S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 04:40

గజపతినగరం, జూలై 26: ఎగువన కురిసిన భారీ వర్షాలకు ఖరీఫ్ ప్రారంభమై మూడు నెలలు తరువాత చంపావతి నదిలోకి వరద నీరు చేరి నీటితో కళకళలాడుతోంది. ఇంతవరకు నదిలో పశువులు తాగేందుకు సహితం నీరు ప్రవహించని పరిస్థితి ఉండేది. సోమవారం సాయంత్రం గంట్యాడ మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో భారీవర్షం కురవడంతో గుర్లగెడ్డ రిజర్వాయర్ నుండి వచ్చే వరదనీరు చంపావతి నదిలోకి చేరింది.

07/27/2016 - 04:39

బొబ్బిలి (రూరల్), జూలై 26: పట్టణంలో అసంపూర్తిగా ఉన్న పనులను శరవేగంగా పూర్తిచేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఇంజనీరింగ్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పట్టణంలో రోడ్లు, కాలువలు అసంపూర్తిగా ఉన్నవాటిని శరవేగంగా పూర్తిచేయాలన్నారు. ఇప్పటికే వర్షాలు పడడంతో పనులు జరగడానికి ఇబ్బందిగా ఉంటుందన్నారు.

07/27/2016 - 04:39

రామభద్రపురం, జూలై 26: జిల్లాలో ఫెర్రోఎల్లాయిస్, జ్యూట్ పరిశ్రమలు మూతబడడంతో వేలాదిమంది కార్మికులు రోడ్డునపడ్డారని, వీరిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు జిల్లా టిఎన్‌టియుసి ప్రధాన కార్యదర్శి మమ్ముల తిరుపతిరావు వినతిపత్రం అందజేశారు.

07/27/2016 - 04:38

విజయనగరం (్ఫర్టు), జూలై 26: పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎ మ్మెల్యే మీసాల గీత ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం అభివృద్ధి పనులపై అధికారులు, కౌన్సిల్ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గీత మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న అభివృ ద్ధి పనులను త్వరతగతిన పూర్తి చేయాలని తెలిపారు.

07/27/2016 - 04:37

ఏలూరు, జూలై 26 : వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని తొలగించేందుకు రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి సుస్థిర వ్యవసాయాభివృద్ధికి రాష్ట్ర వ్యవసాయ కమిషన్ తగు సూచనలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ రాధాకృష్ణ చెప్పారు.

07/27/2016 - 04:36

ఆకివీడు, జూలై 26: చినకాపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. రాష్టవ్య్రాప్తంగా చినకాపవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు వింత వ్యాధి సోకి పడిపోతున్నారన్న వార్త సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మూడురోజుల పాటు పాఠశాలకు సెలవులు ప్రకటించింది. మంగళవారం పాఠశాల యథావిథిగా తెరిచారు.

07/27/2016 - 04:36

నిడదవోలు, జూలై 26: ఆరు మండలాల్లోని 46 గ్రామాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల వ్యవహారాలకు కేంద్రమైన నిడదవోలు సబ్-రిజిస్ట్రారు కార్యాలయంలో ప్రజలు నిత్యం వెతలకు గురవుతున్నారు. సబ్-రిజిస్ట్రార్ సహా కార్యాలయానికి చెందిన అత్యధిక శాతం ఉద్యోగులు ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటూ, విధులకు హాజరవుతుండటంతో ఆ ప్రభావం ప్రజలపై పడుతోంది.

07/27/2016 - 04:34

వీరవాసరం, జూలై 26: వీరవాసరం ఎంపిడిఒ కార్యాలయం వద్ద వివాదానికి కారణమైన గొయ్యిను మంగళవారం పూడ్చివేశారు. గత వారంరోజుల క్రితం తవ్విన ఈ గోతిలో సోమవారం ఇరువురు పడి గాయపడ్డారు. దాంతో ఈ గొయ్యిని పూడ్చాలంటూ పలువురు ప్రజావాణిలో ఫిర్యాదుచేశారు. గొయ్యివల్ల ప్రజలకు ఇబ్బంది ఉందంటూ తహసీల్దార్ తిలక్ కూడ ఎంపిడిఒ జగదాంబతో వాగ్వాదానికి దిగారు.

07/27/2016 - 04:34

భీమవరం, నరసాపురం, జూలై 26: భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో గోదావరి మెగా ఆక్వాఫుడ్‌పార్కు నిర్మాణంపై పలు సందేహాలను నివృత్తి చేసేందుకు భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేశాయ. తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామపెద్దలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నరసాపురం సబ్ కలెక్టర్ ఎఎస్ దినేష్‌కుమార్ మంగళవారం ప్రకటించారు.

07/27/2016 - 04:33

తాడేపల్లిగూడెం, జులై 26: దేశం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమర జవాన్ల త్యాగాన్ని భారతజాతి ఎప్పుడూ గుర్తించుకుంటుందని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. కార్గిల్ విజయ దివస్ సందర్భంగా రూరల్ మండలం మిలటరీ మాధవరంలో అమర జవాన్ల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు.

Pages