలచిన తీరు మాకెంతో నచ్చింది. ‘అమృతవర్షిణి’ శీర్షికలోని విషయాలు సంగీత విద్వాంసులే కాకుండా సంగీత ప్రియులు, సంగీతాభిమానులు కూడా చదవవలసి ఉంది. నీకు మంచి కంఠం ఉంది. భగవంతుని వరంగా లభించింది సుమా. జాగ్రత్తగా సాధన చేస్తే వృద్ధిలోకి వస్తావు అని అడిగి చూడండి. సాధన అంటే గిట్టదు. అంతా వచ్చినట్టుగా భావిస్తారు. సముద్రం లాంటి సంగీతం ముందెంత వాణ్ణి నాకంటే విద్వాంసులు ఎంత మంది లేరు. ఏదో నాకు తెలిసినది పాడుతున్నాను అని ఎవరైనా అన్నారనుకోండి. ఎప్పటికైనా అతనికి తెలియవలసినన్ని తెలుసుకొనే మార్గాలు దొరుకుతాయి. మల్లాది గార్కి ధన్యవాదాలు.
-పట్నాల సూర్యనారాయణ (రాజమండ్రి)

నిద్రాదేవి
జోరంగి శాస్ర్తీ ‘నిద్రాదేవి’ కథ బాగుంది. ‘చిక్కెరా మిడతంభొట్లు’ అన్న జానపద గాథ ఓ మారు గుర్తుకు వచ్చింది. పద్మనాభం నటించిన ఒక సినిమాలో కూడా మిడతంభొట్లు గాథ ఉన్నట్లు గుర్తు.
-వోలేటి పేర్రాజు (ముంబై)

అణకువ
ఆదివారం అనుబంధం మా ఇంటిల్లిపాదినీ ఎంతగానో అలరిస్తోంది. ‘ఓ చిన్న మాట’లో ‘అణకువ’ను గూర్చి చక్కగా తెలియజేశారు. అణకువగా ఉండటం అనేది అందరికీ, అన్ని వేళలా మంచిదంటూ, అహంభావాన్ని విడనాడటం చాలా అవసరం అని అర్థవంతంగా తెలిపినందుకు ధన్యవాదాలు. ‘సండే గీత’లో బాతు కథ బాగుంది. సంతోషాన్ని సంపాదించుకోవడం మన చేతిలో పని అని, మంచి భావనలను ఎంపిక చేసుకునే శక్తిని భగవంతుడు మనకు ఇచ్చాడని చక్కగా వివరించారు. కృతజ్ఞతలు.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)

పేపర్ ప్లేట్
పెళ్లి తంతు గురించీ.. వచ్చిపోయే వారి మనస్తత్వాల గురించీ ‘పేపర్ ప్లేట్’ కథలో చక్కగా వివరించారు. చదువుతున్నంత సేపూ కళ్ల ముందు ఆయా సంఘటనలు కదలాడాయి. అలాగే ‘కవర్ స్టోరీ’ షార్.. హుషార్ చాలా బాగుంది. షార్ పుట్టుక, చరిత్ర, ముఖ్యమైన ఘట్టాలు ఇలా ఎన్నో విశేషాలను తెలియజేశారు. ఈ వ్యాసం ఆలోచింపజేసేదిగా ఉంది. మల్లాది సూరిబాబు గారి ‘అమృతవర్షిణి’లో ‘ఘంటసాల ఓ ‘పాట’శాల’ వ్యాసం బాగుంది. గోపాలం గారు చెబుతున్న కబుర్లు ఆసక్తికరంగా ఉంటున్నాయి. సండే గీత, ఓ చిన్న మాట ఈ రెండు శీర్షికలు చిన్నవి అయినా అందించే సందేశం మాత్రం పెద్దదే. ‘సిసింద్రి’ పేజీలో కథ.. మల్లాది వారి రామాయణం బాగుంటున్నాయి. అక్షరాలోచనలులో కవితలు ఆలోచింపజేసేవిగా.. భావ స్ఫూర్తిని కలిగించేవిగా ఉంటున్నాయి.
-మార్టూరు అజయ్‌కుమార్ (రామచంద్రాపురం)

మధురశాల
మల్లాది సూరిబాబు గారి ‘ఘంటశాల.. ఓ ‘పాట’శాల.. విశే్లషణ బాగుంది. ఘంటశాల పాడిన భక్తి గీతాలు, భగవద్గీత మనశ్శాంతిని కలిగిస్తూండగా, సరదా పాటలు మనోల్లాసాన్ని కలిగిస్తున్నాయి. ఈ మధుర గాయకుడు పాడిన పాటలు, పద్యాలు ఎప్పటికీ చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉంటాయి. ఇటువంటి గాయక శిఖామణిని బ్రహ్మ మళ్లీ సృష్టించగలడా, బహుశా ఆయన వల్ల కాదేమో అని మల్లాది వారంటే, ఆనాడు ఓ సభలో ‘తాడిని తనే్నవాడుంటే.. వాడి తల తనే్న వాడొకడుంటాడ’నే బహుళ ప్రచారం పొందిన సామెత ఘంటశాల విషయంలో వర్తించదని సంగీతస్రష్ట అయిన పెండ్యాల నాగేశ్వరరావు గారన్నారు. పటికబెల్లం తింటుంటే ఎంత రుచిగా, హాయిగా ఉంటుందో ఘంటశాల పాట అంత శృతిబద్ధంగా ఉంటుందని మరో ప్రముఖ సంగీత సరస్వతి తాతినేని చలపతిరావు గారు ప్రశంసల జల్లు కురిపించారు. ఓ సినీ నిర్మాత - తన సినిమాలో పాటలన్నీ హిట్ కావాలని సంగీత దర్శకుడు ఇళయ రాజాని కోరగా - అన్నీ హిట్స్ చేయడానికి తానేమీ ఘంటశాలను కాదని బదులిచ్చారట. ఇంతటి యోగ్యతా పత్రాలు మరెవరికి దక్కుతాయి - ఒక్క ఘంటశాలకు తప్ప.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)

కష్టసుఖాలు
‘సండే గీత’ ద్వారా ఎనె్నన్నో మంచి విషయాలు తెలియజేస్తున్నారు. కష్టసుఖాలు రెండూ అనుభవించాలి. ఎప్పుడూ సుఖాలే అనకూడదు. వర్షం ఆనందదాయకమే. కానీ ఎడతెరిపి లేకుండా పడుతూంటే.. సూర్యుడు ఎప్పుడు కనిపిస్తాడా అని ఎదురుచూస్తాం. అదే జీవితం. ‘ఇంద్రజాలం’ విద్య వేరే నేర్చుకోనక్కర్లేదు. మన మంచితనమే అందరినీ ఆకర్షించి అంతా మనవారు అవుతారనే ‘ఓ చిన్న మాట’ బాగుంది. నేటి ఆధునికత మీద, జనారణ్యం, కాంక్రీట్ జంగిల్స్ మీద ‘మట్టిరంగు బొమ్మలు’ కవిత మరింత బాగుంది. ‘ఒక్క తూటా చాలు’ సీరియల్‌లో డైలాగ్స్ చలా బాగుంటున్నాయి. ‘ఎవరికైనా జబ్బు చేస్తే కేర్ హాస్పిటల్‌లో వైద్యం చేయించగలడు. ఎవరైనా తనని కేర్ చేయకపోతే ఓ బుల్లెట్‌తో అంతమొందించగలడు’ లాంటి మాటలు ఆకట్టుకొంటున్నాయి.
-ఎ.వి.సోమయాజులు (కాకినాడ)

పులకింత
‘అమృతవర్షిణి’ శీర్షికన అందజేస్తున్న వ్యాసాలు చదువుతూంటే ఒడలు పులకిస్తోంది. రజనీకాంతరావు గారు మద్రాసు ఆకాశవాణిలో లలిత సంగీత శాఖకు ఇన్‌ఛార్జిగా ఉన్న కాలంలో లలిత సంగీతానికి ఒక మధురమైన, మంగళకరమైన దశ. ఆకాలంలోని ప్రముఖ సంగీత కళాకారులు చేసిన సేవ మరువలేనిది. సాలూరు రాజేశ్వరరావుగారి గళం నుండి జాలువారిన ‘రజనీ’ గీతాలు ‘చల్లగాలిలో యమునా తటిపై’ ‘ఓ విభావరి’ పాటలు నేటికీ ఆ చల్లని వీచికలను మరువకున్నాం.
-కైప నాగరాజు (అనంతపురం)