S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/29/2016 - 00:51

శ్రీ కాళహస్తి, జూలై 28: ఆడికృత్తిక సందర్భంగా గురువారం శ్రీ కాళహస్తిలో వైభవంగా జరిగింది. పట్టణంలోని విజ్ఞానగిరిపై ఉన్న కుమారస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మొక్కుబడి ఉన్న భక్తులు పూలకావళ్లుతో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. నారద పుష్కరిణిలో తలనీలాలు సమర్పించి అక్కడే స్నానాలు చేశారు. మహిళా భక్తులు బట్టలుమార్చుకోవడానికి దేవస్థానం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాటుచేశారు.

07/29/2016 - 00:51

వి.కోట, జూలై 28: మండల పరిధిలో చేపట్టిన హంద్రీ-నీవా కాలువ పనుల వల్ల భూములు, ఆస్తులు పోగొట్టుకుంటున్న రైతులకు ప్రభుత్వం సత్వరం ఆదుకోవాలని బిఎస్‌పి పార్టీ ఆధ్వర్యంలో రైతులు గురువారం జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం మండలం మీదుగా కుప్పంకు హంద్రీ-నీవా నదీ జలాలను తీసుకెళ్లేందుకు ముమ్మరంగా కాలువ పనులు చేపట్టారు.

07/29/2016 - 00:50

తిరుపతి, జూలై 28: దారిద్య్రరేఖకు దిగువున్న ఉన్న పేద రోగులు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ శస్తచ్రికిత్సలు, వైద్యసేవలు పొందలేని వారి కోసం స్విమ్స్‌లో ఉచిత వైద్యసేవలు అందించేందుకు ఏర్పాటుచేసిన ప్రాణదాన కమిటీలో అర్హులైన 64 మంది రోగులను ప్రాణదాన కమిటీ ఎంపిక చేసినట్లు స్విమ్స్‌డైరెక్టర్ డాక్టర్ టి ఎస్ రవికుమార్ తెలిపారు. గురువారం స్విమ్స్‌లో ప్రాణదాన కమిటీ సమావేశం నిర్వహించారు.

07/29/2016 - 00:50

తిరుపతి, జూలై 28: ఇటీవల పుంగనూరు నుంచి కబేళాలకు తరలిస్తున్న 52 లేగదూడలను బిజెపి నేతలు కాపాడిన విషయం పాఠకులకు విదితమే. అయితే వీటిని పలమనేరు గోశాలకు తరలించారు. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో సమాచారం తెలుసుకున్న టిటిడి బోర్డుసభ్యుడు భానుప్రకాష్ రెడ్డి వాటిని తిరుపతిలోని టిటిడి గోశాలకు తరలించారు. డైరెక్టర్ హరినాథరెడ్డితో చర్చించి వాటికి సంరక్షణ కల్పించాలని చర్చించారు.

07/29/2016 - 00:49

పాకాల, జూలై 28: తిరుమల తిరుపతి దేవస్థానం పాకాల మండలం ఊట్లవారి పల్లె సమీపంలోని ఆనందగిరిపై ఉన్న శ్రీ వళ్లీదేవసేన సమేత శ్రీ కల్యాణ సుబ్రహ్మణ్యస్వామివారికి శ్రీ వేంకటేశ్వర స్వామివారి తరపున పట్టువస్త్రాలను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి గురువారం సమర్పించారు.

07/29/2016 - 00:49

తిరుమల, జూలై 28: తిరుమలలో గురువారం సాయంత్రం కుంభవృష్టి పడింది. గంట పాటు ఎడతెరపిలేని వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. భక్తులు ఇబ్బందులు పడ్డారు. గదులు దొరకని భక్తులు మరిన్ని ఇబ్బందులకు గురయ్యారు. దుకాణాలు మూతబడ్డాయి. అయితే వాతావరణం చల్లబడింది.

07/29/2016 - 00:48

శ్రీ కాళహస్తి, జూలై 28: గాలిగోపురం పునర్నిర్మాణ పనులను నవంబర్ నాటికి పూర్తిచేయాలని దేవాదాయ రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శి జె ఎస్ వి ప్రసాద్ నవయుగ నిర్మాణ సంస్థ వారిని ఆదేశించారు. సాధికారిక సర్వే ప్రత్యేక అధికారి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన గురువారం సాయంత్రం శ్రీ కాళహస్తికి వచ్చారు. ఈసందర్భంగా ఆలయ సమీపంలో జరుగుతున్న రాజగోపురం పునర్మిర్మాణ పనులను పరిశీలించారు.

07/29/2016 - 00:46

కాకినాడ, జూలై 28: వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆహార సంక్షోభం తప్పదని, వ్యవసాయ రంగ పరిరక్షణకు ప్రభుత్వం తక్షణం సంకల్పించేలా చూడాలని రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌కు రైతులు విజ్ఞప్తి చేశారు. కాకినాడలోని కృషి భవన్‌లో గురువారం రాష్ట్ర వ్యవసాయ కమిషన్ బృందం, వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు.

07/29/2016 - 00:46

కాకినాడ, జూలై 28: ప్రజాప్రతినిధుల కృషితోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు విజయవంతమవుతాయని, ప్రజలకు ఫలాలు చేరువవుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ బి రామాంజనేయులు అన్నారు. జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని అంబేద్కర్ భవన్‌లో గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇతర శాఖల నిధులతో చేపట్టే పనులపై ప్రజాప్రతినిధులకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.

07/29/2016 - 00:45

కాకినాడ, జూలై 28: జిల్లాలో ఉన్న ప్రతీ ఇంటిలో తప్పనిసరిగా ఐదు మొక్కలు నాటాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు పిలుపునిచ్చారు. గురువారం జడ్పీ కార్యాలయ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. జిల్లాలో సుమారు 2 లక్షల మొక్కలు నాటాలని నామన కోరారు.

Pages