S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/29/2016 - 00:21

ఏలూరు, జూలై 28: చింతలపూడి ఎత్తిపోతల పధకం భూసేకరణ విషయంలో రైతులపక్షాన నిలబడి వారికి పూర్తిన్యాయం చేస్తానని రాష్ట్ర గనులు, స్ర్తి,శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. చింతలపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో గురువారం తనను కలిసిన రైతులతో మంత్రి మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పధకానికి సంబంధించి భూయజమానులకు న్యాయమైన నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.

07/29/2016 - 00:21

ఏలూరు, జూలై 28: రాష్ట్రప్రభుత్వ పరంగా జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు జరుగుతూనే ఉంటుంది. అటు ఎమ్మెల్యేలు, ఇటు అయాశాఖల పరంగా వచ్చే నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లటం సర్వసాధారణం. అయితే పార్లమెంటు సభ్యులకు మాత్రం ఏటా భారీగా నిధుల కేటాయింపు జరుగుతున్నందున వారి ఎంపి ల్యాడ్స్‌తో ఈ అభివృద్ధి హంగులు జిల్లాకు మరింతగా సమకూరుతున్నాయి.

07/29/2016 - 00:20

చింతలపూడి, జూలై 28: రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా 43 మండలాల్లో మినీ రైతు బజార్లను ఏర్పాటుచేస్తున్నట్టు రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు.దీనిలో భాగంగా చింతలపూడి మార్కెట్టు యార్డులో ఏర్పాటుచేసిన రైతు బజారును గురువారం ఆమె ప్రారంభించారు.

07/29/2016 - 00:20

తాడేపల్లిగూడెం, జూలై 28: గ్యాస్ పొయ్యి లేని పేద మహిళలకు ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏ ఒక్క ఆడపడుచూ వంట గ్యాస్ కనెక్షన్ లేదనకుండా అర్హత గల ప్రతి పేద మహిళకు ఉచితంగా అందిస్తామన్నారు.

07/29/2016 - 00:19

ఏలూరు, జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా శుక్రవారం నాడు 13 జిల్లాల్లో కోటి మొక్కలను వనం-మనం కార్యక్రమంలో నాటుతున్న దృష్ట్యా పశ్చిమగోదావరి జిల్లాలో పది లక్షల మొక్కలను నాటుతున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు.

07/29/2016 - 00:18

జంగారెడ్డిగూడెం, జూలై 28: శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాల్వ విస్తరణ పనులకు 14 ఏళ్ల తరువాత మోక్షం లభించింది. కాల్వ విస్తరణ పనుల్లో భాగంగా తిరుమలాపురం సమీపంలో బయనేరు వాగుపై నిర్మించిన అక్విడెక్టుపై సాగునీటి ట్రయల్ రన్ ప్రారంభించారు. ఎర్రకాల్వ ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ నిర్దేశిత నిడివి ఐదు కిలోమీటర్లు. ఈ కాల్వ ఆయకట్టు కింద ఐదు వేల ఎకరాలకు సాగునీరందించడం తొలి లక్ష్యం.

07/29/2016 - 00:17

వేలేరుపాడు, జూలై 28: ఇటీవల సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన వేలేరుపాడు మండల రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సబ్ కలెక్టర్ షాన్ మోహన్ హామీ ఇచ్చారు. గురువారం మండలంలో పర్యటించి ఇసుక మేటలు వేసిన భూములను స్వయంగా చూశారు. అక్కడకు వచ్చిన రైతులనుద్దేశించి మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా వాగులు పొర్లి సాగు భూముల్లో ఇసుక మేటలు వేశాయన్నది గుర్తించిన ప్రభుత్వం సర్వే బృందాలు ఏర్పాటుచేసిందన్నారు.

07/29/2016 - 00:16

ఏలూరు, జూలై 28 : స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం చెలరేగింది. ఒక దశలో సభ్యుల మధ్య తీవ్రస్థాయి పదజాలం చెలరేగింది. చివరకు మేయర్ షేక్ నూర్జహాన్ జోక్యంచేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ అధ్యక్షతన గురువారం కౌన్సిల్ సమావేశం జరిగింది.

07/29/2016 - 00:15

భీమవరం, జూలై 28: భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ డైరెక్టర్ చంద్రశేఖర్ నాయుడు గురువారం దర్శించుకున్నారు. ఆలయంలో ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

07/29/2016 - 00:13

విజయనగరం, జూలై 28: రాష్ట్రంలో రైతుల భూములను ఇ-పాస్ విధానం పేరిట ఆన్‌లైన్ చేయటంలో ప్రభుత్వం, అధికారపార్టీ నాయకులు కుమ్మక్కై వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కో-కన్వీనర్ అజయ్ ఆరోపించారు. రైతుల భూములను కొల్లగొట్టాలనే దురాలోచనతోనే ఇ-పాస్ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శించారు.

Pages