S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 02:08

పాలకొల్లు, జూలై 29: కనీస మానవత్వం లేకుండా సహ ఉద్యోగి మరణంపై కూడా చిల్లర ఏరుకోవడానికి ప్రయత్నించిన ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) వలకు చిక్కారు. మృతుని కుటుంబీకులకు రావలసిన పరిహారం, కారుణ్య నియామకం తదితర పనులు చేసిపెట్టడానికంటూ రూ.30 వేలు లంచం తీసుకుంటున్న పాలకొల్లు మున్సిపల్ మేనేజర్, గుమస్తాను ఎసిబి అధికార్లు వలపన్ని పట్టుకున్నారు.

07/30/2016 - 02:07

నల్లజర్ల, జులై 29: బిజెపి ప్రభుత్వం ఎన్నికల హామీగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పరకాల ప్రభాకర్ డిమాండ్ చేశారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా పాల్గొనేందుకు శుక్రవారం ఆయన నల్లజర్ల విచ్చేసి స్థానిక టిడిపి నాయకత్వ శిక్షణా కేంద్రం వద్ద విలేఖరులతో మాట్లాడారు.

07/30/2016 - 02:06

ఆకివీడు, జూలై 29: ఆకివీడులో శుక్రవారం ఉదయం వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. భారీవర్షంతో సంతమార్కెట్, పెద్దింట్లమ్మ అమ్మవారి వీధి, రెడ్డి వీధి, అమృతరావుకాలనీ, కూరగాయల మార్కెట్, చినపల్లివీధి మోకాలు లోతు వర్షపునీటిలో మునిగాయి. అందేవారిబోదె ఉద్ధృతంగా ప్రవహించింది. ఈ ప్రాంతంలోని బాలికోన్నత పాఠశాలలోకి వర్షపునీరు చొచ్చుకుపోయింది.

07/30/2016 - 02:06

జంగారెడ్డిగూడెం, జూలై 29: గోదావరి అంత్య పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లుచేసిందని జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం జంగారెడ్డిగూడెం డివిజన్‌లో గోదావరి అంత్య పుష్కరాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

07/30/2016 - 02:05

తాడేపల్లిగూడెం, జులై 29: అకారణంగా చెట్లు నరికితే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హెచ్చరించారు. రూరల్ మండలం వెంకట్రామన్నగూడెంలో వనం-మనం కార్యక్రమం శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. చెట్లు నరికివేతపై చట్టాన్ని సవరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.

07/30/2016 - 02:05

నరసాపురం, జూలై 29: గోదావరి అంత్య పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేపట్టినట్లు ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు తెలిపారు. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన గోదావరి అంత్య పుష్కరాల ట్రయల్ రన్‌లో ఆయన పాల్గొన్నారు. బస్టాండ్ నుండి ప్రారంభమైన ఈ రన్ అమరేశ్వర ఘాట్, వలంధర రేవు, కొండాలమ్మ ఘాట్ వరకు సాగింది. చైర్‌పర్సన్ రత్నమాల సాయి, సబ్ కలెక్టర్ ఎఎస్ దినేష్‌కుమార్ రన్‌లో పాల్గొన్నారు.

07/30/2016 - 02:04

తాడేపల్లిగూడెం, జులై 29: ఏలూరు కాలువలో ఈతకు వెళ్లి ఇంజనీరింగ్ విద్యార్థి గల్లంతైన సంఘటన తాడేపల్లిగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వాసవీ ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్న మాకా ఫణికుమార్ (21) రోజూ జిమ్‌కు వెళ్లి అనంతరం ఏలూరు కాలువలో ఈత కొట్టేవాడు.

07/30/2016 - 02:04

ఏలూరు, జూలై 29 : జిల్లాలో పేదల ఇళ్ల నిర్మాణానికి రూ. 500 కోట్లు నిధులు ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు.

07/30/2016 - 02:02

హైదరాబాద్, జూలై 29: పద్మభూషణ్ డా. సి.నారాయణరెడ్డి సాహిత్యం కేవలం నగరవాసులకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా చదవడానికి వీలుగా సినారె సాహిత్యాన్ని గ్రామాలకు చేరే విధంగా తెలంగాణ రాష్ట్ర సలహాదారులు కెవి రమణాచారి, డా. శ్రీనివాస్ ఆళ్ళ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు సూచించారు.

07/30/2016 - 02:00

హైదరాబాద్, జూలై 29: దారి మళ్లించి.. దోపిడీలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన బవారీయా ముఠాను దక్షిణ, ఈస్ట్‌జోన్ టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు.

Pages