S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/26/2016 - 12:50

కడప: భారీ వర్షానికి ఇల్లంతా నానిపోయి పైకప్పు కూలడంతో అయిదుగురు వ్యక్తులు నిద్రలోనే సజీవ సమాధి అయ్యారు. మైదుకూరు మండలం ఉత్సలవరంలో మంగళవారం తెల్లవారు జామున ఈ దుర్ఘటన జరిగింది. ఇంటి యజమాని గురప్ప (55), అతని భార్య పెంచలమ్మ (50), కుమార్తె హరిత (23), మనవలు నవనీత్ (5), యశ్వంత్ (18 నెలలు) ఈ దుర్ఘటనలో మృత్యువాత పడ్డారు. మరో కుమార్తె లలిత, మనవరాలు నిహారిక గాయపడ్డారు.

07/26/2016 - 12:49

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్‌లో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. నౌగామ్ వద్ద మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఓ ఉగ్రవాదిని సైనికులు పట్టుకున్నారు.

07/26/2016 - 12:49

కడప: భవిష్యనిధి (పిఎఫ్) రుణాలను మంజూరు చేసేందుకు లంచం తీసుకుంటున్న పిఎఫ్ కార్యాలయం గుమస్తాను సిబిఐ అధికారులు మంగళవారం వలపన్ని పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీలో ముగ్గురు కార్మికులు తమ పిఎఫ్ ఖాతాల నుంచి రుణం కోసం దరఖాస్తు చేశారు. కడపలోని పిఎఫ్ కార్యాలయంలో గుమస్తా దానం ఇందుకు లంచం అడిగాడు. దీంతో ఆ కార్మికులు సిబిఐ అధికారులకు ఫిర్యాదు చేశారు.

07/26/2016 - 12:48

విజయవాడ: అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి, కృష్ణా పుష్కరాల సమయానికి ఇక్కడి ఇంద్రకీలాద్రిని అన్ని విధాలా తీర్చిదిద్దాలని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అధికారులను ఆదేశించారు. ఆయన మంగళవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై చేపడుతున్న పనులను పరిశీలించారు. పుష్కరాల సమయంలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ ఆలయాన్ని సందర్శించేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారని, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలన్నారు.

07/26/2016 - 12:48

విజయవాడ: ఎపి మంత్రివర్గ సమావేశం సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం ఇక్కడ ప్రారంభమైంది. ఆగస్టు 12 నుంచి జరిగే కృష్ణా పుష్కరాలపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. రాజధాని అమరావతి నిర్మాణం, మనం-వనం, ఎర్రచందనం వేలం, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపై మంత్రివర్గ సహచరులతో సిఎం చర్చించే అవకాశం ఉంది.

07/26/2016 - 12:47

హైదరాబాద్: నిర్వాసిత రైతులపై లాఠీచార్జికి నిరసనగా ‘చలో మల్లన్నసాగర్’ యాత్రకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేయడంతో మంగళవారం ఉదయం నగరంలోని గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. గాంధీభవన్ నుంచి కాంగ్రెస్ నేతలను బయటికి వెళ్లనీయకుండా పోలీసులు భారీసంఖ్యలో మోహరించారు.

07/26/2016 - 12:44

ఢాకా: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో సోమవారం అర్ధరాత్రి ఉగ్రవాదులను పోలీసులు సమర్థంగా తిప్పికొట్టారు. 10 మంది ఉగ్రవాదులు ఓ భవనంలోని నాలుగో అంతస్థులోకి చొరబడి దాడులకు పాల్పడేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు భవనాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. తెల్లవారుజామున ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య రెండు గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

07/26/2016 - 12:39

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టగా - చర్చకు రాకుండా భాజపా సభ్యులు అడ్డుకుంటున్నారని, తన హక్కులకు భంగం కలిగించారని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్‌) సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.

07/26/2016 - 12:33

దిల్లీ: దేశ రక్షణ కోసం చివరి శ్వాస వరకూ పోరాడిన సైనికులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని అమరవీరులకు ట్విట్టర్‌ వేదికగా నివాళులర్పించారు. 1999 మేలో భారత్‌లో పాక్‌ సైనికులు చొరబడేందుకు ప్రయత్నించడంతో ఇరు దేశాల మధ్య కార్గిల్‌ యుద్ధం జరిగింది.

07/26/2016 - 11:57

హైదరాబాద్‌: మంగళవారం ఉదయం నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌, మెహిదీపట్నం, లక్డీకాపూల్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, నాచారం, సికింద్రాబాద్‌, శంషాబాద్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అమీర్‌పేట ప్రాంతాల్లో ఉదయం 6గంటల నుంచి కుండపోతగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరింది. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది.

Pages