S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనిషికి రెండు ముఖాలు

పెదవులపై చిరునవ్వును పూసుకొని
పలుకరించి ఆత్మీయతను అభినయిస్తారు
మనం ఇచ్చే ఆతిథ్యపు తేనీటిని
సేవిస్తూ ఉపరాగ మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు
వారి కవితా వదూటిపై
మనం ప్రశంసాపూర్వక జల్లు కురిపిస్తాం
మన అభినందనకు ఉబ్బితబ్బిబ్బై
వొకింత గుర్వోన్మత్తులౌతారు
అహం ఆవహించి ఆకాశం దాకా పయనిస్తారు
అప్పుడప్పుడూ వారి ఆర్థిక సమస్యల పరిష్కారానికి
మనం ఉదారంగా సహాయక ఊతలౌతుంటాం
మనం మలుపులో కనుమరుగవగానే
మనపై వక్రపు వదంతులను లోకమంతా చల్లి
వికృతపు ఆనందంతో మునకలేస్తారు
మన మీది అక్కసపు కడుపుబ్బరాన్ని
పాము కుబుసంలా వదులుతారు
అనుకోని ఆపదలో వారు
గంజిలో ఈగలా పడి
గిలగిలా తన్నుకుంటున్నప్పుడు
మనం మనిషి ధర్మాన్ని ఒళ్లంతా రాసుకొని
అధాటుగా ఆదుకొని
గుండెల్లోకి తృప్తిని గుప్పించుకుంటాం
కుక్కతోక వంకరలా వారు
ఎప్పటిలాగే విమర్శల విరుపుల ఈటెలు
మనపై విసురుతూనే ఉంటారు
మనం కాలపు వంతెనపై
జీవితపు చివరి అంచువైపుగా
అడుగులేస్తున్నపుడు
వీరే కాదు...
మండే గుండెలపై
మంచి మాటల ముత్యాలు పరచి
మనస్సును కుదుటపరచేవారు
ఎదురుపడుతుంటారు
ఆత్మీయతని చిలికి హృదయంపై రుద్ది
ఆహ్లాదాన్ని సృష్టిస్తుంటారు
వీపుపై వాత్సల్యపు స్పర్శను సృజించి
నిర్భయత్వాన్ని అభయదానం చేస్తుంటారు
ఏ ఆదరువూ లేని పేదరికపు సోదరులపై
కరుణా కటాక్షపు వీక్షణాలను నెరపి
వితరణకు ప్రతిరూపాలవుతుంటారు
ప్రేమించటం తప్ప బాధించటం తెలియని
పరమ పురుషత్వానికి ప్రతిబింబాలవుతుంటారు
అవనిలో...
ఒకడు తుంచుకుంటూ పోతుంటాడు
ఇంకొకడు అంటుకడుతూ ఉంటాడు
పరస్పర వైరుధ్యాలకు, చిత్రవిచిత్ర వైవిధ్యాలకు
చిత్రవేదిక ఈ ఇలాతలం - మన భూతలం
************

కత్తుల వంతెన
-ఆశారాజు
9392302245

నిప్పుల వాగు మీద
నిలకడలేని కత్తుల వంతెన
అడుగడుగూ దొర్లుకొంటూ
నిదుర కరువైన బెదురుకాలం
ఏ పరిమళ సమీరం వీచినా
పగిలిన బుడగలా
పక్క కుదరని చెలగాటం

దట్టంగా అడవిలా పెరిగిన రాత్రి
పగిలిన అద్దం తెగి నెత్తురు కారిన మడుగులో
ఎటువైపు కదలనివ్వని భయం

అగ్నిగుండంలో ఆటుపోట్ల మధ్యన
‘ఉమ్రావ్‌జాన్’ గజల్ కూడా
గుండెలో గుబులు పుట్టిస్తుంది
అయోమయంలో అల్లాడుతున్నప్పుడు
‘జొహరాబాయి’ గజ్జెల నడకైనా
బీభత్సంగా దడ పుట్టిస్తుంది

చిన్నపిల్లలు జడుసుకోకుండా
తల్లి దగ్గరకు తీసుకొని ముద్దాడినట్టు
ఒంటరిగా వదలని
వెంట నడిచే వెలుగు దివ్వే
కుములుకొంటూ కూడా
కొండంత గుండె బలమిస్తుంది

ఒయాసిస్సులు కనిపించని
ఎడారిని దాటించడానికి
ఒంటెల అడుగుల్లో అడుగులేపిస్తుంది
చుక్కలు లేని నడిరాత్రి కావచ్చు
సూర్యుడు ఉరిమి చూసే పట్టపగలు కావచ్చు
అలా అప్పుడప్పుడు ఆగకుండా
మనసు పగిలి మనిషి కదిలి
భూకంపం వస్తూ పోతూ ఉంటుంది
కుంగుతున్న నేల మీద
కూలిపోకుండా చేయి పట్టుకొని
విడిపోని నీడలా
నా వెంట సాగుతుంది.

*****************

ఇదెక్కడి మునాస
-గులాబీల మల్లారెడ్డి
9440041351
పునర్నిర్మాణానికి బయలుదేరాను
సరిపిచ్చిన గొడ్డలితో సరికొత్త పదునుతో
చాటేయించుకొన్న పలుగుతో పారతో
త్యాగాల ఇత్తనాల ముల్లెలతో మూటలతో
దుక్కిటెద్దులతో అమిరించిన నాగళ్లతో
బండెడు ఇసిరెలతో పుట్టెడు ఆశలతో
కొన్నాళ్లు నాతో ఉన్నోడే కూడి బతికినోడే
చీకట్లో చీకటై దొంగలా నంగనాచిలా
గొడ్డలి పార గుంజి పాడుబడ్డ బాయిలేసిండు
ఇత్తనాల ముల్లె నెత్తుకపోతుండు
అరె గిదేందిర బై అంటే - గిట్లెందుకంటే-
నీకు ఎద్దు ఎందుకు ఎవుసమెందుకు
కట్టమెందుకు నిట్టూరమెందుకు
నెలనెలా బత్తా యిత్తాను యాటింతా పెంచుతా
గది లెక్క గట్ల బతుకు గదే బంగారి బతుకంటున్నాడు
ఇది వరకు నేర్చిన పాటలే చాలు-
కొత్త పాటలొద్దు కొత్త పంటలొద్దు
ఆగు అక్కడే ఆగు
ఆగితేనే బతికి కట్ట కడతావు హెచ్చరిస్తున్నాడు
లేకుంటే శృతి సాగరుల లాగే నీ గతి అంటున్నాడు
ఇదెక్కడ మునాస

-కాశీవరపు వెంకట సుబ్బయ్య 9849800389