S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/29/2016 - 01:23

విశాఖపట్నం, జూలై 28: జిల్లా అభివృద్ధికి సంబంధించి కేటాయించిన పనులన్నింటిని త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల అభివృద్ధి పనులకు సంబంధించి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ నాటికి అన్ని మునిసిపాలిటీలను బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్నారు.

07/29/2016 - 01:22

విశాఖపట్నం, జూలై 28: సింహాచలం భూముల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింహాచలం దేవస్థానం భూముల వ్యవహారం కోర్టులో ఉందని, అయినప్పటికీ దేవాదాయ శాఖకు, ప్రజలకు నష్టం జరగకుండా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.

07/29/2016 - 01:21

విశాఖపట్నం, జూలై 28: మిషన్ హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా వనం-మనం కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. 67వ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29వ తేదీన రాష్టవ్య్రాప్తంగా కోటి మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రతి జిల్లాలో పది లక్షల మొక్కలు నాటాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు.

07/29/2016 - 01:20

విశాఖపట్నం, జూలై 28: రాష్ట్రంలోనే తొలి ప్రయోగం అయిన ‘మహిళలకు ప్రత్యేక బస్సు’ గురువారం ప్రారంభమైంది. ఇది తొలి సర్వీసుగా కూర్మన్నపాలెం నుంచి ఉదయం 7.20 గంటలకు కదిలింది. బస్సు ప్రారంభంలోనే మహిళల నుంచి విశేష ఆదరణ లభించింది.

07/29/2016 - 01:20

సీలేరు,జూలై 28: ఎ.ఓ.బి. పరిధిలోని కలిమెల ఏరియా కమిటీకి చెందిన రాధా మడకామి అలియాస్ రాధ గురువారం మల్కన్‌గిరి ఎస్పీ మిత్రభాను మహోపాత్రో ఎదుట లొంగిపోయింది. ఈమెపై నాలుగు లక్షల రికార్డు కూడా ఉంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

07/29/2016 - 01:19

పాడేరు, జూలై 28: తనకు రాజకీయ భవిష్యత్తును ప్రసాదించిన తమ నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ఎల్లవేళలా అండగా ఉంటానని, తాను ఏ ఇతర పార్టీలో చేరే ప్రసక్తే లేదని పాడే రు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి స్పష్టం చేశారు. గురువారం సాయం త్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను అధికార టిడిపిలో చేరుతున్నట్టు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.

07/29/2016 - 01:19

గూడెంకొత్తవీధి, జూలై 28: ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంత పోలీసు నిఘా నీడలో ఉంది. అమర వీరుల వారోత్సవాల నేపథ్యంలో రాష్ట్రం పోలీస్ యంత్రాంగం ఎఒబిలో భద్రతను కట్టుదిట్టం చేసింది. గత కొంత కాలంగా తూర్పు కనుమల్లో మావోయిస్టులకు తగిలిన ఎదురుదెబ్బల్లో అనేక మంది దళ నాయకులు, దళ సభ్యులను కోల్పోయారు.

07/29/2016 - 01:18

నర్సీపట్నం, జూలై 28: కుటుంబ కలహాలు తల్లీబిడ్డను బలితీసుకుంది. రెండేళ్ళ బాబుతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం వరకు తల్లిదండ్రులతో కలిసి ఉన్న కుమార్తె, మనుమడు కొద్ది గంటల వ్యవధిలోనే విగత జీవులుగా మారారు. తల్లి, బిడ్డ మృత దేహాలను చూసిన ప్రతీ ఒక్కరూ కంటతడి పెడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి గ్రామస్థులు అందించిన వివరాలిలా ఉన్నాయి.

07/29/2016 - 00:54

చిత్తూరు, జూలై 28: జిల్లాలో అనుమతులు పొందిన పరిశ్రమలను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశించారు. గురువారం చిత్తూరులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. అనుమతులు మంజూరు విషయంలో అధికారుల అలసత్వం వహించడం మంచిది కాదన్నారు.

07/29/2016 - 00:53

తిరుపతి, జూలై 28: భవాని నగర్‌కు చెందిన వంశీకృష్ణ గత నెల 12న ఉప్పరపల్లిలో హత్యకు గురయ్యాడు. ముందుగా గుర్తుతెలియని వ్యక్తి హత్యగా నమోదుచేసుకున్న ఎమ్ ఆర్ పల్లి పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. గురువారం హత్యకు కారణమైన ఒక పోలీస్ కానిస్టేబుల్ భార్యతో పాటు పలువురిని అరెస్ట్‌చేశారు. జిల్లా ఎస్పీ జయలక్ష్మి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వంశీకృష్ణ చిన్నచిన్న నేరాలకు పాల్పడుతూ జీవనం సాగించేవాడు.

Pages