S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/29/2016 - 00:45

గంగవరం, జూలై 28: గంగవరం మండలం జగ్గంపాలెం సమీపంలో పోతన్నదొరపాలెం వద్ద ఏవిధమైన ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న బ్లాక్‌మెటల్ క్వారీని సీజ్ చేసినట్టు తహసీల్దార్ పినిపే సత్యనారాయణ తెలిపారు. జగ్గంపాలెం సమీపంలో అక్రమ క్వారీ నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో గురువారం మధ్యాహ్నం క్వారీని సందర్శించి క్వారీ నిర్వహణ జరుగుతున్నట్టు గుర్తించామన్నారు.

07/29/2016 - 00:45

రాజమహేంద్రవరం, జూలై 28: విశాఖ ఏజెన్సీ నుంచి అనపర్తి మీదుగా హైదరాబాద్‌కు కోటిన్నర విలువైన గంజాయిని రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడిన కేసులో నిందితునిగా ఉన్న గొలుగూరి వెంకట సత్యనారాయణరెడ్డి(62) గురువారం తెల్లవారుజామున హఠాన్మరణం చెందాడు. పోలీసులు, జైలు వర్గాల కథనం ప్రకారం ఈ నెల 25న సత్యనారాయణరెడ్డిని అరెస్టుచేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

07/29/2016 - 00:44

పెద్దాపురం, జూలై 28:ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులపైనే ఉందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ నేతలకు ఉపదేశించారు.

07/29/2016 - 00:44

రావులపాలెం, జూలై 28: గోదావరి అంత్య పుష్కరాలకు మరో రెండు రోజులే సమయం ఉన్నా ప్రభుత్వం ఏర్పాట్లకు సంబంధించి ఎటువంటి నిధులు మంజూరు చేయకపోవడంతో ఘాట్లలో సౌకర్యాల కల్పనకు అధికారులు ముందుకు రావడం లేదు. దీంతో ఆది పుష్కరాలకు కనిపించిన ఆర్భాటంలో పదోవంతు కూడా అంత్య పుష్కరాల్లో కానరావడం లేదు.

07/29/2016 - 00:43

రాజమహేంద్రవరం, జూలై 28: తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ పథకం కింద గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 7కోట్ల విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేసిందన్నారు.

07/29/2016 - 00:43

శంఖవరం, జూలై 28: కత్తిపూడి నుంచి పామర్రు వెళ్లే 214వ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు, గృహాలు కోల్పోయిన నిర్వాసితులు, బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తానని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు అన్నారు.

07/29/2016 - 00:42

కాకినాడ రూరల్, జూలై 28: యాజమాన్యాల నిర్లక్ష్యంవల్లే కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. శశికాంతనగర్‌లోని నారాయణ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం (ఎంపిసి) విద్యార్థిని గెడ్డం భారతి (17) కళాశాల స్టడీ రూమ్‌లో గురువారం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

07/29/2016 - 00:41

గుంటూరు, జూలై 28: రాష్ట్రప్రభుత్వం పిలుపుమేరకు ఈనెల 29 చేపట్టనున్న వనం-మనం కార్యక్రమాన్ని ఉద్యమస్ఫూర్తితో విజయవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. గురువారం బాపట్ల నియోజకవర్గం చుండూరుపల్లి గ్రామంలో 4.25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్‌తో కలిసి ప్రారంభించారు.

07/29/2016 - 00:40

గుంటూరు, జూలై 28: ఆసియాలోకెల్లా అతి పెద్దదయిన గుంటూరు మిర్చియార్డులో అక్రమ లైసెన్స్‌ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గతంలో యార్డు కార్యదర్శిగా పనిచేసిన నరహరి 293 మందికి దాదాపు అప్పట్లో రెన్యువల్స్ నిలిపివేశారు. ట్రేడర్ల మధ్య ఏర్పడిన పోటీతో ఓ వర్గానికి అప్పటి కార్యదర్శి వత్తాసుపలికి మిగిలిన వారికి రెన్యువల్‌ను నిలిపివేశారు.

07/29/2016 - 00:39

గుంటూరు (కొత్తపేట), జూలై 28: రైతుసాధికారతే తెలుగుదేశం ధ్యేయమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జివి ఆంజనేయులు పేర్కొన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జిల్లా రైతు కార్యవర్గ సమావేశం రైతు సంఘ అధ్యక్షుడు కడియం కోటి సుబ్బారావు అధ్యక్షతన జరిగింది.

Pages