S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 02:28

విజయనగరం, జూలై 29: వనం-మనంలో భాగంగా కలెక్టరేట్‌లో బదిలీపై వెళుతున్న కలెక్టర్ ఎం ఎం నాయక్ మొక్కలు నాటారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నాటిన ప్రతి మొక్కను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని నాయక్ అధికారులను, సిబ్బందిని కోరారు. ఈ మొక్కల పరిరక్షణకు ట్రీగార్డులు ఏర్పాటుతోపాటు ప్రతిరోజు నీరు పెట్టేందుకు పైపులైన్ ఏర్పాటు చేశారు.

07/30/2016 - 02:28

విజయనగరం, జూలై 29: జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ శుక్రవారం పట్టణంలోని పైడితల్లి అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకున్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడానికి శ్రీకాకుళం నుంచి విజయనగరం చేరుకున్న ఆయన మొదట పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.

07/30/2016 - 02:27

విజయనగరం(టౌన్), జూలై 29: రాష్ట్రప్రభుత్వం విద్యారంగ సమస్యలపై అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆగస్టు 1వ తేదీన విద్యాసంస్ధల బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపుఇస్తుందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సురేష్ తెలిపారు. శుక్రవారం కెఎల్ పురంలోని శ్రామిక భవన్‌లో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలోని పలు సంక్షేమ వసతిగృహాలను ప్రభుత్వం విద్యార్థ్ధులు లేరనే సాకుతో మూసి వేసిందన్నారు.

07/30/2016 - 02:27

విజయనగరం(టౌన్), జూలై 29: వనం మనంలో పట్టణ ప్రజలు కుల, మతాలకు అతీతంగా పాల్గొని మానవాలి మనుగడకు జీవనాధారమైన మొక్కలు విరివిగా నాటారు. వనం-మనంలో అందరూ పాల్గొనాలని ప్రభుత్వం సూచనతో శుక్రవారం పట్టణ పరిధిలో పలు సంస్ధలు, విద్యార్థులు ప్రభుత్వ సిబ్బంది మొక్కలు నాటే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు.

07/30/2016 - 02:25

అనంతపురం, జూలై 29 : జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనతో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉత్పత్తి, సేవా రంగ పరిశ్రమల ఏర్పాటుకు నిబంధనలను అనుసరించి రూ.5 కోట్ల వరకూ వెచ్చించే అవకాశం కల్పించింది.

07/30/2016 - 02:25

హిందూపురం, జూలై 29 : రాష్ట్ర విభజనతో పూర్తిగా చతికిలబడ్డ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లోగా రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సొంత జిల్లా అనంతలో కాంగ్రెస్ పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.

07/30/2016 - 02:23

రాయదుర్గం రూరల్, జూలై 29 : మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ సాధ్యమని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా శు క్రవారం మండలంలోని కెంచానపల్లి గ్రామం వద్ద చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వనం- మనం కార్యక్రమంలో భాగస్వాములై మొక్కలు వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

07/30/2016 - 02:23

మడకశిర, జూలై 29 : ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల మండలంలోని చిన్న చెరువుకు గండి పడింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. భారీ వర్షాల కారణంగా పలు చెక్‌డ్యాంలు, నీటి కుంటలు నిండగా వంకలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. హరేసముద్రం చిన్న చెరువు కింద ఉన్న ఆయకట్టదారులు చెరువులో నీరు లేకపోయినా వర్షాలతోనైనా దిగుబడులు వస్తాయని మొక్కజొన్న, రాగి వంటి పంటలు సాగు చేశారు.

07/30/2016 - 02:23

అనంతపురం, జూలై 29 : నీటి పారుదల సలహా మండలి సమావేశం ఆగస్టు 1న కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో చైర్మన్, కలెక్టర్ కోన శశిధర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్‌ఓ) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

07/30/2016 - 02:22

కణేకల్లు, జూలై 29 : సకల జీవకోటి మనుగడకు చెట్లే ప్రాణవాయువులని మంత్రులు కామినేని శ్రీనివాస్, పరిటాల సునీత అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనం -మనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని రచ్చుమర్రి గ్రా మంలో మొక్కలు నాటారు.

Pages