S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/28/2016 - 23:31

సూర్యాపేట, జూలై 28: ఇటీవలే సూర్యాపేట ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన సి.నారాయణరెడ్డి పాలనలో తనదైన మార్క్ చూపేడుతున్నారు. బాధ్యతలు స్వీకరించిన రెండోరోజే ఏరియా ఆసుపత్రిని, ఫైలేరియా విభాగాన్ని తనిఖీచేసి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు ఉద్యోగులకు మోమో జారీచేశారు.

07/28/2016 - 23:29

బాసర, జూలై 28: బాసర గ్రామానికి, ఆలయానికి తాగునీరు అందించే ఫిల్టర్‌బెడ్‌ను గురువారం జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మల్లేష్‌గౌడ్ పరిశీలించారు. గోదావరిలో పుష్కలంగా నీరు ఉన్నా గ్రామానికి, ఆలయానికి తాగునీరు సరఫరా కావడం లేదని స్థానిక సర్పంచ్ శైలజా సతీశ్వర్‌రావు ఎస్‌ఈ దృష్టికి తీసుకువచ్చారు.

07/28/2016 - 23:29

ఆసిఫాబాద్, జూలై 28: దళారుల జోక్యాన్ని తగ్గించేందుకే ప్రభుత్వం రవాణా సేవలను అన్‌లైన్ ద్వారా అందించేందుకు సిధ్దమైందని ఆసిఫాబాద్ సబ్‌కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. ఆగష్టు 2వ తేదీ నుండి ఈసేవలు ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి రానున్న నేపథ్యంలో డివిజన్‌లోని ఆయా మండలాలకు చెందిన మీసేవ, ఈసేవ నిర్వాహకులకు గురువారం డివిజన్ కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు.

07/28/2016 - 23:29

ఆదిలాబాద్ రూరల్, జూలై 28: కానిస్టేబుళ్ళ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈనెల 15 నుండి అభ్యర్థులకు నిర్వహించిన దేహాదారుఢ్య పరీక్షలు గురువారంతో ముగిశాయని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ తెలిపారు. చివరి రోజు గురువారం హెడ్‌క్వార్టర్స్‌లోని పరేడ్ మైదానంలో నిర్వహించిన పరీక్షలకు 455 మంది అభ్యర్థులు హాజరుకాగా వారికి ముందుగా 800 మీటర్ల పరుగు పరీక్షను నిర్వహించడం జరిగిందన్నారు.

07/28/2016 - 23:28

వేమనపల్లి, జూలై 28: హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గురువారం నీల్వాయి వాగులో నాటుపడవలో ప్రయాణం చేసి మండల కేంద్రమైన వేమనపల్లిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ఉద్యమంలా కొనసాగుతుందన్నారు.

07/28/2016 - 23:28

బెల్లంపల్లి, జూలై 28: అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఎంసెట్ 1,2 పేపర్ లీకేజీ ప్రధాన నిందితుడు రాజగోపాల్ రెడ్డి,ఎంసెట్ కన్వీనర్ రమణారావు,విద్యా,వైద్య రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహరి,లక్ష్మారెడ్డిల పొటోలతో కూడిన ఫ్లెక్సిలను పట్టణంలోని బజార్ ఏరియాలో దగ్ధం చేశారు.

07/28/2016 - 23:27

ఉట్నూరు, జూలై 28: గిరిజన గ్రామాల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఆశాకార్యకర్తల పాత్ర కీలకమని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ అన్నారు. గురువారం స్థానికంగా ఆశాకార్యకర్తల సమ్మేళనం మొదటిసారి నిర్వహించా పెద్దఎత్తున ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.

07/28/2016 - 23:27

ఆదిలాబాద్, జూలై 28: ఆదిలాబాద్ మాజీ శాసన సభ్యుడు విఠల్‌రావు దేశ్‌పాండే (84) గురువారం హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుముశారు. 1932 ఫిబ్రవరి 1న జన్మించిన విఠల్‌రావ్ దేశ్‌పాండే గత రెండు నెలలుగా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

07/28/2016 - 23:25

నిర్మల్, జూలై 28: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పకడ్భందీగా అమలయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్‌లోని ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో హరితహారం కార్యక్రమంపై నియోజకవర్గస్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

07/28/2016 - 23:25

జన్నారం, జూలై 28: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక, సంతానం కాలేదన్న మనస్థాపంతో ఓ గిరిజన యువ దంపతులు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గోండుగూడెంలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే జన్నారం మండలం కలమడుగు గ్రామ పరిధిలోని గోండుగూడకు చెందిన పెందూర్ కిరణ్ (26) పెందూర్ అంజలి(23)కి మూడేళ్ల కిందట వివాహం జరిగింది.

Pages