S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వాహ్..బ్యూటీ!

‘‘ఇటీవల బాలీవుడ్ భామలపై వస్తున్నన్ని రూమర్స్ మరే తారలపై రావడం లేదు. కారణాలు ఏమైనా రూమర్స్ అనేవి ఒక ఫ్యాషన్‌లా తయారైపోయాయి. ఇలా చేయకుంటే మీడియా నెగ్గుకు రావడం లేదేమో’’అంటూ గట్టిగానే స్టేట్‌మెంట్ ఇచ్చింది బాలీవుడ్ భామ దీపికాపదుకొనే. ఇటీవల ముంబయ్‌లో జరిగిన ఓ సినిమా ఫంక్షన్‌లో దీపికాను చుట్టిముట్టిన మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. వారి ప్రశ్నలను చిర్రెత్తుకొచ్చిన ఈ బ్యూటీ వారిపై ఘాటుగానే ఫైర్ అయింది. ‘‘సినిమాల్లో నటించే తారలకు ప్రైవేట్ జీవితాలు అక్కర్లేదా? వారి జీవితాలను విభిన్న కోణాల్లో చూడాల్సిన ఉత్సాహం మీడియాకు ఎందుకు? వారికంటూ పర్సనల్ లైఫ్ అక్కర్లేదా?’’అంటూ వాడివాడిగానే వాపోయింది. దీపికా ఎదురుదాడికి తట్టుకోలేక అక్కడి నుంచి వెంటనే జారుకుందట మీడియా. అదీ..సంగతీ!! దీపికా అంటే మాటలు కాదు..చేతలు అని నిరూపించింది. ఆమె ధైర్యానికి ‘వాహ్..బ్యూటీ’ అనకుండా వుండలేం కదా!!

హాట్ హాట్‌గా..!
అవును..చేయబోయే చిత్రాల్లో హాట్ హాట్‌గా కనిపిస్తే తప్పేంటి? పాత్ర పరిధిమేరకు అలా చేస్తుంటాం. దానికే ఇన్ని అభ్యంతరాలా? అని వాపోతోంది రాశీఖన్నా. పాత్ర డిమాండ్ చేస్తే ఎక్స్‌పోజింగ్ చేయడానికి నేను సిద్ధమే అనే ముద్దుగుమ్మలు అటు బాలీవుడ్‌లోనే వున్నారనుకుంటాం. కానీ మన టాలీవుడ్‌లోనూ ఇలాంటి ముద్దుగుమ్మలకు కొదువేం లేదు. అయితే బాలీవుడ్ భామలు ఇదే విషయాన్ని డైరెక్ట్‌గా చెబితే..మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు మాత్రం కొంచెం సిగ్గుపడుతూ చెబుతారు. అదే మరి టాలీవుడ్డు అంటే..! అయితే రోజులు బాగా మారిపోయాయి. హీరోయిన్ అంటే అందంగా కనిపించాల్సిందే. అందుకే ఎక్స్‌పోజింగ్ చేసేస్తున్నాం. అందులో ఏ మాత్రం తప్పులేదంటోంది ఓపెన్‌గా రాశీఖన్నా. ఇలా చెప్పడానికి ఆమెకి ఏ మాత్రం మొహమాటం లేదట. హీరోలు ఫైటింగ్‌లు..డ్యాన్స్‌లు..చేయాలి. మేం గ్లామర్‌గా కవ్వించాలి అందుకే ఈ విషయంలో అభ్యంతరాలు ఎందుకు? అని ఎదురు ప్రశ్నిస్తోంది రాశీఖన్నా. ‘బెంగాల్ టైగర్’లో బికినీలో కనిపించి యువతకు కిక్కెకించిన ఈ భామ ఇక ముందు కూడా ఇలాంటి పాత్రల విషయంలో ఏ మాత్రం అభ్యంతరాలు లేకుండా చేసేస్తానంటోంది. వామ్మో..రాశీఖన్నాయా..మజాకా!!

మళ్లీ దెయ్యంగా...!
టాలీవుడ్..కోలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్న అందాలభామ తమన్నాకు రోజు రోజుకీ క్రేజ్ భలే పెరిగిపోతోంది. ఇటు టాలీవుడ్..అటు కోలీవుడ్ ఏ వుడ్డయినా సరే తన క్రేజ్ తనదే ఉండేలా చూసుకోవడంలో బాగా ఆరితేరిపోయింది. అయితే తాజాగా ఓ హర్రర్ చిత్రం కమిటవ్వబోతోందని కోలీవుడ్ వర్గాల టాక్. అంతేకాదు, ఆమె చేయబోయేది దెయ్యం పాత్రట. టాలీవుడ్‌లో గతంలో రామ్ హీరోగా వచ్చిన ‘ఎందుకంటే ప్రేమంట’ చిత్రంలో ఆత్మగా కనిపించి అందర్నీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టిందనుకోండి..! దాంతో ఆమె మరోసారి దెయ్యంగా కనిపించనుందంటే ఆమె అభిమానులే కాదు, సన్నిహితులు కంగారుపడిపోతున్నారట. ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ దెయ్యాల సీజన్ జోరుగా నడుస్తోంది. ఆండాళ్ రమేష్ దర్శకత్వం వహించబోయే ఈ చిత్రంలో దెయ్యమే హీరో ఆయనే స్వయంగా చెబుతున్నాడు. అందుకే తమన్నా అయితేనే బెటర్ అని ఆమెను ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నాడు. అదీ..విషయం!!

-సమీర్