S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 02:15

రాజమహేంద్రవరం, జూలై 29: గోదావరి అంత్య పుష్కర యాత్రికుల పట్ల మర్యాదగా వ్యవహరించి, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరించాలని ఎస్పీ బి రాజకుమారి పోలీసు సిబ్బందికి సూచించారు. పుష్కరస్నానం, పిండప్రదానాలు చేసే యాత్రికులు క్షేమంగా తిరిగి ఇళ్లకు చేరే వరకు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

07/30/2016 - 02:14

శంఖవరం, జూలై 29: ఇంజక్షన్ కావాలంటే సూది కొనుక్కోవాల్సిందే శీర్షికన ఈ నెల 27న ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందించిన అధికారులు రోగుల వెతలు తీర్చేందుకు నిండుగా సిరంజీలు సమకూర్చారు. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రం శంఖవరం గ్రామంలోని ప్రాథమికోన్నత ఆరోగ్య కేంద్రంలో గత కొన్ని రోజులుగా రోగులు తమకు ఇంజక్షన్ చేయించుకోవాలంటే తమ వెంట సిరంజీలు కొనుగోలు చేసి తెచ్చుకోవాలి.

07/30/2016 - 02:13

శంఖవరం, జూలై 29: అన్నవరం సత్యదేవుని దేవస్థానం దత్తత దేవాలయమైన శంఖవరంలోని శ్రీ పార్వతీ మల్లేశ్వర స్వామివార్ల ఆలయం (శివాలయం)లో అష్టోత్తర శత కలశాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అన్నవరం దేవస్థానం వేద పండితులు, శంఖవరం గ్రామస్థులు సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టారు.

07/30/2016 - 02:13

కాకినాడ సిటీ, జూలై 29: ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు సక్రమంగా అందేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రగతికి రెండు చక్రాల్లా సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. కలెక్టరేట్ కోర్టుహాలులో శుక్రవారం రాత్రి మంత్రి ఉమామహేశ్వరావు, డిప్యూటీ సిఎం చినరాజప్ప జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు.

07/30/2016 - 02:12

రాజవొమ్మంగి, జూలై 29: ప్రతీ మహిళకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామని, వైద్య సహాయాన్ని విస్తుృతంగా అందజేస్తున్నామని, మాతా, శిశుమరణాలు తగ్గిస్తున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రకటల్లో వాస్తవం కనిపించడంలేదు. సరైన వైద్య సహాయం అందక నెలల వయసున్న ఇరువురు శిశువులు మరణించి ఇరువురు తల్లులకు గర్భశోకాన్ని మిగిల్చారు.

07/30/2016 - 02:11

కాకినాడ సిటీ, జూలై 29: రాష్ట్రంలో వనం-మనం కార్యక్రమంలో భాగంగా 1.40కోట్ల మొక్కలు నాటనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జిమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.

07/30/2016 - 02:11

డి గన్నవరం, జూలై 29: డి గన్నవరం మెయిన్‌రోడ్డును ఆనుకుని నిర్మించిన బస్‌షెల్టర్ ప్రారంభం కాకుండానే కాలువల ఆధునీకీకరణ పనులకు అడ్డువచ్చిందని ఇరిగేషన్ అధికారులు శుక్రవారం తొలగించారు. 2013లో అప్పటి అమలాపురం జివి హర్షకుమార్ గెయిల్ సంస్థను ఒప్పించి రూ.2లక్షలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ నిధులు ఒక లక్ష మొత్తం మూడు లక్షలు వెచ్చించి 2013 సంవత్సరంలో ఈబస్ షెల్టర్‌ను నిర్మించారు.

07/30/2016 - 02:11

చింతూరు, జూలై 29: మండలంలోని పేగ, సూరకుంట గ్రామాల మధ్య శుక్రవారం మావోయిస్టులు పోస్టర్లు, కరపత్రాలను వదిలి వెళ్లారు. ఈ పోస్టర్లు, కరపత్రాలు మావోయిస్టు శబరి ఏరియా కమిటీ, మావోయిస్టు తెలంగాణా రాష్ట్ర కమిటీ పేరున వెలిశాయి. వీటిలో జూలై 28నుంచి ఆగస్టు 3వ తేదీ వరకూ జరిగే మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను గ్రామగ్రామాల్లో నిర్వహించాలని పిలుపునిచ్చారు.

07/30/2016 - 02:09

ఏలూరు, జూలై 29: అంతా పచ్చగా ఉండాలి...్ఫలితంగానే పర్యావరణం మెరుగుపడి కుటుంబాలన్నీ పచ్చగా ఉండేందుకు అవకాశం ఉంటుంది... రాష్ట్రంలో 50శాతం మొక్కలు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది... అవిధంగా అన్నీప్రాంతాలు పచ్చగా ఉండేందుకు తనవంతు కృషి ప్రారంభించింది...

07/30/2016 - 02:09

భీమవరం, జూలై 29: తెలుగుపౌరుడికి న్యాయం జరగాల్సిందేనని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మీ తన గళాన్ని విప్పి డిమాండ్ చేశారు. రాష్టవ్రిభజన సమయంలో ఆంధ్రులకు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్రప్రభుత్వం అమలుచేయాలన్నారు. శుక్రవారం రాజ్యసభలో తోట సీతారామలక్ష్మీ ఐదు నిమిషాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై ప్రసంగించారు.

Pages