S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

08/17/2019 - 20:06

ఉన్నట్టుండి
ఏదో నిప్పు రాజుకుంటుంది
ఒక వాక్యమై
ఒక నినాదమై!

ఉన్నట్టుండి
ఏదో ఊహ పురుడు పోసుకుంటుంది
ఒక పదమై
ఒక ప్రవాహమై!

ఉన్నట్టుండి
ఏదో ఆవేశం ఎగసిపడుతుంది
ఒక ఉప్పెనై
ఒక కవిత్వమై!

ఉన్నట్టుండి
ఏదో నిర్వేదం పెనవేసుకుంటుంది
ఒక గాయమై
ఒక గేయమై!

,
08/17/2019 - 19:55

గడిపిన క్షణాలను, గడిచిన సంఘటనలను మధుర జ్ఞాపకాలుగా మన ముందుంచేవి ఫొటోలు. ఒక చిత్రం వేవేల భావాలకు సమాహారం. కదిలే కాలాన్ని బంధించే శక్తి ఒక్క ఫొటోకే ఉంది. గతాన్ని కళ్ల ముందు ఉంచే సాధనం, చరిత్రను వర్తమానంతో చూపడం ఒక్క ఛాయాచిత్రానికే సాధ్యం. బంధాలకూ, అనుబంధాలకూ బాసటగా నిలబడగలదు. ఒక మాట వింటే కొన్ని రోజుల తర్వాత మరచిపోవచ్చు. ఒక వాక్యం చదివితే కొన్ని నెలల తరువాత మరచిపోవచ్చు.

08/17/2019 - 19:46

జీవితం
గొప్ప యుద్ధ క్షేత్రం
పోరాడితేనే
గెలుపు జెండా ఎగిరేది

జీవితం
ఆటుపోటుల కడలి
ఎదురేగితేనే
తుఫానులు తలొగ్గేది

జీవితం
ఆటుపోటుల కడలి
ఎదురేగితేనే
తుఫానులు తలొగ్గేది

జీవితం
సవాళ్ల బరి
దమ్ము చూపెడితేనే
విజయం గులామయ్యేది

జీవితం
ముళ్లబాట
వనమాలివైతేనే
పూలబాట గుబాళించేది

08/17/2019 - 19:35

ధనము దర్పము ధరనేలుతున్నవి
పదవులు పెత్తనములు గుత్తగ జమానా నడిపిస్తున్నవి
నీవు పుట్టినప్పటికి.. నేటికి...
స్వాతంత్య్రమా పరతంత్రవే నీవింకను..
నీవు తెచ్చిన మార్పు లేదు.. ఓదార్పు లేదు
దానికెన్నటికి నీ నుండి
సరైన తీర్పు లేదు.
తెల్లదొరలు చెఱ పెట్టిండ్రు ఆనాడు
నల్లదొరలు నిన్నంగట్లకు నెట్టినారు నేడు
సగటు బడుగు బీదా బిక్కీ దళితుడు

08/17/2019 - 18:57

సౌదామినులకు పుట్టినిల్లుగా భాసించే
నీ సొగసైన నీలినీలి కళ్లతో
చూసీ చూడని చూపు చూసి
ఏమీ తెలియనట్లుగా సవ్వడి చేయకుండా
ఆనాడు వడివడిగా వెళ్లిపోయావు!
కానీ.. అప్పటి నుండి ప్రగాఢ ప్రశాంతమైన
నిద్రకు దూరం చేసినావు!
నీ గురించిన కలలకు తప్ప-
వేరే కల లన్నింటి చేతా శాశ్వతంగా
సెలవు చీటీల నిప్పించినావు!

08/17/2019 - 18:51

జీవమున్న పాటంటే
శ్రావ్యంగా వినిపించాలి
కర్ణపేయంగా శృతిచేయబడాలి
మంచి పదాలు - ఔచిత్యాల్నివ్వాలి
సమానార్థకంగా పండు వెనె్నలల్ని, గండు కోయిలల్ని
తరులతల అలరింపులు చేయాలి!
అది అనుభవేకవేద్యమవ్వాలి.
అప్పుడే ఎదలోతుల్లోంచి
మంత్రముగ్ధతలు - అమంత్రితవౌతుంటాయి.
జీవమున్న పాటంటే
సజీవ చేతనకు ప్రతీక కదా!
సమాజగతంగా, సాంస్కృతికంగా

08/17/2019 - 18:41

మన దేశంలో మనుషులు చనిపోయిన తరువాత రకరకాల పద్ధతుల్లో ఆ పార్ధివ శరీరాన్ని అంతం చేస్తారు. కొంతమంది దహనం చేస్తారు. మరి కొంతమంది సముద్రంలో వదిలిపెట్టి అక్కడి జంతుజాలానికి ఆహారంగా ఉపయోగపడాలని ఆశిస్తారు. పార్సీలు పక్షులకి సమర్పిస్తారు. చాలామంది ఖననం చేస్తారు. సమాధి కడతారు.

,
08/10/2019 - 20:08

రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి.. వారు నిర్మించిన అపురూప కట్టడాలు కూలాయి. ఇది ప్రపంచమంతటా కనిపించే దృశ్యం. ఆ దృశ్యం నిండా సౌందర్యం కనిపిస్తుంది.. శిథిల సౌందర్యం దర్శనమిస్తుంది. కొంచెం దృష్టి పెట్టి చూస్తే మనసు మూర్చనలు పోయే దృశ్యమాలికలు అగుపిస్తాయి. ఆ కోణాన్ని చిత్రకారుడు పట్టుకుంటే ‘పట్టు’లాంటి దారం చేతికి తాకిన సుఖం కలుగుతుంది. సంతోషం వెల్లివిరుస్తుంది.

08/10/2019 - 20:03

జీవ రహస్యాలు మనకి పరిపూర్ణంగా అర్థంకాని రోజులలో పుట్టిన మాట ఇది. మొదట్లో జీవకణాలను సూక్ష్మదర్శిని కింద పెట్టి పరిశీలించినప్పుడు గాజు సీసాలో పారదర్శకమైన గాజు గోళీలని చూసినట్టు కనపడేదిట. అంటే కణంలో ఉన్న భాగాలు, వాటి మధ్య ఉండే సరిహద్దులు ఖణిగా కనపడేవి కావుట. అందుకని ఒకరు గాజుపలక మీద ఉన్న కణాల మీద ఒక రంగు పదార్థాన్ని పులిమేరు.

08/10/2019 - 20:03

(12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం)

Pages