S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 04:47

విశాఖపట్నం, జూలై 26: జిల్లాను హరిత వనంగా తీర్చిదిద్దాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో అటవీశాఖ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వనం-మనం కార్యక్రమాన్ని చేపడుతోందని తెలిపారు.

07/27/2016 - 04:47

నక్కపల్లి, జూలై 26: పాయకరావుపేట మండలంలోని పాల్మన్‌పేట మత్స్యకార సామాజిక వర్గీయులపై జరిగిన దాడుల్లో గాయపడిన బాధితులకు ప్రభుత్వంతో సమానంగా తమ పార్టీ కూడా ఆర్థిక సదుపాయం (పరిహారం) అందజేస్తుందని జిల్లా వైకాపా అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. మంగళవారం ఇక్కడకు వచ్చిన ఆయన ఇక్కడి వైఎస్సాఆర్ సిపి కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు.

07/27/2016 - 04:46

సీలేరు, జూలై 26: ఆంధ్రా - ఒడిషా సరిహద్దుల్లో మంగళవారం రెండు హెలికాప్టర్లు గగనంలో చక్కెర్లు కొట్టాయి. దీంతో ఎ. ఓ.బి. సరిహద్దు గిరిజనుల్లో ఆందోళన నెలకొంది. ఎటువంటి ప్రమాదం నెలకొందోనని గిరిజనులు భయాందోళన చెందారు. పి. ఎల్.జి. ఎ వారోత్సవాలు ఈనెల 28 నుంచి ఆగస్టు 2 వరకు మావోయిస్టులు విజయవంతం చేయాలని విస్తృత ప్రచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయ్యారు.

07/27/2016 - 04:45

విశాఖపట్నం, జూలై 26: నగరంలో నిర్మించనున్న ఐటి ఇంక్యుబేషన్ సెంటర్‌కు పనులకు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సిపిడబ్ల్యుడి) రూపంలో సమస్య వచ్చి పడింది. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఇండియా (ఎస్‌టిపిఐ), విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) సంయుక్తంగా ఈ ఇంక్యుబేషన్ సెంటర్‌ను నిర్మించేందుకు నిర్ణయించారు.

07/27/2016 - 04:45

అనకాపల్లి(నెహ్రూచౌక్), జూలై 26: వరుణుడు కరుణించినా అదునుమీద వరినాట్లు వేయలేని పరిస్థితి నెలకుంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు రైతులు వరినాట్లు వేయడానికి సిద్ధపడుతున్నారు. అయితే వ్యవసాయ పనులు చేయడానికి కూలీలు ముందుకు రాకపోవడంతో వరినాట్లు వేయడానికి కూలీల కొరత వెంటాడుతుంది.

07/27/2016 - 04:43

విజయనగరం(టౌన్), జూలై 26: సంచలనం సృష్టించిన గాజులరేగ యువతిపై కత్తితో దాడిచేసిన సంఘటనపై పోలీసు యంత్రాంగం వేగంగా స్పందించింది. యువతిని కత్తితో గాయపరచి పరారైన నిందితుడు విక్రమ్‌ను సంఘటన జరిగిన 24గంటలలోపే అదుపులోకి తీసుకుని అతనిపై నిర్భయ చట్టం, హత్యాయత్నం ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నట్లు విజయనగరం డిఎస్పీ ఎ.వి.రమణ వెల్లడించారు.

07/27/2016 - 04:42

విజయనగరం (్ఫర్టు), జూలై 26: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ విజయనగరం జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.రామకృష్ణ తెలిపారు. స్ధానిక ఆర్టీసీ బస్‌స్టేషన్‌ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యాలపై ఆరా తీశారు. బస్‌స్టేషన్‌లలో మంచినీటి సదుపాయం, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు.

07/27/2016 - 04:42

విజయనగరం (్ఫర్టు), జూలై 26: వచ్చేనెల 12 నుంచి 23వతేదీ వరకు జరిగే కృష్ణా పుష్కరాలకు ఉత్తరాంధ్ర నుంచి 150 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించామని ఆర్టీసీ విజయనగరం జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.రామకృష్ణ వెల్లడించారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోని అన్ని డిపోల నుంచి ప్రతీరోజూ 200 ట్రిప్పులు తిప్పుతామని, దీనికి అన్ని ఏర్పాట్లు ఇప్పటినుంచే చేస్తున్నామన్నారు.

07/27/2016 - 04:41

విజయనగరం(టౌన్), జూలై 26: జిల్లాలోని డెంకాడ మండలం మోదవలస గ్రామంలో బైబిల్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రసన్నబాబుపై వచ్చిన ఆరోపణలపై లోతైన దర్యాప్తు నిర్వహిస్తున్నామని విజయనగరం డిఎస్పీ ఎ.వి.రమణ వెల్లడించారు.

07/27/2016 - 04:41

గజపతినగరం, జూలై 26: జిల్లాలో 250 రైస్ క్లబ్‌లు ఏర్పాటుచేశామని నాబార్డు ఎజిఎం ఆర్.శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సహకార సంఘాల సభ్యులకు ఇస్తున్న శిక్షణ లో భాగంగా రెండవ రోజు ముఖ్య అతిథిగా హాజరై సభ్యులకు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్లబ్‌ల ద్వారా ఎంపిక చేసిన రైతులతో జిల్లాలో ఐదు ప్రాంతాలలో ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేశామని చెప్పారు.

Pages