S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 02:22

బుక్కరాయసముద్రం, జూలై 29:నిత్యం కరవు కాటకాలతో అల్లాడుతున్న అనంతను హారితవనంగా మారుద్దామని అనంతపురం జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు అన్నారు.

07/30/2016 - 02:21

ఉరవకొండ, జూలై 29 : పట్టణంలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలివ్వాలని ఎమ్మెల్యే విశే్వశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

07/30/2016 - 02:20

తాడిపత్రి, జూలై 29:స్థానిక శ్రీకన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో ఆషాడమాసాన్ని పునస్కరించుకుని శుక్రవారం శాకంబరిదేవి ప్రత్యేకఅలంకరణతో శ్రీకన్యకాపరమేశ్వరీదేవి భక్తులకు నయనానందకరం గావించారు. ముందుగా అమ్మవారికి విశేషపూజలు నిర్వహించి, మహిళలతో కుంకుమార్చనలు గావించారు.

07/30/2016 - 02:20

హిందూపురం, జూలై 29 : విభజన హామీలో భాగంగా ప్రత్యేక హోదా క ల్పించాలని డిమాండ్ చేస్తూ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా జెఏసి ని ఏర్పాటు చేసేందుకు వివిధ వర్గాలు సమాయత్తమవుతున్నాయి. ఇందులో భాగంగా స్థానిక జీవిత బీమా సంస్థ డెవలప్‌మెంట్ అధికారి నరేంద్రనాథ్ ఆధ్వర్యంలో ఇటీవలే కొందరు సామాజిక వేత్త, గాంధేయవాది అన్నా హజారేను కలిసి చర్చించారు.

07/30/2016 - 02:19

హిందూపురం టౌన్, జూలై 29 : మున్సిపాలిటీలో నెల రోజులుగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం లేదు. గతనెల 30వ తేదీన కమిషనర్ ఎవివి భద్రరావు పదవీ విరమణ చేయడంతో అప్పటి నుండి జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ పూర్తిగా నిలిచిపోయింది. సాధారణంగా పత్రాల జారీకి కమిషనర్ డిజిటల్ సంతకం చేయాల్సి ఉంటుంది. భద్రరావు పదవీ విరమణ చేయడంతో కమిషనర్ బాధ్యతలు తీసుకున్న వ్యక్తి పేర డిజిటల్ కీ తీసుకోవాల్సి ఉంటుంది.

07/30/2016 - 02:19

బత్తలపల్లి, జూలై 29:అనంతపురం-కదిరి జాతీయ రహదారిలోని మండల పరిధిలోని కట్టకింద పల్లి సమీపాన శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన వీరప్పనాయునిపల్లి మండలం అక్షువెల్లి గ్రామానికి చెందిన మదన్‌మోహన్‌రెడ్డి(50) మృతి చెందాడు. మృతుడు కడప జిల్లాలోని గండిక్షేత్రంలో గల గురుకుల పాఠశాలలో లెక్కల మాస్టారుగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

07/30/2016 - 02:18

తాడిమర్రి, జూలై 29:మండలంలోని స్థానిక ఎంపిటిసి సుభద్రమ్మ భర్త శ్రీశైలం భాస్కర్‌గౌడ్(55) శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. స్థానిక పోలీసుల వివరాల మేరకు బత్తలపల్లి నుండి ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి భాస్కరగౌడ్, కుమారుడితో కలసి గ్రామ సమీపానికి రాగానే ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొంది. సంఘటనలో అక్కడికక్కడే తండ్రి, కొడుకులకు కాళ్ళు విరిగాయి.

07/30/2016 - 02:17

రావులపాలెం, జూలై 29: అంత్య పుష్కరాలకు సంబంధించి రావులపాలెం గౌతమి గోదావరి ఘాట్ ఏర్పాటుకు జిల్లా కలెక్టరు నుండి అనుమతులు లభించినట్టు శుక్రవారం రాత్రి సర్పంచ్ పోతుమూడి విజయలక్ష్మి, ఉప సర్పంచ్ కొవ్వూరి జగన్నాథరెడ్డి విలేఖరులకు తెలిపారు.

07/30/2016 - 02:16

రాజమహేంద్రవరం, జూలై 29: ఆది పుష్కరాల కంటే వైభవంగా అంత్య పుష్కరాల సందర్భంగా పుష్కర ఘాట్‌ను దేదీప్యమానంగా తీర్చిదిద్దుతున్నారు. అంత్య పుష్కరాల ప్రధాన వేదికగా పుష్కర ఘాట్ ప్రాధాన్యత సంతరించుకుంటోంది. అఖండ గోదావరి నదికి అఖండ హారతి కార్యక్రమానికి, అంత్య పుష్కరాల సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రధాన భూమిక వహించే విధంగా పుష్కర ఘాట్‌ను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్నారు.

07/30/2016 - 02:15

పెద్దాపురం, జూలై 29: రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.

Pages