S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2016 - 00:18

న్యూఢిల్లీ, నవంబర్ 20: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ వారం ఒడిదుడుకులకు అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముగుస్తున్న డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు, పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, పార్లమెంట్ సమావేశాలు మదుపరుల పెట్టుబడులను ప్రభావితం చేయనున్నాయని మార్కెట్ వర్గాలు విశే్లషిస్తున్నాయ.

11/21/2016 - 00:14

న్యూఢిల్లీ, నవంబర్ 20: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్ యాప్ ఓలా.. ఓ సరికొత్త ప్రచారానికి తెరతీస్తోంది. అదే ‘క్యాష్‌లెస్ రైడ్స్’. అవును.. 500, 1,000 రూపాయల నోట్ల రద్దు క్రమంలో తలెత్తిన చిల్లర సమస్య దృష్ట్యా ప్రయాణికులు నగదురహిత చెల్లింపు అవకాశాలను వినియోగించుకోవాలని సూచిస్తోంది.

11/21/2016 - 00:14

హైదరాబాద్/నాగర్‌కర్నూల్, నవంబర్ 20: నిర్మాణ రంగం కుదేలైంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తం గా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తంభించిపోయంది. అవును.. నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలకుతోడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రియల్ ఎస్టేట్ లావాదేవీలను దెబ్బతీసింద.

11/21/2016 - 00:12

న్యూఢిల్లీ, నవంబర్ 20: మరొకరి ఖాతాలో తమ అక్రమ సొమ్మును డిపాజిట్ చేస్తే ఏడేళ్లు జైలుశిక్ష తప్పదని ఆదాయ పన్ను శాఖ హెచ్చరించింది. కొత్తగా తెచ్చిన బినామీ లావాదేవీల చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఐటి శాఖ స్పష్టం చేసింది. ఇతరుల ఖాతాల్లో జమచేసి నల్లధనాన్ని సక్రమంగా మార్చుకోవాలనుకుంటే జరిమానాలు, విచారణలు, కారాగారం ఎదుర్కోవాల్సిందేనంది.

11/21/2016 - 00:11

న్యూఢిల్లీ, నవంబర్ 20: పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావంపై ఎగుమతిదారులతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం సమావేశమవుతున్నారు. ఎగుమతి ప్రోత్సాహక మండళ్లతోపాటు ఎగుమతి రంగానికి చెందిన వివిధ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారు. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఈ నెల 8వ తేదీ రాత్రి 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేసినది తెలిసిందే.

11/21/2016 - 00:10

న్యూఢిల్లీ, నవంబర్ 20: భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహణ కొనసాగుతోంది. ఈ నెలలో ఇప్పటిదాకా దాదాపు 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక, తదనంతర పరిణామాల ప్రభావం భారత్‌సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది.

11/21/2016 - 00:06

ఏటూరునాగారం, నవంబర్ 20: మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామ సమీపంలో టివి-9, టివి-5, ఎన్‌టివి విలేఖర్లమంటూ ఇసుక లారీలను నిలిపి, హల్‌చల్ చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన ముగ్గురు నకిలీ విలేఖర్లను శనివారం రాత్రి పోలీసులు అరెస్టుచేసినట్లు ఏటూరునాగారం సబ్ డివిజనల్ పోలీసు అధికారి కె.దక్షిణామూర్తి తెలిపారు.

11/21/2016 - 00:05

మంగపేట, నవంబర్ 20: వినియోగదారులకు అందాల్సిన కిరోసిన్ పక్కదారి పడుతోంది. ప్రభుత్వం రేషన్ షాపు డీలర్ల నుండి తెల్ల రేషన్ కార్డు దారులకు ప్రతి నెలా అందించాల్సిన కిరోసిన్ కొంతమంది డీలర్లు సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో మండలంలో ప్రతి నెల వందలాది లీటర్ల నీలి కిరోసిన్ నల్ల బజారుకు తరలిపోతుంది.

11/21/2016 - 00:05

వరంగల్ (కల్చరల్), నవంబర్ 20: ప్రతి మనిషి తేనె లాంటి మధురానుభూతిని కలిగించే మనస్సుతో ఉండి పరోపకారనికి శ్రమించాలని పరమహంస పరివ్రాజకాచార్య మాధవానంద సరస్వతి స్వామిజీ అన్నారు. ఆదివారం కాజీపేటలోని స్వయంభూ శ్రీ శే్వతార్క మూలగణపతి దేవాలయ క్షేత్రంలో జరిగిన మహామధురాభిషేకంలో ఆయన పాల్గొన్నారు. ఆయనను ఆలయ వేదపండితులు మంగళవాయిద్యాల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు.

11/21/2016 - 00:04

కేసముద్రం, నవంబర్ 20: కేంద్రం తీసుకున్న పాతపెద్ద నోట్ల రద్దు కర్షకులకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. పాతపెద్ద నోట్ల రద్దు.. బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసుకోవడంపై ఆంక్షలు విధించడంతో వ్యాపారులు మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిపివేశారు.

Pages