S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2016 - 00:04

నక్కలగుట్ట,నవంబర్ 20: జిల్లాలోని కమలాపూర్‌నందు గల బిల్ట్ కార్మాగారాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తోందని మహబూబాబాద్ ఎంపి సీతారాంనాయక్ అన్నారు. ఆదివారం టిఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1970లో స్థాపింప బడిన కార్మాగారం కొంత కాలం నడిచిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే షట్‌డౌన్ అయిందని తెలిపారు.

11/21/2016 - 00:03

మహబూబాబాద్, నవంబర్ 20: మానుకోట పట్టణ అభివృద్ధికి బాటలు వేద్ధామని మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. మానుకోటలోని 20వ వార్డు పరిధిలో కలెక్టరేట్ కార్యాలయానికి వెల్లే మార్గంలో రూ.10 లక్షల ఎమ్మెల్యే సిడి ఎఫ్ నిధులతో చేపట్టిన గ్రావెల్ రోడ్డు పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు.

11/21/2016 - 00:02

కేసముద్రం, నవంబర్ 20: ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాతే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చైతన్యం వెల్లివిరిసిందని, టిడిపి ఆవిర్భావం తరువాతే సామాన్యులకు పదవులు చేరువయ్యాయని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం కేసముద్రం మండల కేంద్రంలో టిడిపి సభ్యత్వ నమోదుపై మహబూబాబాద్ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు.

11/20/2016 - 23:44

గజ్వేల్, నవంబర్ 20: సుప్రసిద్ధ వర్గల్ శ్రీ వేణుగోపాల స్వామి క్షేత్రంలో ఆదివారం కార్తీక సంబురాలు ఘనంగా జరిగాయి. వేద పండితులు అప్పల విశ్వనాథ శర్మ, శశిధర శర్మ, అనంతగిరిశర్మ, వెంకటరమణశర్మ, మురళీధరాచార్యుల నేతృత్వంలో వందలాదిగా శ్రీ సత్యదేవుడి వ్రతాలు నిర్వహించారు.

11/20/2016 - 23:44

చిన్నకోడూరు, నవంబర్ 20: ప్రభుత్వ బడుల్లో మెరుగైన వసతులు కల్పించడమే తన లక్ష్యమని నీటి పారుదల శాఖమంత్రి హరీష్‌రావు అన్నారు. ఆదివారం చిన్నకోడూరు జడ్పీహెచ్‌ఎస్‌లో బాలవికాస్ ఆధ్వర్యంలో దివిష్ మందుల కంపెనీవారు 20 బడులకు 520 డెస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ బడుల టీచర్లు తమవంతు బాధ్యతంగా పని చేయాలన్నారు.

11/20/2016 - 23:43

సిద్దిపేట, నవంబర్ 20 : క్రీడలు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్ అన్నారు. ఆదివారం కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఆనంతరం విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈసందర్భంగా సిపి శివకుమార్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమే అన్నారు. ఓటమి చెందిన వారు నిరాశ చెందకుండా మరోసారి గెలుపుకోసం కృషిచేయాలన్నారు.

11/20/2016 - 23:43

గజ్వేల్, నవంబర్ 20: భగవన్నామ స్మరణతోనే మానవుడికి మానసిక ప్రశాంతత దక్కుతుందని, ఎంతో చరిత్ర, మహాత్మ్యం కలిగిన వర్గల్ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధికి దాతల సహకారం ఎంతోఅవసరమని తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి తీర్థ స్వామిజీ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి వర్గల్ క్షేత్రం వద్ద కార్తీక దీపోత్సవంలో భాగంగా కార్తీక జ్యోతిని వెలిగించిన అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు.

11/20/2016 - 23:42

సిద్దిపేట అర్బన్, నవంబర్ 20: సమాజంలో రోజురోజుకు పాశ్చాత్య సంస్కృతి పెట్రేగి పోతుందని, హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని హరిద్వార్ మహామండలేశ్వర్ కైలాసానంద బ్రహ్మచారిజీ అన్నారు. దక్షిణకాశీ ధర్మపురి గోదావరి మహాహారతిలో పాల్గొనేందుకు వెళుతూ ఆదివారం సిద్దిపేట కోటిలింగేశ్వరాలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామిని పలువురు సన్మానించి ఆశీస్సులు పొందారు.

11/20/2016 - 23:42

పటన్‌చెరు, నవంబర్ 20: పటన్‌చెరు పట్టణంలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి సన్నాహాలు మొదలైనాయి. నిరంతరము కరెంట్ కోతతో ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజల ఇక్కట్లు తీర్చడానికి అధికారులు సన్నద్ధమైనారు. చైతన్యనగర్‌లోని చైతన్య ప్రైవేటు పాఠశాల ప్రక్కన గల ప్రభుత్వ స్థలాన్ని దీని కోసం ఎంపిక చేసారు. నాలుగు రోజుల క్రితం జిఎచ్‌ఎంసి అధికారులతో కలిసి ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి స్థల పరిశీలన చేసారు.

11/20/2016 - 23:41

సిద్దిపేట, నవంబర్ 20 : సిద్దిపేట ఉమ పార్థీవ కోటిలింగేశ్వరాలయంలో పోలీస్ కమిషనర్ శివకుమార్ ప్రత్యేక పూజలు చేశారు. సిద్దిపేట పోలీస్‌కమిషర్‌కు ఆలయ కమిటీ పక్షాన పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో సిపి శివకుమార్ కుటుంబ సమేతంగా రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. ఆనంతరం ఆలయ కమిటీ పక్షాన సిపి శివకుమార్‌ను ఘనంగా సన్మానించారు.

Pages