S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/29/2016 - 00:37

దాచేపల్లి, జూలై 28 :ప్రతి మనిషి జీవితంలో అరుదుగా వచ్చే పవిత్రమైన కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయడంలో మీడియా కీలక పాత్ర వహిస్తుందని గురజాల ఎమ్మేల్యే యరపతినేని శ్రీనివాస రావు అన్నారు. గురువారం మండలంలోని పొందుగల, రామాపురం, తంగెడ, భట్రుపాలెం, కాట్రపాడు పుష్కర ఘాట్లను పరిశీలించిన ఎమ్మేల్యే పొందుగలలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.

07/29/2016 - 00:36

గుంటూరు (కల్చరల్), జూలై 28: సామాజిక బాధ్యతతో కవిత్వం రాసే తనకు మార్క్సిజం విశ్వదర్శనం చేయించిందని, వాస్తవంగా చెప్పాలంటే ఆ యిజమే నాకు దిక్సూచిగా నిలబడిందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి కె శివారెడ్డి పేర్కొన్నారు.

07/29/2016 - 00:35

తాడికొండ, జూలై 28: ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గత 30 సంవత్సరాలుగా పని చేస్తున్న టైంస్కేల్ ఉద్యోగులకు ఇతర యూనివర్శిటీలలో లాగా జీవో 119 అమలు చేయ్యాలని ఆచార్య ఎన్‌జిరంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ ఎంప్లారుూస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె నిరంజన్‌కుమార్ బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

07/29/2016 - 00:35

అమరావతి, జూలై 28: కృష్ణా పుష్కరాలు ప్రారంభ తేదీ మరో పక్షం రోజులకు రావడంతో అమరావతిలో జరుగుతున్న పుష్కర పనులన్నీ వేగం పుంజుకున్నాయి. అలాగే ఆయాశాఖలు తమ తమ పనులను ముమ్మరం చేశాయి. గ్రామ శివారులోని గుంటూరు, విజయవాడ, సత్తెనపల్లి రోడ్లలో సు మారు 20 వేల మందికి పైగా తాత్కాలిక బస కల్పించేవిధంగా ఏర్పాటుచేస్తున్న పుష్కరనగర్ పనులు ఊపందుకున్నాయి. షెడ్‌ల నిర్మాణం కూడా దాదాపు పూర్తికావచ్చింది.

07/29/2016 - 00:34

పెదనందిపాడు, జూలై 28: స్థానిక అశోక హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న అజయ్‌కుమార్, సయ్యద్ సత్తార్, తోకల అజయ్‌కుమార్ అనే ముగ్గురు విద్యార్థులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పెరేడ్ నిర్వహించేందుకు ఎంపికయ్యారు. జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ తరపున వీరు ఎంపికయ్యారు. అనంతపురంలో జరగనున్న స్వతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వీరు పాలు పంచుకోనున్నారు.

07/29/2016 - 00:33

మంగళగిరి, జూలై 28: అభివృద్ధి పనుల విషయంలో అధికారులు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై గురువారం నాడిక్కడ జరిగిన మంగళగిరి మండల పరిషత్ సమావేశంలో పలువురు సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. సమావేశానికి ఎంపిపి పచ్చల రత్నకుమారి అధ్యక్షత వహించారు.

07/29/2016 - 00:33

సత్తెనపల్లి, జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే కాని అభివృద్ధి పనులు జరగడంలేదని, వీరి పాలనతో ప్రజలు విసిగి పోయారని, ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్పాలని వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. గురువారం కూడా ఆయన భృగుబండ గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో, గ్రామ నాయకులతో మాట్లాడారు.

07/29/2016 - 00:31

కడప, జూలై 28:నియోజకవర్గాల పెంపుపై ఆలోచనలేదని ఇప్పట్లో జరగదని గురువారం కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రకటించడంతో 2019 ఎన్నికల టికెట్లకోసం చాలా మంది సైకిలెక్కడంతో ఆ పార్టీకి తలనొప్పిగా మారనుంది. తెలుగుదేశంపార్టీని నమ్ముకుని ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు తమకు రాజకీయ భవిష్యత్, మనుగడ ఉండదని ఢీలా పడ్డారు.

07/29/2016 - 00:31

రాజంపేట, జూలై 28: రాజంపేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి వేల్లునుకుంది. డబ్బులు ముట్టజెబితేతప్పా పనులు జరగడంలేదు. ఈ అవినీతిపై ఎసిబికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కాసులకు కక్కుర్తిపడి అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వంతపాడడం నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోంది.

07/29/2016 - 00:30

కడప, జూలై 28:రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ చౌకదుకాణాల నుంచి నిత్యావసర సరుకులు సక్రమంగా పంపిణీ చేసేందుకు నూతన విధి విధానాలు ఖరారు చేసి ప్రతి దుకాణానికి 500 కార్డులు కేటాటిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 1735 ప్రభుత్వ చౌక దాన్యపు దుకాణాలు ఉండగా ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డు లబ్ధిదారులను బట్టి 1672 చౌకదుకాణాలకు కుదించే అవకాశాలున్నాయి.

Pages