S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

04/22/2018 - 01:13

‘‘అబ్బాయికి ఐటి కంపెనీలో జాబ్ వచ్చింది. ఉద్యోగంలో చేరి రెండు నెలలు అవుతోంది. ప్రారంభ జీతమే నెలకు 60 వేలు. మొనే్న కొత్త కారు కొన్నాం పది లక్షలు. నెల నెలా కిస్తు చెల్లించాలి. పోతే పోయింది. పిల్లల సంతోషం కన్నా మనకింకేం కావాలి?’’
***

04/21/2018 - 22:38

ఒక సందర్భంలో గొప్ప పర్షియన్ కవి రాసిన గీతాన్ని స్వరపరిచాను. దాన్ని ఆలపించాను. ఎంతో పరవశంతో గానం చేశాను. ఆ గీతానికి అద్భుతమయిన అర్థముంది. అదే సమయంలో ఆ గీతంలో అపూర్వమయిన అర్థం దాగి ఉందని అది నా అవగాహనకు మించిందని అప్పుడు భావించాను.

04/21/2018 - 21:25

చిత్రం: ఏఫ్రిల్ 25 నుంచి అంకురారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయ. అందులో భాగంగా మే 2 ఉదయం 10 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవము, సాయంత్రం 4 గంటలకు తెప్ప మహోత్సవం, రాత్రి 8 గంటలకు రథోత్సవం జరుగుతాయ.

04/15/2018 - 00:12

తెల్లచీరకు తకదిమి తపనలు రేగేనమ్మా సందె ఎనె్నల్లో.. అని పాడాలనిపిస్తోంది కదూ ఈ గుమ్మను చూస్తుంటే.. కాస్త సరిగ్గా పరిశీలించి చూడండి.. ఇక్కడున్నది గుమ్మ కాదు ముద్దు బొమ్మ. అలాంటిలాంటి బొమ్మ కాదండోయ్ ఇది. కేకు బొమ్మ. పెళ్లికూతురు బట్టలు, అలంకరణతో ముస్తాబైన ఈ అందాల బొమ్మను దుబాయ్‌లోని ఓ వెడ్డింగ్ సంస్థ ప్రదర్శనకు పెట్టింది.

04/14/2018 - 23:52

బ్యాటరీలు చాలా ముఖ్యమైనవి. కారులో బ్యాటరీ లేకపోతే కారు నడువదు.
లాప్‌టాప్ పరిస్థితి సెల్‌ఫోన్ పరిస్థితి అంతే.
అవి పని చేయాలంటే బ్యాటరీలు మంచిగా వుండాలి. అవి చార్జింగ్‌లో ఉండాలి. చార్జింగ్ లేకపోయినా అవి పనిచేయవు. అవి పనిచేస్తే మనకి ఎంతో ఉపయోగపడతాయి.

04/14/2018 - 22:31

డబ్బుకు మనం విలువ ఇస్తే- అది మనకు విలువ ఇస్తుంది. మనం నిర్లక్ష్యం వహిస్తే ధనం తానేంటో చూపిస్తుంది. అసామాన్య విజయాలు సాధించిన కొందరి జీవిత అలవాట్లను తెలుసుకుంటే మనపై వారి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది.

04/14/2018 - 21:27

తీర్థయాత్రలు ఆధ్యాత్మిక జీవన విధానాన్ని పెంచడమే కాదు, మనలో నవ చైతన్యాన్ని ఆవిష్కరిస్తాయి. వివిధ ప్రాంతాల్లో విభిన్న ఆచారాలు, సంస్కృతులు, సంప్రదాయాలను పరిశీలించడానికి, ఏకత్వంలో భిన్నత్వాన్ని అవగాహన చేసుకునేందుకు యాత్రలు దోహదం చేస్తాయి. భక్త్భివంతో తీర్థయాత్రలు చేసేవారు ప్రకృతిలో అణువణువునా భగవత్ స్వరూపాన్ని దర్శిస్తారు.

04/08/2018 - 02:49

చిన్నప్పుడు గారడీ ఆటలను చూసి ఆశ్చర్యపోని వ్యక్తులు అరుదు.
మా చిన్నప్పుడు రోడ్డు మీద గారడీ ఆటలు జరిగేవి. నిమ్మకాయను కోసి రక్తం తీసేవారు. రేజర్ బ్లేడ్లని మింగి వాటిని మళ్లీ బయటకు తీసేవాళ్లు.
కళ్లు మూసుకున్న పిల్లవాడి మీద గుడ్డ కప్పేవాళ్లు. కానీ గారడీవాడు అడిగినప్పుడు అది చూస్తున్న వ్యక్తుల చేతిలో ఏముందో ఆ కుర్రాడు చెప్పేవాడు.
మాకు చాలా ఆశ్చర్యం వేసేది.

04/08/2018 - 02:46

మనల్ని ఎవరూ బలవంతపెట్టలేరు.
ఎవరైనా మనలని కొంత ప్రభావితం చేయగలరు. కొంత సహాయం చేయగలరు. అంతే కానీ ఎవరూ మనల్ని బలవంతపెట్టలేరు.
ఎవరూ మనలని ఈ విధంగా బలవంతపెట్టలేరు.
- ప్రేమించమని లేదా ద్వేషించమని.
- విశ్వసించమని లేదా విశ్వసించకూడదని
- నేర్చుకొమ్మని లేదా నేర్చుకోవద్దని
- ఆశావాహ దృక్పథంతో వుండమని లేదా నిరాశామయంగా ఉండమని
ఇదంతా మనకి మనం చేసుకునే ఎంపిక.

04/08/2018 - 02:07

ఒక అద్భుతం మన కళ్ళ ముందు ఆవిష్కృతమైనప్పుడు మనకు తెలీకుండానే నోటి నుండి వావ్.. వామ్మో.. వంటి శబ్దాలు వస్తాయి. కానీ ఈ అద్భుతాన్ని చూసినవాళ్ళు మాత్రం ‘బామ్మో!’ అంటున్నారు. ఆమెను చూసినవారు ఎవరైనా ఇలాగే అంటారు మరి! ఎందుకంటే ఆమె వయస్సు తొంభై సంవత్సరాలు. ‘కాటికి కాలుచాచిన వయస్సులో ఏమిటీ పొయ్యే కాలం!’ అని చాలామంది అనుకుంటున్నా- ఈ బామ్మ లెక్కచేయదు. పైగా అలాంటివారిని చూసి జాలిపడి..

Pages