S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/28/2016 - 23:38

పాన్‌గల్, జూలై 28: పాలమూరు జిల్లాలోని భీమ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కెఎల్‌ఐ, జూరాల ప్రాజెక్టుల ద్వారా రైతాంగానికి ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తామని పంచాయిత్‌రాజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండల పరిదిలోని కేతేపల్లి, గోపల్‌దినే్న, చింతకుంట, మాందాపూర్, మల్లాయిపల్లి గ్రామాల వెంట ఉన్న భీమ, జూరాల కాలువలను ఆయన పరిశీలించారు.

07/28/2016 - 23:37

ఆత్మకూర్, జూలై 28: కృష్ణానదికి వరద రావడంతో దిగువ జూరాలలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ జూరాల వద్ద జెన్‌కో డైరెక్టర్ కెఆర్‌కె రెడ్డి ఆధ్వర్యంలో రెండు యూనిట్ల ద్వారా 80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.

07/28/2016 - 23:37

దౌల్తాబాద్, జూలై 28: నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకం సాదించేవరకు పోరాటం అగదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెల్చి చెప్పారు. గురువారం నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతల పథకం మహపాదయాత్ర దౌల్తాబాద్ మండలంలో కొనసాగింది.

07/28/2016 - 23:36

షాద్‌నగర్, జూలై 28: రాష్ట్ర వ్యాప్తంగా 8695 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, వాటిలో 460 పంచాయతీల్లో బిటి రోడ్లు లేవని, రెండేళ్లలో బిటి రోడ్లను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ సత్యనారాయణరెడ్డి తెలిపారు.

07/28/2016 - 23:36

షాద్‌నగర్ రూరల్, జూలై 28: హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించేది లేదని, చర్యలు తప్పవని పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ సత్యనారాయణరెడ్డి అన్నారు. గురువారం ఫరూఖ్‌నగర్ మండలం నాగులపల్లి గ్రామంలో పంచాయతీ రాజ్‌రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటారు.

07/28/2016 - 23:35

గద్వాల, జూలై 28: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తుందని, ఇక్కడ పుష్కర స్నానాల కోసం వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. గురువారం కృష్ణానది పరీవాహక ప్రాంతాలలో నిర్మిస్తున్న పుష్కరఘాట్లను పరిశీలించారు.

07/28/2016 - 23:33

నల్లగొండ టౌన్, జూలై 28 : తెలంగాణాలో ఎంసెట్-2 పేపర్ లీకేజ్‌ను నిరసిస్తూ, అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం పిడిఎస్‌యు ఆద్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్. ప్రదీప్ మాట్లాడుతూ అందుకు బాధ్యతగా విద్యాశాఖ మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

07/28/2016 - 23:33

నల్లగొండ, జూలై 28: టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రభుత్వం జాప్యం చేస్తుండటం పట్ల గులాబీ తమ్ముళ్లు గుస్సా వ్యక్తం చేస్తున్నారు. టిఆర్‌ఎస్ జిల్లా, నియోజకవర్గ, మండల నేతలు కార్పోరేషన్ పదవులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, దేవాలయ కమిటీల చైర్మన్లపై ఆశలు పెట్టుకున్నారు.

07/28/2016 - 23:32

మిర్యాలగూడ, జూలై 28: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత జరుగుతాయన్న మార్పులు కళ్లకు కొట్టొచ్చినట్టు జరుగుతున్నాయని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు.

07/28/2016 - 23:31

భువనగిరి, జూలై 28: బస్వాపురం రిజర్వాయర్ సామర్థ్యాన్ని 11.38టి ఎంసిలకు తగ్గించి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని, భూనిర్వాషితులకు 2013్భసేకరణ పునరావాసం చట్టం క్రింద నష్టరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం భువనగిరి ఆర్‌డిఒ కార్యాలయం ముందు బస్వాపురం రిజర్వాయర్ భూనిర్వాసితులు నిరవధిక సమ్మె చేపట్టారు.

Pages