S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2016 - 02:04

విజయవాడ, నవంబర్ 20: పెద్ద నోట్ల రద్దుతో అన్ని వర్గాల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్న చందంగా ఏదో రీతిలో నల్లధనాన్ని అతి సామాన్యుల ద్వారా చెలామణిలోకి తీసుకురావటానికి నల్ల కుబేరులు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీంతో హడలెత్తిపోతున్న కేంద్ర ప్రభుత్వం రోజుకో విధమైన ఆంక్షలు తీసుకువస్తుండటంతో బ్యాంకు ఉద్యోగులు తల్లడిల్లిపోతున్నారు.

11/21/2016 - 02:01

పుఖ్రాయన్ (యూపీ), నవంబర్ 20:ఉత్తర ప్రదేశ్‌లో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 120మంది దుర్మరణం చెందారు. మరో 200మంది గాయపడ్డారు. వీరిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పాట్నా వెళుతున్న ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 14బోగీలు పట్టాలు కాన్పూర్ గ్రామీణ ప్రాంతమైన పుక్రాయన్ వద్ద పట్టాలు తప్పడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.

11/21/2016 - 01:54

ఇండోర్, నవంబర్ 20: ఆదివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు సమీపంలో ఘోర ప్రమాదానికి గురయిన ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కిన సుమారు 200 మంది ప్రయాణికుల బంధువులు తమ వారి యోగక్షేమాలు తెలియక ఆందోళనతో స్థానిక రైల్వే స్టేషన్‌కు చేరుకుని తమ బంధువుల యోగక్షేమాల గురించి ఆదుర్దాగా అడగడం కనిపించింది. ‘ఇప్పటివరకు దాదాపు 200 మంది ప్రయాణికుల గురించి ఎంక్వయిరీలు మాకు వచ్చాయి.

11/21/2016 - 01:53

న్యూఢిల్లీ, నవంబర్ 20: ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదానికి రైలు పట్టాల్లో పగుళ్లే కారణమని రైల్వే వర్గాలు భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. కాన్పూర్ వద్ద సంభవించిన రైలు ప్రమాదానికి అసలు కారణం దర్యాప్తు అనంతరమే నిర్ధారణ కానున్నప్పటికీ ప్రాథమికంగా అందిన సమాచారాన్నిబట్టి రైలు పట్టాల్లో పగుళ్లే కారణమయి ఉండవచ్చని రైల్వే శాఖ భావిస్తోంది.

11/21/2016 - 01:53

న్యూఢిల్లీ, నవంబర్ 20: ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం జరిగిన ఘోర రైలు ప్రమాదం పట్ల యావద్భారతం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు మృతుల కుటుంబాలకు తీవ్ర సంతా పం తెలియజేశారు.

11/21/2016 - 01:46

పుఖర్యాన్, నవంబర్ 20: పాట్నా లో సోమవారం జరగబోయే తన స్నేహితుడి పెళ్లికోసం ప్రమాదం జరిగిన ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన వ్యాపారవేత్త అరుణ్‌శర్మ కుటుంబం పాలిట ఈ ప్రయాణం ఓ పీడకలగా మిగిలిపోయింది. ఈ ప్రమాదంలో శర్మ, ఆయన భార్య, 11 ఏళ్ల కుమారుడు త్రియాంశ్ గాయాల పాలు కాగా, తొమ్మిదేళ్ల మరో కుమారుడి జాడ ఇంకా తెలియరాలేదు.

11/21/2016 - 01:34

న్యూఢిల్లీ, నవంబర్ 20: పెద్దనోట్లను రద్దు చేయటం వల్ల తమ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతింటోందని వివిధ రాష్ట్రాలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి విన్నవించాయి. జిఎస్‌టి పన్ను పరిధికి సంబంధించి కేంద్ర రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగించేందుకు వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నోట్ల రద్దు ప్రధాన అంశంగా మారింది.

11/21/2016 - 00:56

హైదరాబాద్, నవంబర్ 20: అత్యాధునిక ఆయుధాలతో నిత్యం ప్రచ్ఛన్నయుద్ధం చేస్తూ, భారత్‌పై దుష్ప్రచారం చేస్తున్న పాకిస్థాన్‌తో చర్చలు కానీ, సయోధ్య కాని ఎంత మాత్రం అవసరం లేదని, పాక్ పని అయిపోయిందని ‘సోషల్‌కాజ్’ సంస్థ ఆదివారం ఉదయం నిర్వహించిన సదస్సులో పలువురు వక్తలు పేర్కొన్నారు.

11/21/2016 - 00:42

కాకినాడ, నవంబర్ 20: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో పాత నోట్ల మార్పిడిపై బేరసారాలు పతాకస్థాయికి చేరాయి. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రస్తుతం ఇదే తంతు కనిపిస్తోంది. ప్రస్తుతం 30 శాతం కమీషన్‌పై పాత నోట్ల మార్పిడి జరుగుతున్నట్టు తెలుస్తోంది.

11/21/2016 - 00:41

విజయనగరం, నవంబర్ 20: మహాకవి గురజాడ పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త, సహస్రావధాని గరికిపాటి నరసింహరావుకు ప్రదానం చేయనున్నారు. ఇక్కడి గురజాడ గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గురజాడ సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ మాట్లాడారు. ఈ నెల 30న గురజాడ వర్ధంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 2000 సంవత్సరం నుంచి ఈ పురస్కారాలు అందజేస్తున్నారు.

Pages