S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 05:08

కావలి, జూలై 26: కావలి మున్సిపల్ కార్మికులు కొంతమంది పిఎఫ్ ఖాతాపై రుణాలకోసం దరఖాస్తు చేసుకోగా రుణ మంజూరుకు కడప పిఎఫ్ ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది లంచం కోసం వేధిస్తూ కొంతకాలంగా తిప్పుకుంటున్నారు. ఒక్కొక్కరికి 3 వేల రూపాయల వంతున డిమాండ్ చేస్తుండగా దాదాపు 60 మంది వరకు కార్మికులు రుణాల కోసం దరఖాస్తులు చేసుకుని ఉన్నారు.

07/27/2016 - 05:06

చీమకుర్తి, జూలై 26 : చీమకుర్తి పట్టణం జవహర్ హాస్పిటల్‌లోని అంధుల హాస్టల్‌లో గుంటూరు కిట్టు (16) అనే విద్యార్థి కరెంటు తీగ తగిలి మృతిచెందిన సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చీమకుర్తి ప్రభుత్వ జూనియర్ కాలేజిలో గుంటూరు కిట్టు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజిలోని క్లాస్‌రూంలో కరెంటు బోర్డు పక్కన కూర్చొని ఉన్నాడు.

07/27/2016 - 05:05

ఒంగోలు, జూలై 26 : జిల్లాల్లోని కళాశాలల్లో ర్యాగింగ్ నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక సిపివో సమావేశ మందిరంలో ర్యాగింగ్ నిరోధ విధానంపై పోలీసులు, కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు.

07/27/2016 - 05:04

విజయవాడ, జూలై 26:ఏ పార్లమెంట్ సాక్షిగా తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారో, అదే పార్లమెంట్ సాక్షిగా ఏపికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మంత్రివర్గ సమావేశం వివరాలను వెల్లడించేందుకు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి, రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని నిశితంగా విమర్శించారు.

07/27/2016 - 05:04

కందుకూరు, జూలై 26: స్థానిక ఆర్టీసీ డిపో వద్ద డిపోలోకి బస్సులు వెళ్లే రోడ్డు మార్జిన్‌లో ఎన్నో ఏళ్లుగా చిన్నచిన్న బంకులు ఏర్పాటు చేసుకుని గాజులు, చెప్పులు తదితర వ్యాపారాలు నిర్వహించుకుంటూ జీవనం కొనసాగిస్తున్న చిరు వ్యాపారుల దుకాణాలను ఇటీవల అంకమ్మ తల్లి తిరునాళ్లలో భాగంగా తొలగించారు.

07/27/2016 - 05:03

ఒంగోలు, జూలై 26 : జిల్లావ్యాప్తంగా పాఠశాల యజమాన్య కమిటీ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మంగళవారం జారీ చేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఓటర్ల జాబితాలను మంగళవారం ఆయా పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు ప్రకటించారు. ఈ నెల 29న 3 గంటలకు ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలు ఉంటే తెలియచేయవచ్చు. సాయంత్రం 4 గంటలకు ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు.

07/27/2016 - 05:02

పొదిలి, జూలై 26 : ప్రభుత్వ వైద్య సిబ్బంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు కోరారు. మంగళవారం ఆయన ఉప్పలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి బ్రహ్మతేజను ఆరోగ్య కేంద్రం నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే సిబ్బంది హాజరు రిజిస్టర్లు పరిశీలించారు.

07/27/2016 - 05:02

జరుగుమల్లి, జూలై 26: ప్రజాసాధికార సర్వేకు మండల ప్రజలు సహకరించాలని డిటి బాలకిషోర్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కె బిట్రగుంట గ్రామంలో జరుగుతున్న ప్రజాసాధికార సర్వేను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే ప్రారంభంలో కొంత జాప్యం జరిగినప్పటికీ ప్రస్తుతం రెండు రోజులుగా సర్వర్ బాగా పనిచేయడంతో ప్రజాసాధికార సర్వే వేగవంతంగా జరుగుతోందన్నారు.

07/27/2016 - 05:01

చీరాల, జూలై 26: పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని ఈ నెల 30న ఉదయం 10.30 గంటలకు కార్యాలయంలోని సమావేశపు హాల్లో నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తలారి బ్రహ్మయ్య తెలిపారు.

07/27/2016 - 05:01

కడప, జూలై 26: వర్షానికి నానిన పాత మిద్దె కుప్పకూలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటన కడప జిల్లా మైదుకూరు మండలం గంజికుంట గ్రామపంచాయతీ ఉచ్చలవరంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. అంగంపల్లె చిన్నగురువయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రించాడు.

Pages