S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వజ్రం వయసెంతో తెలుసా...

ఇప్పుడు మనకు దొరుకుతున్న వజ్రాల వయసెంతో తెలుసా. కనీసం 350 మిలియన్ సంవత్సరాలు. భూమిలోపల 192 కి.మీ. అడుగున విపరీతమైన ఒత్తిడి, వేడి మధ్య కర్బన పదార్థాలే వజ్రాలుగా రూపొందుతాయి. భూమిలోపల అగ్నిపర్వతాలు పేలినప్పుడు లేదా లావా ఉప్పొంగినపుడు భూమి పైపొరల్లోకి వస్తాయి. తవ్వకాల్లో వాటిని బయటకు తీస్తారు. ఒక కారెట్ వజ్రం ఉత్పత్తి చేయడానికి 250 టన్నుల మట్టిని తవ్విపోయాలి తెలుసా. సౌతాఫ్రికా, కెనడా, బొత్స్వాన, నమీబియా, రష్యా, ఆస్ట్రేలియా వజ్రాల ఉత్పత్తిలో ముందున్నాయి. నిజానికి వజ్రాల ఉత్పత్తి, వ్యాపారం మొదలైంది భారత్‌లోనే. నాలుగువేల ఏళ్లక్రితం గోల్కొండ ప్రాంతంలో వజ్రాల వ్యాపారం మహజోరుగా సాగేదని అంటారు. మనం ఈ వ్యాపారం ప్రారంభించిన వందేళ్ల తరువాతకానీ మిగతావాళ్లు ఈరంగంపై పట్టు సాధించలేకపోయారు. మన తరువాత బ్రెజిల్ వజ్రాలవ్యాపారంలో పేరుపొందింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గనినుండి బయటకు తీసిన వజ్రం ఎంత బరువున్నప్పటికీ సానపట్టేసరికి 70శాతం వృధా అవుతుంది. అంటే దొరికినప్పుడున్న బరువులో 30శాతం మాత్రమే మిగులుతుందన్నమాట.

ఈ ఆకుల పొడవు 82 అడుగులు

పామ్ జాతికి చెందిన రఫియా చెట్ల ఆకులు ఆ జాతిలో అతిపెద్ద ఆకులున్న చెట్లుగా రికార్డు సాధించాయి. రఫియాపామ్ చెట్ల ఆకుల పొడవు కనీసం 82 అడుగులు ఉంటుంది. వాటికి ఇరువైపులా ఉండే ఈనెల (చిన్నఆకులు) పొడవు 5 అడుగుల పైమాటే. ఒక్కో ఆకుకు రెండువైపులా చెరి 180 ఈనెలుంటాయి. కాండం పొట్టిగానూ, ఆకులు అతిపొడవుగానూ ఉండటం వీటి ప్రత్యేకత. ఈ చెట్టు 52 అడుగుల ఎత్తువరకు ఎదుగుతుంది.

కిస్‌మిస్ క్యాన్సర్ నిరోధిస్తుంది
ఎండు ద్రాక్షలనే కిస్‌మిస్ అని చాలామంది అంటారు. వీటిలో ఉండే లవణాలు, తీపిపదార్థాలు మంచి శక్తినిస్తాయి. రక్తంలో నీటిశాతం తగ్గకుండా చూస్తాయి. క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు వీటిని తింటే మంచిది. మనశరీరంలో బ్యాడ్ కొలస్టరాల్ (ఎల్‌డిసి)ని ఇవి తగ్గిస్తాయి. యాంటి ఆక్సిడెంట్‌గాను, యాంటి బ్యాక్టీరియల్‌గానూ కూడా ఇవి పనిచేస్తాయి. నిజానికి అసలు ద్రాక్షకన్నా ఇవి ఆరోగ్యాన్ని మరింత సమర్థంగా రక్షిస్తాయి.

గోధుమ కొందరికి పడదు
పాలు కొందరికి పడవు. అలాగే గోధుమలుకూడా కొందరికి పడవు. ముఖ్యంగా సిలియాక్ వ్యాధులున్నవారు గోధుమలు తినకూడదు. వీటిలో ఉండే స్లూటెన్ ప్రొటీన్ వీరికి విరోధిగా పని చేస్తుంది. ప్రపంచంలో అత్యధికంగా జనం తినే ఆహారంలో మూడోస్థానం గోధుమలదే. మొక్కజొన్న, వరి తరువాత ఇవే ఎక్కువ తింటారు. ఆహారం, పానీయాలు, గ్రాసం, పెదాలకు వాడే మెత్తటి పదార్థాలు, బ్యాక్టీరియా సంహారక ఔషధాల తయారీలోనూ గోధమలు ఉపయోగిస్తారు. ప్రస్తుత ఇరాక్‌గా చెప్పబడుతున్న అలనాటి యూఫరేట్స్‌లో మొదటిసారిగా గోధుమలు కనుగొన్నారు. వీటిలో కనీసం 30వేల రకాలు ఉన్నాయి. వాటి రంగునుబట్టి జాతిని నిర్ధారిస్తారు.

-ఎస్.కె.కె.రవళి