S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 01:59

ఘట్‌కేసర్, జూలై 29: సరదాకోసం చేసే ర్యాగింగ్‌తో విద్యార్థినీ విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని సైబరాబాద్ తూర్పు కమిషనర్ ఆఫ్ పోలీసు మహేష్‌భగవత్ అన్నారు. మండల పరిధి వెంకటాపూర్‌లోని అనురాగ్ విద్యాసంస్థలో శుక్రవారం జరిగిన యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సులో సిపి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకుని సాధించేవరకు విశ్రమించకుండా శ్రమించాలని సూచించారు.

07/30/2016 - 01:59

హైదరాబాద్, జూలై 29: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వంటి అనేక అంశాలను ప్రజలకు తెలియజేసేలా మరిన్ని చిత్రాలు తీయాలని నిర్మాతలకు ఎమ్మెల్సీ ఎన్. రామచందర్‌రావు పిలుపునిచ్చారు.

07/30/2016 - 01:58

వికారాబాద్, జూలై 29: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 12 రోజులుగా సమ్మె చేస్తున్న ఏఎన్‌ఎంలు శుక్రవారం వికారాబాద్ అర్‌అండ్‌బి అతిథిగృహానికి వచ్చిన రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పి.సునీతామహేందర్‌రెడ్డి, శాసనసభ్యుడు బి.సంజీవరావులకు వినతిపత్రం ఇచ్చారు. సమస్యల్లో ఒకటైన వేతనాలు పెంచాలని ఏఎన్‌ఎంలు కోరడంతో స్పందించిన జడ్పీచైర్‌పర్సన్ పది వేల రూపాయల వేతనం సరిపోదా అంటూ ప్రశ్నించారు.

07/30/2016 - 01:57

శంషాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్‌మెంట్ తుంగలో తొక్కిన కెసిఆర్‌పై ఉద్యమం ఉధృతం చేయాలని మాజీ హోంమంత్రి సబితారెడ్డి అన్నారు.

07/30/2016 - 01:57

హైదరాబాద్, జూలై 29: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయవద్దని ర్యాంకర్లు..తల్లిదండ్రులు శుక్రవారం నిర్వహించిన ఆందోళనలు..నిరససనల సెగ ఇందిరాపార్కుకూ తాకింది. తొలుత సచివాలయం వద్ద ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు పోలీసులు అడ్డుకోవటంతో ర్యాంకర్లు, తల్లిదండ్రులు ఎవరికి వారు వేర్వేరుగా ఇందిరాపార్కుకు చేరుకున్నారు.

07/30/2016 - 01:56

ఎల్‌బినగర్, జులై 29: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విజయవంతం చేయాలని రవాణశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కొత్తపేట్ డివిజన్ పరిధి సిటిఓ కాలనీలోని లిటిల్ ఏంజెల్ పాఠశాల ఆధ్వర్యంలో చేపట్టిన హరితహార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

07/30/2016 - 01:55

హైదరాబాద్, జూలై 29: దారిద్ర రేఖకు దిగువనున్న (బిపిఎల్) కుటుంబాలకు ఒక్క రూపాయికే వాటర్ కనెక్షన్ అందించేందుకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఫుడ్ సెక్యూరిటీ కార్డులు కలిగిన వారికి, బిపిఎల్ కార్డులు కలిగిన పేద ప్రజలకు కేవలం రూపాయికే నీటి కనెక్షన్‌ను ప్రభుత్వం ఇవ్వనుంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి నల్లా పథకంలో భాగంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అడుగులు ముందుకు వేస్తోంది.

07/30/2016 - 01:55

వనస్థలిపురం, జూలై 29: దళితులకు వర్గీకరణ అవసరం లేదని, ఐక్యతతో రాజ్యాధికారం సాధిస్తామని జాతీయ మాలల ఐక్య వేదిక గ్రేటర్ హైదరాద్ అధ్యక్షుడు బేర బాలకృష్ణ ధీమ వ్యక్తం చేశారు. వర్గీకరణ వద్దు- రాజ్యాధికారం ముద్దు అంటూ శుక్రవారం ఎల్‌బినగర్ రింగు రోడ్డ్ లోని డా.అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు వినతిపత్రం సమర్పించారు. రింగు రోడ్డులో ధర్నా నిర్వహించారు.

07/30/2016 - 01:54

హైదరాబాద్, జూలై 29: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు జలమండలి పరంగా మెరుగైన సేవలను అందిస్తున్నామని, వినియోగదారులు కూడా తమ వంతు బాధ్యతాయుతంగా వ్యవహరించి సకాలంలో నీటి బిల్లులు చెల్లించాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిషోర్ స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 8.76 లక్షల నీటి కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు.

07/30/2016 - 01:53

చార్మినార్, జూలై 29: పేదల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా ఉన్న మానవ ఔషధ ప్రయోగశాలల విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే మార్చాలని తెలంగాణ ప్రజారోగ్య పరిరక్షణ సంఘం, మానవ ఔషధ ప్రయోగశాలల కార్యకర్త హక్కుల, సంక్షేమ సంఘం డిమాండ్ చేశారు.

Pages