S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/29/2016 - 00:12

విజయనగరం, జూలై 28: రెవెన్యూ డివిజన్ పరిధి, పోలీసు డివిజన్ పరిధి ఒకేలా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టం చేసిన నేపథ్యంలో జిల్లాలో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం పోలీసు సబ్‌డివిజన్ కేంద్రంగా ఉన్న బొబ్బిలి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారా? లేక గతంలో ప్రతిపాదించిన విధంగా చీపురుపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అవుతుందా?

07/29/2016 - 00:11

విజయనగరం జూలై 28: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు బహిరంగ మలవిసర్జన రహిత పట్టణాలుగా మార్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలోని 11 మున్సిపాలిటీల్లో మొదటి విడతగా ఎన్టీఆర్ క్యాంటీన్లను ఏర్పాటుకు నిర్ణయించామని చెప్పారు.

07/29/2016 - 00:09

విజయనగరం, జూలై 28: మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కాళిదాసు ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలో ర్యాగింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, ర్యాగింగ్‌కు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.

07/29/2016 - 00:08

విజయనగరం, జూలై 28: జిల్లానుంచి బదిలీపై వెళుతున్న కలెక్టర్ ఎంఎం నాయక్‌ను జిల్లా పోలీసు అధికారులు ఘనంగా సన్మానించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాళిదాసు, అదనపు ఎస్పీలు అప్పలనాయుడు, రమణ, ఇతర పోలీసు అధికారులు కలెక్టర్ నాయక్‌ను పూలమాలలతో సన్మానించి మెమెంటో అందజేశారు.

07/29/2016 - 00:08

విజయనగరం(పూల్‌బాగ్),జూలై 28: పర్యావరణ పరిరక్షణకు దోహదపడే వృక్ష సంపదను అభివృద్ధి చేయడంలో ప్రజలను భాగస్వాములను చేయడమే వనం-మనం ర్యాలీ ముఖ్య ఉద్ధేశ్యమని జిల్లా అటవీశాఖ అధికారి రమణమూర్తి అన్నారు.గురువారం పట్టణంలోని ట్యాంక్‌బండ్‌రోడ్డులోని పెట్రోల్ బంక్ దరి వనం-మనం భారీ బైక్‌ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

07/29/2016 - 00:07

విజయనగరం, జూలై 28: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వనం-మనం విజయవంతానికి జిల్లా ప్రజలు సహకరించాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని కోరారు. శుక్రవారం ప్రారంభమయ్యే కార్యక్రమంలో రాష్టవ్య్రాప్తంగా 1.30కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా తీసుకున్నామని, విజయనగరం జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే 13లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ధేశించారని చెప్పారు.

07/29/2016 - 00:07

విజయనగరం, జూలై 28: మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కాళిదాసు ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలో ర్యాగింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, ర్యాగింగ్‌కు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.

07/29/2016 - 00:06

విజయనగరం, జూలై 28: జిల్లానుంచి బదిలీపై వెళుతున్న కలెక్టర్ ఎంఎం నాయక్‌ను జిల్లా పోలీసు అధికారులు ఘనంగా సన్మానించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాళిదాసు, అదనపు ఎస్పీలు అప్పలనాయుడు, రమణ, ఇతర పోలీసు అధికారులు కలెక్టర్ నాయక్‌ను పూలమాలలతో సన్మానించి మెమెంటో అందజేశారు.

07/29/2016 - 00:06

విజయనగరం (్ఫర్టు), జూలై 28: మున్సిపాలిటీలో ప్యానల్ కమిటీ ఏర్పాటుకు సభ్యుల ఎంపిక ఒక కొలిక్కి రాలేదు. మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ సమక్షంలో సభ్యులను ఎన్నుకునేందుకు గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చాలామంది కౌన్సిల్‌సభ్యులు డుమ్మా కొట్టారు. ప్యానల్ కమిటీ ఏర్పాటుపై మరికొంతమంది సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

07/29/2016 - 00:05

విజయనగరం (్ఫర్టు), జూలై 28: విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ డిపోలు, బస్‌స్టేషన్‌ల అభివృద్ధికి ప్రణాళికలు తయారుచేస్తామని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.వెంకటరాజు తెలిపారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు బదిలీపై వచ్చిన ఆయన గురువారం ఇక్కడ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు.

Pages